Late Age Pregnant : లేటు వయస్సులో గర్భందాల్చటం శ్రేయస్కరమేనా? గర్భదారణ ఏ వయసులో అనువైనదంటే?

30 దాటి గర్భం దాల్చేవారిలో అబార్షన్లు అధికశాతం ఉంటాయి. 35 నుంచి 40 ఏళ్లు దాటిన మహిళల్లో అండాల నాణ్యత తగ్గడం వల్ల అబార్షన్లయ్యే అవకాశాలు మరింత ఎక్కువని వైద్యనిపుణులు చెబుతున్నారు.

Late Age Pregnant : లేటు వయస్సులో గర్భందాల్చటం శ్రేయస్కరమేనా? గర్భదారణ ఏ వయసులో అనువైనదంటే?

pregnant at a late age

Late Age Pregnant : మహిళలు పెళ్లి తర్వాత గర్భధారణను మూడు నుంచి నాలుగేళ్ల పాటు వాయిదా వేసి, ఆ తర్వాత ప్రయత్నాలు మొదలుపెడతారు. ఇలా లేటు వయసులో పిల్లలను కనడం వల్ల దుష్ప్రయోజనాలే ఎక్కువని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ముప్పై ఏళ్ల లోపే గర్భం దాల్చడం మేలని సూచిస్తున్నారు. గర్భధారణను ఆలస్యం చేయడం, ఆలస్యంగా గర్భం దాల్చే పరిస్థితుల కారణంగా ఆప్రభావం తల్లి మీదా, ఇటు బిడ్డ మీదా దుష్ప్రభావం పడే అవకాశాలు ఉంటాయి. ఉరుకుల పరుగుల జీవితం, చదువు, వృత్తిలో పోటీతత్వాలు మహిళల్లో మానసిక ఒత్తిడికి కారణాల వల్ల చాలా మంది మహిళలు గర్భదారణను వాయిదా వేస్తున్నారు. అధిక పనిగంటలు కూర్చొని ఉండటం, శారీర వ్యాయామం లేకపోవటం , ఆహారపు అలవాట్లు, ఊబకాయం వంటి వాటి మూలంగా సంతానోత్పత్తికి ఆటంకాలు కలుగుతున్నాయి.

సాధారణంగా 20, 22 ఏళ్ల వయసు గర్భధారణకు అనువైన వయసు. ఈ వయసులో నాణ్యమైన అండాలను కలిగి ఉంటారు. గర్భధారణ జరిగే అవకాశాలు కూడా ఈ వయసు మహిళలకే ఎక్కువగా ఉంటాయి. అమ్మాయిలు కనీసం 25 నుంచి 30, 32 ఏళ్ల లోపు తొలి బిడ్డను ప్రసవించేలా ముందుగా ప్లాన్ చేసుకోవాలి. ఈ వయసు మహిళల్లో గర్భధారణకు అధిక అవకాశాలు ఉంటాయి. వయసు 35 ఏళ్లకు చేరేసమయానికి అండాల నాణ్యత తగ్గుతుంది. ఈకారణంగా గర్భధారణ అవకాశాలు తగ్గి, ఇన్‌ఫెర్టిలిటీ సమస్యలు ఎదురవుతాయి. ఈ సమస్యలను అధిగమించి గర్భం దాల్చే సమయానికి వయసు మరింత పెరిగిపోతుంది.

వయస్సు పైబడి గర్భం దాల్చితే ;

30 దాటి గర్భం దాల్చేవారిలో అబార్షన్లు అధికశాతం ఉంటాయి. 35 నుంచి 40 ఏళ్లు దాటిన మహిళల్లో అండాల నాణ్యత తగ్గడం వల్ల అబార్షన్లయ్యే అవకాశాలు మరింత ఎక్కువని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఒకవేళ గర్భం దాల్చినా, పుట్టే పిల్లల్లో క్రోమ్‌జోమ్‌ సమస్యల మూలంగా డౌన్స్‌ సిండ్రోమ్‌ లాంటి జన్యు సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. గర్భిణికి అధిక రక్తపోటు ఉంటే, ఫిట్స్‌ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఇవి తల్లికీ, బిడ్డకూ ప్రమాదకరం.

మధుమేహంతో గర్భం దాలిస్తే, గర్భంలోని బిడ్డ బరువు ఎక్కువగా పెరిగిపోయి, సాధారణ ప్రసవం సాధ్యం కాకపోవచ్చు. గర్భిణుల్లో చక్కెరలు ఎక్కువగా ఉంటే, పుట్టే బిడ్డలో గుండె సమస్యలు, అవయవ లోపాలు తలెత్తుతాయి. అధిక రక్తపోటు వల్ల, గర్భాశయంలోని మాయ విచ్చుకుపోయి, గర్భంలోనే బిడ్డ ప్రాణాలు కోల్పోయే ప్రమాదం కూడా ఉంటుంది. పిల్లలు నెలలు నిండకుండా పుట్టే అవకాశాలు అధికంగా ఉంటాయి. సాధారణ ప్రసవం కష్టతరమై, సిజేరియన్‌ అవకాశాలు పెరుగుతాయి. పుట్టే బిడ్డలపై ఆ ప్రభావం పడుతుంది. పుట్టిన పిల్లలను ఎన్‌ఐసియులో పెట్టవలసి ఉంటుంది. కొందరు పిల్లల్లో నాడీ సమస్యలు, మానసిక సమస్యలు, గుండె సమస్యలు తలెత్తే అవకాశాలుంటాయి.