Ajwain : బరువును తగ్గించి, ఆకలిని పెంచే వాము!
గుండెవ్యాధులు రాకుండా నివారించడంలో సహాయపడుతుంది. కీళ్లనొప్పులను తగ్గిస్తుంది. ఆకలి పెంచుతుంది. గర్భవతులు వాము తీసుకోవటం వల్ల రక్తం శుభ్రపడటమే కాక శరీరంలోని రక్తప్రసరణ సరిగా సాగేలా సహకరిస్తుంది.

Ajwain : వామును ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు. సామాన్యులకు సైతం అందుబాటులో ఉండే మెడిసిన్ గా ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు. పూర్వకాలం నుండి వామును ఆరోగ్యానికి మేలు కలిగించేదిగా గుర్తిస్తూ వస్తున్నారు. జీర్ణశక్తిని పెంపొందించేందుకు దీనిని మించింది లేదు. రుచికి ఘాటుగా అనిపించినా దాని పనితీరు మాత్రం అద్భుతంగా ఉంటుంది. జీర్ణ సంబంద సమస్యలు అయినా గ్యాస్,అజీర్ణం,కడుపు ఉబ్బరం,ఎసిడిటీ వంటి సమస్యలు లేకుండా చేసి తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యేలా చేస్తుంది.జలుబు, మైగ్రెయిన్ తలనొప్పికి ఇది మంచి మందు.
వాము పొడిని ఒక గుడ్డలో కట్టి మెల్లగా వాసన చూస్తే సమస్య తీరిపోతుంది. ఊపిరితిత్తులు ఆరోగ్యానికి సహాయ పడుతుంది. గొంతు నొప్పి,గొంతు ఇన్ ఫెక్షన్,దగ్గు వంటి వాటికి మంచి ఉపశమనం అందిస్తుంది. ప్రతి రోజు ఒక స్పూన్ వామును తినడం వలన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. ఒక టేబుల్ స్పూన్ వామును ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టి ఉదయానే మరిగించి చల్లార్చి పరగడుపున ప్రతి రోజు తాగటం వలన శరీర బరువును తగ్గించుకోవచ్చు. కిడ్నీలో ఉండే చిన్న రాళ్ళను కరిగిస్తుంది. పది రోజుల పాటు తీసుకుంటే చాలా మంచి ప్రయోజనం కనపడుతుంది. అధిక బరువు ఉన్నవారిలో శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగిస్తుంది. శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి ఎటువంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా మన శరీరాన్ని కాపాడుతుంది. వామును నీళ్లలో నానబెట్టి ఆ నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి తాగితే వాంతులు తగ్గుతాయి.
వామును బుగ్గన పెట్టుకుని నమిలి చప్పరిస్తూ రసాన్ని మింగితే గొంతులో నొప్పి, గొంతులో గురగుర తగ్గుతుంది. చిన్న పిల్లలు అజీర్తి, కడుపునొప్పితో బాధపడుతుంటే వాము వాటర్ లో తేనె కలిపి ఇస్తే నొప్పి తగ్గిపోతుంది. గుండెవ్యాధులు రాకుండా నివారించడంలో సహాయపడుతుంది. కీళ్లనొప్పులను తగ్గిస్తుంది. ఆకలి పెంచుతుంది. గర్భవతులు వాము తీసుకోవటం వల్ల రక్తం శుభ్రపడటమే కాక శరీరంలోని రక్తప్రసరణ సరిగా సాగేలా సహకరిస్తుంది. ఉదయం సమయంలో వాముపొడి, తేనె కలుపుకుని పరగడుపున తీసుకుంటే ఆస్తమా ఉన్నవారికి మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఒక స్పూన్ల వాము ,చిటికెడు ఉప్పు వేసుకొని చూర్ణంలా చేసుకొని నోట్లో వేసుకొని చప్పరిస్తూ వేడినీళ్లు తాగడం వలన దగ్గు మరియు దమ్ము తగ్గుతుంది.
గమనిక: అందుబాటులో ఉన్న వివిధ మార్గాల ద్వారా ఈ సమాచారం సేకరించి అందించటం జరిగింది. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. వివిధ అనారోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సూచనలు, సలహాలు పాటిస్తూ చికిత్స పొందటం మంచిది.
1Jinnah Tower: జిన్నా టవర్‌కు పేరు మార్చాలని బీజేపీ డెడ్‌లైన్
2Watching TV : గంటలకొద్ది టీవీ చూసేవారిలో గుండె జబ్బుల రిస్క్ ఎక్కువ.. కొత్త అధ్యయనం హెచ్చరిక!
3kapil sibal : కాంగ్రెస్ కు రాజీనామా చేసిన కపిల్ సిబాల్..సమాజ్‌వాదీ పార్టీ తరపున రాజ్యసభకు నామినేషన్
4Karthi Chidambaram : నేడు సీబీఐ విచారణకు హాజరుకానున్న కార్తీ చిదంబరం
5Health tips: మెరిసే చర్మం కావాలా.. అయితే ఇలా ట్రై చేసి చూడండి …
6సీఎం జగన్.. దేశానికి క్షమాపణ చెప్పాల్సిందే..!
7Sugar mountains : సముద్ర గర్భంలో పంచదార కొండలను కనుగొన్న పరిశోధకులు..
8Nayan-Vignesh : పెళ్లి పనులు మొదలు పెట్టిన నయన్-విగ్నేష్?? గుళ్ళు గోపురాల చుట్టూ తిరుగుతున్న కోలీవుడ్ జంట..
9Covid-19 Cases : దేశంలో కొత్తగా 2,124 కరోనా కేసులు, 17 మరణాలు
10America Gun Culture : అమెరికాలో రోజుకు 53 మందిని బలి తీసుకుంటున్న తుపాకి
-
Konaseema : పచ్చగా ఉండే కోనసీమ ఎర్రబడిపోయింది
-
Konaseema : నివురుగప్పిన నిప్పులా కోనసీమ
-
Biden Emotional : అమెరికాలో మారణహోమం.. బైడెన్ భావోద్వేగం..!
-
Cooking Oils : వంటనూనెల ధరలు తగ్గించేందుకు కేంద్రం చర్యలు
-
Bharat Bandh : నేడు భారత్ బంద్..కులాల వారీగా జనగణనకు డిమాండ్
-
Cooking Oils : తగ్గనున్న వంటనూనెల ధరలు
-
Dawood Ibrahim : పాకిస్తాన్ లోనే అండర్ వరల్డ్‌డాన్ దావూద్ ఇబ్రహీం
-
Omicron BA.5 : భారత్ లో ఒమిక్రాన్ బీఏ.5 రెండో కేసు నమోదు..గుజరాత్ లో గుర్తింపు