సౌతాఫ్రికా కొత్త వేరియంట్.. కరోనా వ్యాక్సిన్ల ఇమ్యూనిటీని పూర్తిగా తగ్గించలేదు : సైంటిస్టుల క్లారిటీ

సౌతాఫ్రికా కొత్త వేరియంట్.. కరోనా వ్యాక్సిన్ల ఇమ్యూనిటీని పూర్తిగా తగ్గించలేదు : సైంటిస్టుల క్లారిటీ

South African Variant Not Negate COVID Vaccines : దక్షిణాఫ్రికాలో మొట్టమొదట కరోనావైరస్ వేరియంట్ వ్యాక్సిన్ల రోగనిరోధక ప్రభావాలను పూర్తిగా తగ్గించే అవకాశం లేదని బ్రిటన్ సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు. కరోనా వ్యాక్సిన్లు.. కొత్త కరోనా వేరియంట్ నుంచి రక్షించలేవని, ఇప్పటికే ఈ వేరియంట్ అంతర్జాతీయంగా వ్యాపించిందని సైంటిస్టులు ఆందోళన వ్యక్తం చేశారు. KwaZulu-Natal రీసెర్చ్ అంటువ్యాధుల నిపుణులు Richard Lessells.. సౌతాఫ్రికా వేరియంట్ 501Y.V2 గుర్తించడంలో కీలక పాత్ర పోషించారు.

ఈ వేరియంట్ గురించి అర్థం చేసుకోనేందుకు కొత్త డేటా ఆధారంగా ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. కరోనా వైరస్ మ్యుటేషన్ల ప్రభావం ఆందోళన కలిగించిందని ఆయన అన్నారు. దక్షిణాఫ్రికా పరిశోధకులు వేరియంట్‌లోని మ్యుటేషన్ల ప్రభావాలపై అధ్యయనం చేస్తున్నారు. పాత వేరియంట్‌ల్లో సహజమైన రోగనిరోధక శక్తి కంటే కొత్త వేరియంట్ ద్వారా రక్షణ కల్పించగలవా లేదా అనేది స్పష్టత లేదంటున్నారు.

ఈ అధ్యయనాల ప్రాథమిక ఫలితాలు వస్తే తప్ప కచ్చితంగా అంచనా వేయగలమని అంటున్నారు. 501Y.V2 వేరియంట్లో 20 కంటే ఎక్కువ మ్యుటేషన్లు ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. మానవ కణాలకు సోకడానికి వైరస్ ఉపయోగించే స్పైక్ ప్రోటీన్‌లో చాలా మ్యుటేషన్లు ఉన్నాయని గుర్తించారు. వీటిలో ఒకటి యాంటీబాడీలను నిరోధించగల స్పైక్ ఒకటి ఉందని బ్రిటన్ సైంటిస్టులు చెబుతున్నారు.

ఈ స్పైక్ ప్రోటీన్.. శరీరంలోని వివిధ భాగాలను టార్గెట్ చేయగలదని లెస్సెల్స్ పేర్కొన్నారు. అయితే ఈ మ్యుటేషన్లు… కొంత ప్రభావాన్ని చూపినప్పటికీ, వ్యాక్సిన్ల ప్రభావాన్ని పూర్తిగా నిరోధించే అవకాశం లేదని భావిస్తున్నామని లెస్సెల్స్ చెప్పారు.దక్షిణాఫ్రికాలో 1.1 మిలియన్లకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. 30,000 మందికి పైగా మరణించారు. ఆఫ్రికన్ ఖండంలోనే ఎక్కువ. కరోనా వ్యాక్సిన్లు మ్యుటేట్ చెందిన కరోనావైరస్ వేరియంట్ల నుంచి రక్షించవని సూచించడానికి ఎలాంటి ఆధారాలు లేవని తెలిపింది.