Sethu Bandhana Sarvangasana : మైగ్రేన్ తలనొప్పిని తగ్గించే సేతు బంధన సర్వాంగాసనం!

ఈ ఆసనం వేయడం వలన అనేక ఇతర ఆరోగ్య ప్రయోయజనాలు కలుగుతాయి. అజీర్తితో బాధపడేవాళ్లు, మెటబాలిక్‌ సిండ్రోమ్‌ కారణంగా అధిక బరువు సమస్య ఎదుర్కొనేవారికి ఈ ఆసనం ఉపయోగకరం.

Sethu Bandhana Sarvangasana : మైగ్రేన్ తలనొప్పిని తగ్గించే సేతు బంధన సర్వాంగాసనం!

Sethu Bandhana Sarvangasana to reduce migraine headaches!

Sethu Bandhana Sarvangasana : మైగ్రేన్ లేక వాస్క్యులర్ హెడేక్ దీనినే పార్శ్వనేప్పి అంటారు. తలకు ఒక పక్కనే వస్తుంది. ఇది చాలా తీవ్రమయిన నొప్పి. జీవన సరళిలో మార్పులు, మానసిక ఒత్తిడిని తగ్గించుకుని, సరైన సమయంలో భోజనం చేయడం, నిద్రపోవడం, యోగ, ధ్యానం, ప్రాణాయామం వంటివి అనుసరించడం ద్వారా ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా మైగ్రేన్ తలనొప్పిని తగ్గించుకునేందుకు సేతు బంధన సర్వాంగాసనం అనేది ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఆసనాన్ని వేయడం వలన మన శరీరానికి కావాల్సిన విశ్రాంతిని లభిస్తుంది. మెదడుకు అవసరమైన రక్తప్రవాహాన్ని పెంపొందిస్తుంది. ఈ సేతు బంధన ఆసనాన్ని బ్రిడ్జి పోస్ అని కూడా పిలుస్తారు. భుజాలు వెనక్కు మడిచి ఈ ఆసనాన్ని వేస్తారు . ఈ ఆసనం వేయడం చాలా తేలిక. ఈ ఆసనం వలన అనేక ప్రయోజనాలు ఉంటాయి.

సేతు బంధన సర్వాంగాసనం వేసే విధానం ;

ముందుగా వెనక్కు పడుకోవాలి. మన పాదాలు నెమ్మదిగా నేల మీదికి చాచాలి. ఇలా సౌకర్యవంతంగా కాళ్లను నేల మీదకు చాచిన తర్వాత మోకాళ్లపైన నెమ్మదిగా లేచి నిల్చోవాలి. చేతులను వెన్నముక ఎముకల పక్కగా చాపాలి. ఇలా చేతులను వెన్నముక పక్కగా చాచిన తర్వాత నెమ్మదిగా చేతులను భూమికి ఆనించి కాళ్లు, చేతుల మీద నిల్చోవాలి. ఇలా వెనక్కు వంగి కాళ్లు, చేతుల మీద నిల్చోవడం వలన పక్కటెముక మీద భారం పడుతుంది. 5–15 శ్వాసలు తీసుకునే వరకు ఇలాగే ఉండాలి.అనంతరం నెమ్మదిగా ఈ ఆసనం నుంచి మన శరీరాన్ని మామూలు స్థితికి తీసుకురావాలి. ఇలా సింపుల్ పద్ధతుల్లో ఈ ఆసనాన్ని చాలా సులువుగా వేయొచ్చు.

ఈ ఆసనం వేయడం వలన అనేక ఇతర ఆరోగ్య ప్రయోయజనాలు కలుగుతాయి. అజీర్తితో బాధపడేవాళ్లు, మెటబాలిక్‌ సిండ్రోమ్‌ కారణంగా అధిక బరువు సమస్య ఎదుర్కొనేవారికి ఈ ఆసనం ఉపయోగకరం. మానసిక ఒత్తిడిని తగ్గించి నిద్రపట్టేందుకు సేతు బంధ సర్వాంగాసనం తోడ్పడుతుంది. వెన్నెముక బలోపేతం అవుతుంది. శ్వాసకోశాల పనితీరు పెరుగుతుంది. కీళ్లలో ఉండే సైనోవియల్ అనే ద్రవం జాయింట్లకు తాజా ఆక్సిజన్ ను, పోషకాలను అందిస్తుంది.