Sitting on the Doorstep : గడప మీద ఎందుకు కూర్చోవద్దంటారో తెలుసా?

గడప మీద కూర్చోవద్దు అని మన పెద్దలు చెబుతారు. గడప ఇవతల ఉండి అవతలి వారికి డబ్బు, వస్తువులు ఇవ్వద్దు అంటారు. గడప మీద కూర్చుని కన్నీరు పెట్టద్దు అంటారు. ఇవన్నీ చెప్పడం వెనుక కారణాలు ఏంటో మీకు తెలుసా?

Sitting on the Doorstep :  గడప మీద ఎందుకు కూర్చోవద్దంటారో తెలుసా?

Sitting on the Doorstep

Sitting on the Doorstep : ప్రతి ఇంటి గుమ్మానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఏ పని మీద మనం బయటకు వెళ్లినా సింహ ద్వారం నుంచి బయటకు వెళ్లి లోనికి వస్తాం. ఇంటి గడపను పూజిస్తాం. ఇంటి సింహ ద్వారం, గడప ఇంటి యజమాని శ్రేయస్సుతో ముడిపడి ఉంటాయి. గడపను లక్ష్మీదేవిగా భావించి పూజిస్తాం. అందుకే గడప మీద కూర్చుంటే ఇంట్లో పెద్దవారు వారిస్తారు.

Tomato pooja : ధరలు తగ్గించు తల్లీ .. టమాటాలతో అమ్మవారికి పూజలు,టమాటాలే నైవేద్యం..భక్తులకు అవే ప్రసాదం

విదేశాల్లో ఇంటి నిర్మాణంలో గడపలు ఉండవు. ఇండియాలో కూడా ఇప్పుడు అదే సంప్రదాయం కనిపిస్తోంది. ఇంటి గడపకి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎవరైనా గడప మీద కూర్చున్నా.. కూర్చుని తుమ్మినా పెద్దలు వారిస్తారు. తుమ్మినవారి నెత్తిపై నీరు చల్లి ‘ఏ ఊర్లో పుట్టావు’ అని అడుగుతారు. సనాతన ధర్మంలో ఉన్న అంశాలతో పాటు కొన్ని వాస్తుతో కూడా ముడిపడి ఉన్నాయి.

ఇంటి నిర్మాణం చేపట్టినపుడు మంచి ముహూర్తం చూస్తారు. ఇంటి సింహ ద్వారం నిలబెట్టేటపుడు కూడా ముహూర్తం పెడతారు. ఆ సమయంలో చేసే పూజలో గడప కింద వేప నూనె పోయడం, కొన్ని భగవత్ సంబంధమైన యంత్రాలు పెట్టడం, పసుపు, కుంకుమ, పువ్వులతో పూజ చేస్తారు. లక్ష్మీదేవిగా భావించి ఆరాధిస్తారు. అప్పుడు గుమ్మాన్ని ఎత్తుతారు. అంత పవిత్రంగా పూజించిన గడపపై కూర్చోకూడదని మన పెద్దలు చెబుతారు.

Parijatha flowers : పారిజాతాలు .. కిందపడినా దోషం అంటని దేవతా పుష్పాలు

ఇంటి యజమాని నక్షత్రానికి సరిపోయే దిక్కున సింహ ద్వారాన్ని నిలబెడతారు. అంటే వారికి నప్పే దిశలో ఇంటి గుమ్మం ఉండాలని చెబుతారు. పండగలు వస్తే గడపని ప్రత్యేకంగా శుభ్రపరచడం, రంగులు వేయడం, పసుపు, కుంకుమ బొట్లు పెట్టడం వంటివి చేస్తాము. గడపను కాలితో తన్నకూడదు. దానిపై కూర్చోకూడదు. ఎవరికైనా ఏదైనా వస్తువు లేదా డబ్బు ఇచ్చేటపుడు ఇవతల ఉండి అవతలి వారికి ఇవ్వకూడదు అంటారు. అది శుభసూచకం కాదని చెబుతారు. గడప మీద కూర్చుని కన్నీరు పెట్టుకోకూడదు అంటారు. గడపతో ఇంటి యజమాని శ్రేయస్సు ముడిపడి ఉందనే విషయం మర్చిపోకూడదు.