HEALTH : మన ఆరోగ్యం, మన చేతుల్లోనే! |Our health, in our own hands!

HEALTH : మన ఆరోగ్యం, మన చేతుల్లోనే!

సమయానికి ఆహారం తీసుకోవాలి. దీని వల్ల జీర్ణ శక్తి సక్రమంగా ఉంటుంది. గ్యాస్, అల్సర్స్ వంటి సమస్యలు దరి చేరవు. రాత్రి పొద్దు పోయే వరకు నిద్రలేకుండా మేల్కోవటం వంటివి చేయరాదు. కంటికి సరిపడ నిద్ర అందించటం మంచిది.

HEALTH : మన ఆరోగ్యం, మన చేతుల్లోనే!

HEALTH : మనిషి సంపూర్ణ ఆరోగ్యవంతునిగా ఉన్నప్పుడే అతడి భవిష్యత్తు బంగారు మయంగా మారుతుంది. శారీరకంగానే కాకుండా మానసికంగా ఆరోగ్యవంతునిగా ఉండాలి. బాధ , విచారం, దిగులు, ఆందోళన , ఒత్తిడి ప్రతి మనిషి జీవితంలో సహజమే అయినప్పటికీ వాటిని అధిగమించ గలగాలి. అలాకాకుంటే మానసిక పరిస్ధితిపై తీవ్ర ప్రభావం పడుతుంది. జీవనశైలి, ఆహారపు అలవాట్ల విషయంలో జాగ్రత్తలు పాటించటం తప్పనిసరి. ఏమాత్రం అశ్రద్ధ చేసినా జబ్బులపాలు కావాల్సి వస్తుంది. ఇటీవలి కాలంలో అనేక ఆరోగ్య సమస్యలు చిన్న వయస్సు వారి నుండి పెద్ద వయస్సు వారి వరకు అందరిని చుట్టుముట్టి వేధిస్తున్నాయి.

ముఖ్యంగా బరువు పెరగటం, మదుమేహం, గుండె సమస్యలు, కిడ్నీ సమస్యలు , క్యాన్సర్ ముప్పు వంటివి బాగా పెరిగి పోయాయి. ఇలాంటి వాటిని దరి చేరకుండా ఉండాలంటే తక్కువ వయస్సులో ఉన్నప్పుడే జీవనశైలిలో మార్పులు చేసుకోవటం మంచిది. రోజు వారిగా వ్యాయామాలు చేయటం ద్వారా ఆయుషును పెంచుకోవచ్చు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందుకోసం కసరత్తులు చేయాల్సిన పనిలేదు. ప్రతిరోజు 45 నిమిషాలపాటు వేగంగా నడిస్తే సరిపోతుంది. దీని వల్ల రక్తపోటు, పక్షవాతం, గుండె జబ్బు, మధుమేహం ముప్పు నుండి తప్పించుకోవచ్చు. ఆందోళన, ఒత్తిడి తగ్గిపోతాయి.

సమయానికి ఆహారం తీసుకోవాలి. దీని వల్ల జీర్ణ శక్తి సక్రమంగా ఉంటుంది. గ్యాస్, అల్సర్స్ వంటి సమస్యలు దరి చేరవు. రాత్రి పొద్దు పోయే వరకు నిద్రలేకుండా మేల్కోవటం వంటివి చేయరాదు. కంటికి సరిపడ నిద్ర అందించటం మంచిది. దీని వల్ల మనస్సు ప్రశాంతంగా ఉండటంతోపాటు, రోజు వారి కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది. రాత్రి వేళల్లో మసాల పదార్ధాలను తీసుకోవటం పక్కన పెట్టిండి దీని వల్ల నిద్రలేమికి దారి తీసే ప్రమాదం ఉంటుంది. ఆహారంలో ప్రొటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు అన్నీ సమతులంగా ఉండేలా చూసుకోండి.

మాంసాహారం మితంగా తీసుకుంటూ పప్పు, కూరగాలు వంటివాటిని అధికంగా తీసుకోవటం మంచిది. దీని వల్ల శరీరానికి మంచి పోషకాలు అందుతాయి. తీసుకునే ఆహారాన్ని నిర్ణీత మొత్తంలోనే ఉండేలా చూసుకోవాలి. అతిగా తినటం ఏమాత్రం ఆరోగ్యానికి మంచిది కాదు. దీని వల్ల బరువు పెరగటం ఊబకాయం వంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి. తినే సమయంలో ప్రశాంతంగా ఉండాలి. తినే తిండిపైనే దృష్టిని కేంద్రీకరించాలి. బాగా నమిలి తినాలి. దీని వల్ల తిన్న ఆహారం త్వరగా జీర్ణమయ్యేందుకు అవకాశం ఉంటుంది. చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది. మద్యం, పొగతాగటం, వంటి అలవాట్లను మానుకోవటం మంచిది. ఇలాంటి ఆలవాట్లు ఆరోగ్యంపై తీవ్రప్రభావాన్ని చూపిస్తాయి. కాలేయం, కిడ్రీ, గుండె వంటి సమస్యలకు ఈ అలవాట్లే మూలకారణమవుతాయి.

×