Rakul Preet Singh : రకుల్ కొత్త బిజినెస్.. సినిమా ఇండీస్ట్రీకి కొత్తగా వచ్చేవారికోసం

తాజాగా రకుల్ తన తమ్ముడితో కలిసి మరో బిజినెస్ మొదలుపెట్టింది. అయితే ఇందులో బిజినెస్ తో పాటు హెల్పింగ్ కూడా ఉంది. సినిమా ఇండస్ట్రీకి వచ్చే వాళ్లకి..........

Rakul Preet Singh :  రకుల్ కొత్త బిజినెస్.. సినిమా ఇండీస్ట్రీకి కొత్తగా వచ్చేవారికోసం

Rakul

Rakul Preet Singh :  టాలీవుడ్ లో స్టార్ గా ఎదిగి మంచి ఫామ్ లో ఉన్నప్పుడు బాలీవుడ్ కి చెక్కేసింది రకుల్ ప్రీత్. ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. రకుల్ తో పాటు తన తమ్ముడు అమన్ ప్రీత్ కూడా సినిమాల్లో గట్టిగానే ట్రై చేస్తున్నాడు. ఇప్పటికే హీరోగా ఓ సినిమా కూడా చేశాడు. రకుల్ ఇప్పటికే చాలా బిజినెస్ లు మొదలు పెట్టింది. వాటిల్లో సక్సెస్ కూడా అయ్యింది. తాజాగా రకుల్ తన తమ్ముడితో కలిసి మరో బిజినెస్ మొదలుపెట్టింది. అయితే ఇందులో బిజినెస్ తో పాటు హెల్పింగ్ కూడా ఉంది. సినిమా ఇండస్ట్రీకి వచ్చే వాళ్లకి హెల్ప్ చేయడానికి ఓ యాప్ క్రియేట్ చేసింది రకుల్ పాప.

Aryan Khan : ఇంకా తేరుకొని ఆర్యన్ ఖాన్… కౌన్సిలింగ్ ఇప్పించనున్న హృతిక్

తెలుగు, తమిళ్, హిందీ అని భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లోనూ సినీ పరిశ్రమలో ఛాన్సుల కోసం ఎంతోమంది ట్రై చేస్తూ ఉంటారు. ఇలా అవకాశాల కోసం తిరిగే వాళ్ళకోసం ఓ యాప్ తయారు చేసింది రకుల్. ‘స్టారింగ్‌ యూ’ అనే పేరుతో ఓ యాప్ ని లాంచ్ చేశారు అక్కాతమ్ముళ్ళు. ఇందులో సినీ పరిశ్రమకి వచ్చేవారు తమ వివరాలను నమోదు చేసి, నటన, సంగీతం, నృత్యం, రైటింగ్.. ఇలా తమ ప్రత్యేకతకు సంబంధించిన వీడియోలను ఇందులో అప్‌లోడ్‌ చేయాలి. ఈ యాప్‌తో అనుసంధానమైన ప్రొడక్షన్‌ హౌస్‌లు, డైరెక్టర్లు తమ చిత్రాలకు అవసరమైన వారిని ఇందులోనుంచి సెలెక్ట్ చేసుకుంటారు.

Akhanda : బాలయ్యతో 9 రోజులు దుమ్ములో ఫైట్ చేశాను.. బాలయ్యకి విలన్ అంటే అంత ఈజీ కాదు : శ్రీకాంత్

అంతేకాక ఇందులో ఎప్పటికప్పుడు కాస్టింగ్‌ అప్‌డేట్స్‌, ఆడిషన్స్‌కి సంబంధించిన వివరాలు కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు. దీంతో స్టూడియోలు, దర్శకుల ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేదు అంటుంది రకుల్. కరోనా సమయంలో ఎంతోమంది నటీనటులు ఉపాధి అవకాశాలు కోల్పోయి బాధపడటం చూశాను, అది చూసి తట్టుకోలేకే నా వంతుగా సినీ పరిశ్రమకి ఏదో ఒకటి చేయాలనీ ఈ యాప్ ని మొదలు పెట్టానని రకుల్ ప్రీత్ తెలిపింది. అంతే కాక ఇండస్ట్రీలోకి రావాలని చాలా మంది కోరుకుంటున్నారు. సినిమా పరిశ్రమలో స్థిరపడటం చాల కష్టం. అందుకే నా తమ్ముడు, నేను కలిసి ఈ యాప్‌ను రూపొందించాం. ఇటు టాలెంట్‌ను, అటు టాలెంట్‌ హంటర్స్‌ను డిజిటల్‌గా కలిపే వేదిక ఇది అని చెప్పారు రకుల్. యాక్టర్స్‌కి మాత్రమే కాదు సింగర్స్‌, రైటర్స్‌, డైరెక్టర్స్‌, సినిమాటోగ్రాఫర్స్‌.. ఎవరైనా మా యాప్‌ని ఉపయోగించుకోవచ్చు. నాకు అక్కతో పని చేయడం కొత్తేమీ కాదు. మేమిద్దరం గతంలో కొన్ని బిజినెస్ లను నిర్వహించాం అని రకుల్ తమ్ముడు అమన్‌ ప్రీత్‌ సింగ్‌ తెలిపాడు.