Garlic Problems : అలర్జీ సమస్యలున్నవారు వెల్లుల్లితో జాగ్రత్త

జీర్ణసంబంధిత సమస్యలు ఉన్నవారు వెల్లుల్లిని తీసుకుంటే ఎసిడిటీ సమస్యని ఎదుర్కోవలసి ఉంటుంది. ఎసిడిటీ సమస్య ఎక్కువ కాలం వెంటాడుతుంది.

Garlic Problems : అలర్జీ సమస్యలున్నవారు వెల్లుల్లితో జాగ్రత్త

Garlic

Garlic Problems : వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులోని ఫ్రీరాడికల్స్ మన శరీరంలో పాడయ్యే కణాలను బాగుచేయడానికి, ఆక్సిడేటివ్ ఒత్తిడి తగ్గించడానికి వెల్లల్లి ఎంతగానో ఉపయోగపడుతుంది. వెల్లుల్లిలోని అల్లిసిన్‌.. రక్తంలో ఉన్న కొవ్వు స్థాయిలను నియంత్రిస్తుంది. వెల్లుల్లిలోని విటమిన్‌సి, విటమిన్‌ బి6లు రోగనిరోధక శక్తి పెంచటంలో కీలకపాత్ర పోషిస్తాయి. సీజనల్‌ వ్యాధులను ఎదుర్కొనే శక్తి పెంచుతుంది. ఆరోగ్యానికి మేలు చేసే వెల్లుల్లిని అతిగా వాడితే మాత్రం నష్టాలు తప్పవంటున్నారు నిపుణులు..

వెల్లుల్లిలో సల్ఫర్ ఉంటుంది. అందువల్లే దీని రుచి చాలా ఘాటుగా ఉంటుంది. శరీరంలో అలర్జీ సమస్యలున్న వారు వెల్లుల్లి వినియోగానికి చాలా దూరంగా ఉండటం మంచిది. అలర్జీ ఉన్న వారు వెల్లుల్లి తీసుకుంటే ఆసమస్య మరింత అధికమౌతుంది. నోటి దుర్వాసనతో బాధపడేవారు వెల్లుల్లిని తినటం వల్ల దుర్వాసన సమస్య మరింత పెరుగుతుంది. తలనొప్పి సమస్య ఉన్నవారు వెల్లుల్లి తింటుంటారు. అయితే వెల్లుల్లి తినటం వల్ల నొప్పి తగ్గటం అటుంచి ఇంకా నొప్పి అధికమౌతుంది.

జీర్ణసంబంధిత సమస్యలు ఉన్నవారు వెల్లుల్లిని తీసుకుంటే ఎసిడిటీ సమస్యని ఎదుర్కోవలసి ఉంటుంది. ఎసిడిటీ సమస్య ఎక్కువ కాలం వెంటాడుతుంది. దీనిని వదిలించుకోవటం కష్టతరంగా మారుతుంది. కాబట్టి జీర్ణ సమస్యలున్న వారు వెల్లుల్లి తినే విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. వెల్లుల్లిలో సల్ఫర్ ఎక్కువగా ఉన్నందున చిన్న పిల్లలకు తక్కువ మోతాదులో ఇవ్వాలి. వెల్లుల్లి అధికమోతాదులో తింటే కడుపులో మంట వచ్చే అవకాశం ఉంటుంది.

వెల్లుల్లిని ఖాళీ కడుపుతో తీసుకుంటే హార్ట్ బర్న్, వికారం మరియు వాంతుల సమస్య వేధిస్తుంది. ఖాళీ కడుపుతో అధిక మొత్తంలో వెల్లుల్లిని తీసుకుంటే నీళ్ల విరేచనాలు అవుతాయి. వెల్లుల్లిని అతిగా తీసుకోవడం వలన లివర్ పనితీరు దెబ్బతినవచ్చు. వెల్లుల్లి అనేది బ్లీడింగ్ రిస్క్ ను పెంచుతుంది. సర్జరీ తరువాత వెల్లుల్లిని కనీసం రెండు వారాల వరకు తీసుకోకూడదు. వెల్లుల్లిలో అల్లీయిన్ ల్యాస్ అనే ఎంజైమ్ స్కిన్ ఇరిటేషన్ కి కారణమౌతుంది.