Orange : గర్భిణీ స్త్రీలకు దివ్యౌషదం నారింజ ! పేగు ఆరోగ్యానికి మేలే!
మూత్ర విసర్జన ప్రక్రియను సరళతరం చేసేందుకు నారింజ ఉపయోగపడుతుంది. జ్వరాల బారిన పడి జీర్ణశక్తి తగ్గినప్పుడు ఆరంజెస్ తీసుకుంటే అజీర్ణ సమస్యల నుండి బయటపడవచ్చు.

Orange is the miracle cure for pregnant women! Good for intestinal health!
Orange : నారింజ జ్యూస్ రుచిగా ఉండడంతో పాటు అనేక పోషకాలు ఉంటాయి. నారింజ, దాని రసం రెండూ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఆరెంజ్ మన శరీరంలోని రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. అనేక వ్యాధుల నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. ఆరెంజ్ విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన చర్మం, బలమైన జుట్టు, కంటి చూపుకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గర్భధారణ సమయంలో ఇది సర్వరోగ నివారిణిగా ఉపయోగపడుతుంది.
ఒక నారింజలో 170 కంటే ఎక్కువ ఫైటోకెమికల్స్ మరియు 60 ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్, కీళ్లనొప్పులు, మధుమేహం, అల్జీమర్స్ నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. నారింజలో ఫైబర్ పుష్కలంగా ఉండటంతో మలబద్ధకం సమస్యను తొలగించి పేగులను శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. మన శరీరానికి సరైన మొత్తంలో ఫైబర్ లభిస్తే, అది కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. నారింజ గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని దరిచేరకుండా చూస్తుంది.
మూత్ర విసర్జన ప్రక్రియను సరళతరం చేసేందుకు నారింజ ఉపయోగపడుతుంది. జ్వరాల బారిన పడి జీర్ణశక్తి తగ్గినప్పుడు ఆరంజెస్ తీసుకుంటే అజీర్ణ సమస్యల నుండి బయటపడవచ్చు. ఆరంజ్‌లో బెటా కెరోటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది శరీరంలోని కణజాలాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. దీనిలోని కాల్షియం ఎముకలు, దంతాల దృఢత్వానికి ఎంతగానో ఉపకరిస్తుంది.
గర్భిణులు రోజూ పరగడుపున ఒక గ్లాస్ కమలా లేదా నారింజ జ్యూస్ తాగితే, వేవిళ్ల నుంచి సులభంగా బయటపడవచ్చు. అంతేకాదు, ఫోలిక్ యాసిడ్ సంప్లిమెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. రక్తాన్ని శుద్ధి చేయటంలోనూ, రక్త ప్రసరణ సక్రమంగా జరగడంలోనూ దోహదపడుతుంది. ఈ పండు రసం తరచు తీసుకోవడం వలన కిడ్నీలలో రాళ్ళు ఏర్పడకుండా నిరోధించవచ్చు.