Mixed Flour : కలిపిన చపాతీ, పూరీ పిండిని మర్నాడు వాడితే ఎంత ప్రమాదమో తెలుసా?

కొంతమంది చపాతీ, పూరి పిండిని కలిపి ఫ్రిజ్ లో నిల్వ చేస్తుంటారు. చాలారోజులు ఆ పిండిని వాడతారు. కలిపిన పిండిని నిల్వ చేసి వాడటం అనేక అనారోగ్యాలకు కారణం అవుతుందని మీకు తెలుసా?

Mixed Flour : కలిపిన చపాతీ, పూరీ పిండిని మర్నాడు వాడితే ఎంత ప్రమాదమో తెలుసా?

Mixed Flour

Mixed Flour : ఉద్యోగస్తులు ఉదయాన్నే త్వరగా తయారు చేసుకోగలిగే బ్రేక్ ఫాస్ట్‌ని ప్రిఫర్ చేస్తారు. కొంతమంది కూరగాయలు సైతం రాత్రి కట్ చేసుకుని ఫ్రిజ్‌లో నిల్వ చేసుకుంటారు. ఇంక కొందరు రాత్రికి, నెక్ట్స్ డే కి సరిపడా చపాతీ, పూరి పిండి కలిపేసి ఫ్రిజ్‌లో పెట్టేస్తుంటారు. ఇలా చేయడం సేఫా? కాదా? ఎప్పుడైనా ఆలోచించారా?

Heart Health : గుండె ఆరోగ్యానికి మేలు చేసే పెరుగు !

ఫ్రిజ్ లోంచి కలిపి ఉంచిన చపాతీ, పూరి పిండి తీసి బ్రేక్ ఫాస్ట్ తయారు చేసుకుంటూ ఉంటారు. ఇలా చేయడం అస్సలు మంచిది కాదని హెల్త్ ఎక్స్ పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. పిండి కలిపిన తర్వాత దానిని రెండు గంటల లోపు వాడేయాలి. మిగిలిన పిండిని  ఫ్రిజ్‌లో  పెడితే దానిలో అనేక రసాయనిక మార్పులు చోటు చేసుకుని ఆ పిండి మీద బ్యాక్టీరియా, ఫంగస్ డెవలప్ అవుతాయి. ఫ్రిజ్ లోంచి నిల్వ ఉంచిన పిండిని తీయగానే బ్లాక్ కలర్‌లో ఒక పొర కనిపిస్తూ ఉంటుంది. అంటే దానిపై ఆల్రెడీ సూక్షక్రిములు డెవలప్ అయ్యాయని గుర్తించాలి. అలాంటి పిండితో చపాతీ, పూరి తింటే కడుపు ఉబ్బరం, విరోచనాలు, కడుపు నొప్పి, జీర్ణవ్యవస్థకు సంబంధించిన అనేక సమస్యలు వస్తాయట.

Stomach Health : పొట్ట ఆరోగ్యానికి మేలు చేసే పండ్లు ఇవే!

గోధుమ పిండిలో కాల్షియం, ఐరన్, జింకు వంటి పోషకాలు ఉంటాయి. ఫ్రిజ్‌లో నిల్వ ఉంచడం వల్ల వాటిని కోల్పోయే అవకాశం ఉంది. అంతేకాదు నిల్వ ఉన్న పిండితో తయారు చేసిన ఆహారం తినడం కారణంగా రోగ నిరోధక వ్యవస్థ దెబ్బ తింటుంది. ఇలాంటి పిండితో ఆహారం తింటే మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. అందుకే పిండిని కలిపిన రెండు గంటల్లోపు వాడాలి. కొందరు చపాతీలు సున్నితంగా వస్తాయని వాటిలో పాలు కలుపుతుంటారు. అలా కలిపిన పిండిని మరుసటి రోజుకి నిల్వచేయకూడదు.