Metabolism : శరీరంలో జీవక్రియలు మందగిస్తే బరువు పెరగటం ఖాయమా!…

జీవక్రియలు సక్రమంగా ఉండటానికి నిద్రకూడా చాలా ముఖ్యమైనది. రాత్రిపూట రోజుకి 6-7 గంటలు నిద్రపోవటం ఆరోగ్యానికి ఎంతో మంచిది.

Metabolism : శరీరంలో జీవక్రియలు మందగిస్తే బరువు పెరగటం ఖాయమా!…

Metabolism

Metabolism : శరీరంలో జరిగే రసాయనిక ప్రక్రియలనే జీవక్రియలు , మెటబాలిజమ్ అంటారు. ప్రతిరోజు మన శరీరంలో కేలరీలు వేగంగా ఖర్చైతే జీవక్రియలు బాగా జరుగుతున్నట్లు గుర్తించాలి. అలా కాకుండా కేలరీల ఖర్చు తక్కువగా ఉంటే జీవక్రియలు మందగించాయని అర్ధం చేసుకోవాలి. జీవక్రియలు ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టీ ఉంటాయి. కొందరు ఎక్కువగా తిన్నప్పటికీ సన్నగా ఉంటారు. మరికొందరు ఏ కొంచెం తిన్నా బరువు పెరగిపోతుంటారు.

జీవక్రియల జరిగే మార్పుల కారణంగా మధుమేహం, అధిక రక్తపోటు, స్థూలకాయం, క్యాన్సర్‌ వంటి సమస్యలు తలెత్తుతాయని పరిశోధకలు చెబుతున్నారు. జీవక్రియల వేగం తక్కువగా ఉంటే అలాంటి వారిలో కేలరీలు ఖర్చు తక్కువగా ఉంటుంది. దీని వల్ల కేలరీలు ఎక్కవై బరువు పెరుగుతారు. అదే జీవక్రియలు వేగంగా జరిగేతే కేలరీలు ఖర్చూ అధికంగా ఉండి బరుపు పెరగరు. ఉదయం సమయంలో టిఫిన్‌ తప్పనసరిగా తీసుకోవాలి. ఉదయం తీసుకునే అల్పాహారం రోజుమొత్తం జీవక్రియలు సక్రమంగా ఉండేలా చేస్తుంది. ఆలస్యంగా టిఫిన్‌ చేసినా.. కేలరీలు ఖర్చు విషయంలో సమయం వృధా చేసుకున్నవారమౌతాం.

జీవక్రియలు సక్రమంగా ఉండటానికి నిద్రకూడా చాలా ముఖ్యమైనది. రాత్రిపూట రోజుకి 6-7 గంటలు నిద్రపోవటం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఆలస్యంగా పడుకొని, తగినంత నిద్రలేనివారు ఒత్తిడికి లోనై శరీరంలో అవయవాల చుట్టూ కొవ్వు పేరుకునేందుకు కారణమౌతుంది. ముఖ్యంగా బరువు తగ్గించుకోవటానికి ఉపవాసాలు చేస్తుంటారు. పూర్తిగా ఆహారం తీసుకోకుండా ఉపవాసాలు ఉంటే జీవక్రియల వేగం మందగించి, శరీరంలో కొవ్వు పేరుకుపోవటానికి దోహదం చేస్తుంది.

క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం ఎంతో అవసరం. రోజుకు గంటసమయం నడకకు కేటాయించాలి. శారీరకశ్రమ చేయటం వల్ల గుండె, ఊపిరితిత్తులు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తాయి. రాత్రి భోజనానికి ముందు అరగంట సేపు కదలికలు వేగంగా ఉండే వ్యాయామం చేస్తే జీవక్రియల వేగమూ పెరుగుతుంది. బిస్కట్లు, బ్రెడ్‌, చాక్లెట్లు, ఫాస్ట్‌ఫుడ్‌, వేపుళ్లు, కేకుల వంటి వాటిల్లో ట్రాన్స్‌ఫ్యాట్స్‌ అధికం. ఇవి రక్తంలో కొలెస్ట్రాల్‌ను పెంచి హాని కలిగిస్తాయి. వీటి జోలికి వెళ్లకపోవటమే ఉత్తమం.

ఒకేసారి ఎక్కువగా తినటం కన్నా కొంచెం కొంచెంగా రోజుకి 5 సార్లుగా ఆహారం తీసుకోవటం మంచిది. భోజనాన్ని మానేయటం మంచిదికాదు. పీచు పదార్థాలు ఎక్కువగా తినేవారిలో అధిక బరువు సమస్య తక్కువగా ఉంటున్నట్టు అధ్యయనాల్లో తేలింది. పండ్లు, కూరగాయలు తినటం ఆరోగ్యానికి మంచిది. తద్వారా జీవక్రియల వేగం పెంచుకోవచ్చు.