Fever : జ్వరంతో బాధపడుతుంటే మాంసాహారం తినకూడదా?

జ్వరం వచ్చిన సమయంలో మాంసాహారం తింటే లివర్ పనితీరు మందగిస్తుంది. ఆసమయంలో మాంసాహారం తినటం వల్ల పచ్చకామెర్లు వచ్చే అవకాశాలు ఉంటాయి.

Fever : జ్వరంతో బాధపడుతుంటే మాంసాహారం తినకూడదా?

Chiken (1)

Fever : జ్వరంతో బాధపడుతున్న సమయంలో తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించమని సలహా ఇస్తుంటారు వైద్యులు. ముఖ్యంగా జ్వరంతో బాధపడుతున్న సమయంలో నాన్ వెజ్ ఆహారాల జోలికి వెళ్ళవద్దని సూచిస్తుంటారు. చికెన్, మటన్ వంటికి దూరంగా ఉండాలంటారు. అయితే ఈ విషయంలో చాలా మందిలో అనేక సందేహాలు నెలకొని ఉన్నాయి. అయితే జ్వ‌రం వ‌చ్చిన సమయంలో మాంసాహారం ఎందుకు తినకూడదన్న దానిపై అపోహలు వద్దంటున్నారు వైద్యులు. సాధార‌ణంగా ఎవ‌రికైనా జ్వ‌రం వ‌స్తే జీర్ణ‌శక్తి బాగా త‌గ్గిపోతుంది. అందుకే వైద్యులు తేలిగ్గా అరిగే ఆహారం తీసుకోమని సూచిస్తుంటారు.

జ్వరం వచ్చిన సమయంలో మాంసాహారం తింటే లివర్ పనితీరు మందగిస్తుంది. ఆసమయంలో మాంసాహారం తినటం వల్ల పచ్చకామెర్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. మాంసాహారమే కాకుండా అయిల్ తో కూడిన ఆహారాలను తీసుకోకూడదు. త్వరగా జీర్ణమయ్యే తేలికపాటి ఆహారాలను తినటం వల్ల జీర్ణక్రియలు సాధారణంగా ఉంటాయి. శరీరానికి జ్వరం వచ్చిన సమయంలో తగిన పోషకాలను అందించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఆ పోషకాల కోసం తేలికపాటి ఆహారాలను మాత్రమే తినటం ఉత్తమం.

జ్వరంతో బాధపడుతున్నప్పుడు చికెన్ తినడం సురక్షితమే అయినప్పటికీ మసాలాలు దట్టించిన చికెన్ కూరలు, వేపుళ్లు, బిర్యానీలు జ్వరం వచ్చిన సమయంలో తింటే మాత్రం ఆరోగ్యానికి హానికరంగా మారే అవకాశం ఉంటుంది. చికెన్‌ను తక్కువ నూనెతో, మసాలాలు లేకుండా వండుకుని తినాలి. సూప్ లాగా చేసుకోవటం వల్ల శరీరానికి మంచి పోషకాలు అందుతాయి. తగినంత శక్తిని అందిస్తుంది. చికెన్‌లో సూప్‌లో ద్రవాలు, ఎలక్ట్రోలైట్‌లు ఉంటాయి. ఇవి మీ శరీరానికి ఉపశమనం కలిగిస్తాయి.