Rainbow Diet : వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచే రెయిన్ బో డైట్!

ఆకు కూర‌ల్లో క్యాల్షియం అధికంగా ఉంటుంది. వీటిని రోజూ ఆహారంలో చేర్చుకోవాలి. బ్రొకోలీ, బ్ర‌స్సెల్స్‌లో విట‌మిన్ ఏ అధికంగా ఉంటుంది. కివీ పండ్లు, గ్రీన్‌బెల్ పెప్స‌ర్స్‌లో విట‌మిన్ సీ ఎక్కువ‌గా ఉంటుంది. ఆహారంలో రోజూ వీటిని చేర్చుకోవ‌డం వ‌ల్ల శ‌రీరం మొత్తం క్లీన్ అవుతుంది.

Rainbow Diet : వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని పెంచే రెయిన్ బో డైట్!

Rainbow Diet

Rainbow Diet : వర్షాలు పడుతున్న కాలంలో మనిషి శరీరంలో అనేక మార్పులు వస్తుంటాయి. అనేక రోగాలు చుట్టుముట్టి ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటి వాటి నుండి శరీరాన్ని రక్షించుకోవాలంటే రోగనిరోధక శక్తి పెంచుకోవటం ఎంతో అవసరం. ఇందుకుగాను మనం రోజువారిగా తీసుకునే ఆహారంలో అనేక మార్పులు చేసుకోవాల్సి అవసరం ఉంది. ఆరోగ్యకరమైన పండ్లు, కూరగాయలు వంటి వాటిని తీసుకోవటం వల్ల రోగనిరోధక శక్తిని బాగా పెంచుకునేందుకు అవకాశం ఉంటుంది. మనం రోజువారిగా తీసుకునే వాటిలో రంగురంగు వర్ణాల్లో ఉండే పండ్లు, కూరగాయల వంటి రెయిన్ బో డైట్ ను తీసుకుంటే వర్షకాలంలో వ్యాధుల బారిన పడకుండా ఉండొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

రెయిన్ బో డైట్ అంటే ?

ఆకు కూర‌ల్లో క్యాల్షియం అధికంగా ఉంటుంది. వీటిని రోజూ ఆహారంలో చేర్చుకోవాలి. బ్రొకోలీ, బ్ర‌స్సెల్స్‌లో విట‌మిన్ ఏ అధికంగా ఉంటుంది. కివీ పండ్లు, గ్రీన్‌బెల్ పెప్స‌ర్స్‌లో విట‌మిన్ సీ ఎక్కువ‌గా ఉంటుంది. ఆహారంలో రోజూ వీటిని చేర్చుకోవ‌డం వ‌ల్ల శ‌రీరం మొత్తం క్లీన్ అవుతుంది. క‌ణ‌జాల మ‌ర‌మ్మ‌తులో ఇవి స‌హాయ‌ప‌డుతాయి. క్యాన్స‌ర్ వంటి వ్యాధులు దరిచేరకుండా చూసుకోవచ్చు. బ్రౌన్ రంగు పండ్లు, కూర‌గాయ‌ల్లో ఫైబ‌ర అధికంగా ఉంటుంది. గోధుమరంగు తాజా పండ్లు, గింజలు, తృణధాన్యాల‌ను ప్ర‌తిరోజూ త‌ప్ప‌క తీసుకోవాలి. ఇది ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను స‌మతుల్యం చేస్తాయి. పేగు క‌ద‌లిక‌ల‌ను నియంత్రిస్తాయి. కొలెస్ట్రాల్‌ను నియంత్ర‌ణ‌లో ఉంచుతాయి. జీర్ణ‌క్రియ సాఫీగా ఉండేలా చూస్తాయి. బ‌రువు నిర్వ‌హణ‌లో స‌హాయ‌ప‌డ‌తాయి.

నీలం, ఉదారంగు పండ్లు, కూర‌గాయ‌ల్లో ఫైటో న్యూట్రియెంట్లు పుష్క‌లంగా ఉంటాయి. బ్లాక్ బెర్రీస్‌, రేగు పండ్లు, బ్లూ బెర్రీస్‌, రెడ్ క్యాబేజీ, వంకాయ‌లు ఆరోగ్యానికి మంచివి. మూత్రనాళం ఆరోగ్యానికి స‌హాయ‌ప‌డతాయి. శ‌రీరంలో వాపుల‌ను త‌గ్గిస్తాయి. జ్ఞాప‌క‌శ‌క్తి కోల్పోయే అవ‌కాశాన్ని త‌గ్గిస్తాయి. నారింజ‌, ప‌సుపు రంగు పండ్లు, కూర‌గాయ‌ల్లో కెరోటినాయిడ్స్ ఎక్కువ‌గా ఉంటాయి. క్యారెట్, నిమ్మకాయలు, నారింజ, మామిడి, చిలగడదుంపలను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కళ్లకు ప్రయోజనకరమైనవి.

ఎరుపు రంగు పండ్లు, కూర‌గాయ‌ల్లో ఆంథోసైనిన్స్ అనే పిగ్మెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. దానిమ్మ, ఎర్ర మిరియాలు, స్ట్రాబెర్రీలు, టొమాటోలు వంటివాటిని రోజువారి ఆహారంలో క‌చ్చితంగా తీసుకుంటే ఇవి చర్మానికి మేలు చేస్తాయి. మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి స్ట్రోక్, గుండె జబ్బులు రాకుండా ర‌క్షిస్తాయి.