కొత్త సంవత్సరం వస్తోంది.. అస్సలు తగ్గొద్దు!!

కొత్త సంవత్సరం వస్తోంది.. అస్సలు తగ్గొద్దు!!

ఇప్పటిదాకా అయిందేదో అయిపోయింది.. కొత్త సంవత్సరం నుంచి ఇలాంటివేమీ చేయకూడదు. టార్గెట్‌ను కచ్చితంగా రీచ్ అవ్వాల్సిందే ఏ మాత్రం కాంప్రమైజ్ కాకూడదు. అస్సలు తగ్గొద్దు అనుకుంటాం. కానీ, ఎప్పటిలాగే మొదలుపెట్టి రెండు మూడు రోజులు చూపించిన ఉత్సాహం నిదానంగా ఆవిరైపోతుంది. ఇలా క్రమంగా తగ్గిపోవడానికి సైకాలజికల్‌గా పలు కారణాలు ఉన్నాయి. వాటన్నిటినీ ఒకొక్కటిగా చేధించగలిగితే లక్ష్యాన్ని ఇట్టే చేరుకోగలం. 

వాస్తవానికి దగ్గరగా ఉండండి:
చేయాలనుకునే పనికి పరిస్థితులకు తగ్గట్లు ప్రణాళికలు వేసుకోండి. వాస్తవానికి దగ్గరగా ఉంటే చేసే పని సులువవుతుంది. ఆల్కహాల్ డైలీ తీసుకునే అలవాటు ఉందనుకుందాం. దాని నుంచి దూరం అవ్వాలంటే ఒక్కసారిగా మానేయడం అంటూ కుదరదు. ముందుగా రెండు మూడు రోజులకోసారి తీసుకోవాలి అనే సెల్ఫ్ రూల్ పెట్టుకోవాలి. ఆ తర్వాత రోజుల గ్యాప్ పెంచుకుంటూ పోతే మానేయగలం.

ఒకసారి ఒక్క పనే:
ఫెయిల్యూర్స్‌కు దూరంగా ఉండాలంటే పని మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఒక సమయంలో ఒకే పని చేస్తుంటే ఇది సాధ్యమవుతుంది. ఆల్కహాల్, స్మోకింగ్ మానేసి జిమ్ లో జాయిన్ అవండి. పౌష్టికాహారం తీసుకుంటూ ఏ పనైనా ఒక్కటే చేస్తే ఏకాగ్రత కుదిరి సక్సెస్ అవగలం. 

బీ స్మార్ట్:
ఎవరైనా జాబ్ చేస్తున్నప్పుడు స్మార్ట్‌గా ఆలోచించడం ముఖ్యం. అదెలా ఉండాలంటే అంచనా వేయగలిగినట్లు, సాధించగలిగేట్లలు, వాస్తవానికి దగ్గరగా సమయానికి పూర్తయ్యేలాగా ఉండాలి. ఉద్దేశ్యపూర్వకంగా గోల్ పెట్టుకుంటే స్మార్ట్ గా ఆలోచించగలం. 

ఎవరికైనా చెప్పండి: 
మీరు చెయ్యాలనుకునేది ఎవరికైనా చెప్పండి. ఇది చెయ్యగలం అని ఎదుటివారికి మాటిచ్చినప్పుడే ఆ విషయం మనకు గుర్తుండిపోతుంది. దానిని నిర్లక్ష్యం చేసినా ముఖం చూపించుకోలేం.  

ఇతరులతో ప్రవర్తన: 
ఇతరులతో ప్రవర్తించే తీరును మార్చుకోండి. అటిట్యూడ్‌ను బట్టే సొసైటీలో వాల్యూ ఉంటుంది. వీలైనంత వరకూ విలువను తగ్గించే అంశాలకు దూరంగా ఉండటమే మంచిది. 

హద్దులు పెట్టుకోవద్దు:
ఓటములు అంగీకరించి తప్పులు సరిదిద్దుకోవాలనుకున్నప్పుడు హద్దులు పెట్టుకోవద్దు. ఆల్కహాల్, జంక్ ఫుడ్, సిగరెట్స్ లాంటివి వదిలేయాలనుకుంటే లిమిట్స్ ఉండకూడదు. చెడు అలవాట్లు అనేవి సంవత్సరాల తరబడి మనతో ఉండిపోతాయి. వాటిని వదిలించుకోవడం అంత సులువు కాదు. అందుకే కాంప్రమైజింగ్ అనేది లేకుండా ఉంటే సాధించగలరు.