Sesame Seeds : చలికాలంలో శరీరం వేడిగా ఉంచటంతోపాటు రోగనిరోధక శక్తిని పెంచే నువ్వులు!

నువ్వులలో పీచు సమృద్దిగా ఉండుట వలన జీర్ణ సంబంద సమస్యలు లేకుండా ముఖ్యంగా మలబద్దకం సమస్య ఉన్నవారికి మంచి ఉపశమనం కలిగిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది.

Sesame Seeds : చలికాలంలో శరీరం వేడిగా ఉంచటంతోపాటు రోగనిరోధక శక్తిని పెంచే నువ్వులు!

Sesame Seeds :

Sesame Seeds : నువ్వులలో నల్ల నువ్వులు, తెల్ల నువ్వులు అనే రెండు రకాలు లభ్యం అవుతాయి. ఈ చలికాలంలో ఏ నువ్వులను తీసుకున్న మంచి ప్రయోజనం పొందవచ్చు. రోజులో ఒక స్పూన్ మోతాదులో నువ్వులను తీసుకోవాలి. నువ్వులను నీటిలో నానబెట్టి రెండు గంటలు అయ్యాక నానిన నువ్వులను తినాలి. నల్ల నువ్వులలో ఎన్నో పోషకాలు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సీజన్ లో అంటే చలికాలంలో నువ్వులను తీసుకుంటే శరీరాన్ని వేడిగా ఉండి చలినుండి రక్షించుకోవచ్చు.

నువ్వులు, బెల్లం కలిపి చేసిన ఉండలు, నువ్వుల పచ్చడి, వేపిన నువ్వులు, పచ్చినువ్వులు ఇలా ఏ రూపంలో వీటిని తీసుకున్నా మంచిదే. వారానికి కనీసం మూడు సార్లు వీటిని తినడం అలవాటు చేసుకుంటే శరీరానికి కావాల్సిన ఐరన్ లభిస్తుంది. రక్త హీనత సమస్యతో బాధపడేవారికి నువ్వులు మేలు కలిగిస్తాయి. వీటిలో సెసమాల్ అనే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ ఫ్లమ్మేటరీ, మోనో అన్ శాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. ఇవి గుండెకు రక్షణగా ఉంటాయి.

నువ్వులలో పీచు సమృద్దిగా ఉండుట వలన జీర్ణ సంబంద సమస్యలు లేకుండా ముఖ్యంగా మలబద్దకం సమస్య ఉన్నవారికి మంచి ఉపశమనం కలిగిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. నువ్వులను వేయించి బెల్లం కలిపి తినవచ్చు. నువ్వులలో జింక్‌, సెలీనియం, కాపర్‌, ఐరన్‌, విటమిన్‌ బి6, విటమిన్‌ ఇ వంటి అనేక పోషకాలు ఉండటం వల్ల శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలోపేతం చేస్తుంది.

నువ్వులలో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. మంచి మొత్తంలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, పినోరెసినాల్ ఉంటాయి. ఇది జీర్ణ ఎంజైమ్ మాల్టేస్ చర్యను నిరోధించడం ద్వారా రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. నువ్వులు ఆందోళనను తగ్గించడానికి సహాయపడతాయి. రక్తపోటు ఉన్నవారు నువ్వులను తమ ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటిలో ఉండే మెగ్నీషియం రక్తపోటును తగ్గిస్తుంది. దీనివల్ల బ్రెయిన్ స్ట్రోక్, గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది.
.