High Vitamin D : శరీరంలో విటమిన్ డి అధికమైతే కొత్తసమస్యలు
ఇటీవలి కాలంలో కరోన ప్రారంభమయ్యాక చాలా మంది అవసరం ఉన్న లేకపోయినా రోగనిరోధక శక్తి కోసం విటమిన్ డి ని ఇబ్బడి ముబ్బడిగా వాడేస్తున్నారు.

High Vitamin D : మన శరీరానికి కావల్సిన ముఖ్యమైన పోషకాల్లో విటమిన్ డి కూడా ఒకటి. ఎండలో గడపడం ద్వారా మనకు విటమిన్ డి లభిస్తుంది. అలాగే పలు ఆహారాల ద్వారా కూడా మనకు ఈ విటమిన్ శరీరానికి లభిస్తుంది. విటమిన్ డి వల్ల రోగనిరోధక శక్తి పెంపొందుతుంది. అంతే కాకుండా ఎముకల ధృడత్వానికి దోహదపడుతుంది. ఇటీవలి కాలంలో చాలా మంది ఆహారపు అలవాట్లలో మార్పులు, నీటపటున ఉండటం వల్ల డి విటమిన్ లోపంతో వ్యాధుల బారిన పడుతున్నారు.
చేపలు, రొయ్యలు, పుట్టగొడుగులు, పాలు, చీజ్ పప్పుదినుసులు, కూరగాయలు వంటి సమతుల ఆహారం ద్వారా మన శరీరానికి కావాల్సిన విటమిన్ డి పొందవచ్చు. విటమిన్ డి లోపం ఏర్పడిన సందర్భంలో చాలా మంది వైద్యుల సూచన మేరకు సప్లిమెంట్ రూపంలో తీసుకుంటుంటారు. అయితే ఇది నిర్ణీత మోతాడులో మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది.
ఇటీవలి కాలంలో కరోన ప్రారంభమయ్యాక చాలా మంది అవసరం ఉన్న లేకపోయినా రోగనిరోధక శక్తి కోసం విటమిన్ డి ని ఇబ్బడి ముబ్బడిగా వాడేస్తున్నారు. సరైన అవగాహన లేకపోవటం వల్ల విటమిన్ డి సప్లిమెంట్లను ఎలాంటి వైద్యుల సూచనలు లేకుండానే తీసుకోవటం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో విటమిన్ డి మోతాదుకు మించితే కొన్ని అనర్ధాలు తప్పవని సూచిస్తున్నారు.
విటమిన్ డి ఎక్కువైతే తీవ్రమైన అలసటగా అనిపిస్తుంది. ఒళ్లు నొప్పులు ఉంటాయి. కండరాలు బలహీనంగా మారటం, ఎముకల్లో నొప్పి, పెళుసుతనం వంటి రుగ్మతలను చవిచూడాల్సి వస్తుంది. వికారం, వాంతులు చేసుకోవటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇదంతా శరీరంలో విటమిన్ డి మోతాదుకు మించటం వల్లే జరుగుతుంది.
డి-విటమిన్ తీసుకుంటే కిడ్నీలు చెడిపోతాయని, అధిక రక్తపోటుకు గురికావటంతోపాటు, మూత్ర విసర్జన వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. రక్తంలో క్రియాటినిన్ లెవల్స్ పెరిగి కొన్ని సందర్భాల్లో మూత్రపిండాలు దెబ్బతింటాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి విటమిన్ డి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించటం మంచిది. వైద్యులు సూచించిన విధంగా మన శరీరానికి కావాల్సిన మోతాదులో మాత్రమే విటమిన్ డిని అందించటం వల్ల ప్రయోజనం కలుగుతుందని గ్రహించాలి.
1Rahul Gandhi: బ్రిటన్ పర్యటనలో తడబడిన రాహుల్ గాంధీ
2Konaseema Violence : అమలాపురం అల్లర్లు.. 46 మందిపై కేసులు.. జాబితాలో బీజేపీ, కాపు ఉద్యమ నేతలు
3Taj Mosque: తాజ్ మసీదు వద్ద నమాజ్ చేస్తున్న నలుగురి అరెస్టు
4R. krishnaiah: సామాజిక న్యాయంలో జగనే నెంబర్ వన్: ఆర్ కృష్ణయ్య
5Fat : ఇవి కొవ్వును ఇట్టే కరిగించేస్తాయ్!
6KCR With Deve Gowda : రెండు, మూడు నెలల్లో సంచలన వార్త వింటారు- దేవెగౌడతో భేటీ తర్వాత కేసీఆర్
7Secunderabad: రైల్వే స్టేషన్ వద్ద “ఐ లవ్ సికింద్రాబాద్” ఏర్పాటు
8Balakrishna: నందమూరి ఫ్యామిలీ నుండి మరొకటి!
9BJP: మోదీ సభకు పోలీసుల ఆటంకాలు.. బీజేపీ నేతల ఆగ్రహం
10Minister Gangula Counter : ఆ కుటుంబం ఉద్యమం చేయకపోతే తెలంగాణ వచ్చేదా? ప్రధాని వ్యాఖ్యలకు గంగుల కౌంటర్
-
Ram Charan: ‘అధికారి’గా మారుతున్న చరణ్.. నిజమేనా..?
-
NBK107: జై బాలయ్య.. థియేటర్లు మార్మోగాల్సిందే!
-
Vikram: తెలుగులోనూ ‘విక్రమ్’ గ్రాండ్ రిలీజ్
-
Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట రెండు వారాల కలెక్షన్స్.. ఎంతంటే?
-
Green Tea : మధుమేహాన్ని అదుపులో ఉంచే గ్రీన్ టీ!
-
Madhuyashki Goud : రేవంత్ రెడ్డికి మధుయాష్కీ గౌడ్ బహిరంగ లేఖ..సంచలన వ్యాఖ్యలు
-
Thirumala : జీడిపప్పు బద్దల తయారీ ప్రారంభించిన టీటీడీ ఈఓ ధర్మారెడ్డి
-
Gopichand: పక్కా కమర్షియల్ నుండి మరో అప్డేట్