Gray Hair : జుట్టు తెల్లబడుతుందని బాధపడుతున్నారా! వీటిని ప్రయత్నించి చూడండి

జుట్టుకు తరచూ కొబ్బరి నూనెతో మసాజ్ చేయాలి. ఇలా చేయటం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. కుదుళ్లు ధృడంగా మారతాయి.

Gray Hair : జుట్టు తెల్లబడుతుందని బాధపడుతున్నారా! వీటిని ప్రయత్నించి చూడండి

Are you suffering from gray hair? Try these

Gray Hair : వయస్సు పైబడుతుంటే వెంట్రుకలు తెల్లబడుతుండటం సహజం. అయితే చాలా మందిలో 30 ఏళ్లలోపే వెంట్రుకలు తెల్లబడటం అన్నది ప్రస్తుతం సర్వసాధారణంగా మారింది. ఇలా జరుగుతుంటే మాత్రం కాస్త ఆలోచించాల్సిందే. జుట్టు ఆరోగ్యంపై దృష్టిసారించటం మంచిది. దీని వల్ల జుట్టు త్వరగా తెల్లబడకుండా కాపాడుకోవచ్చు. టీ, కాఫీలు, మద్యం, అయిల్ ఫుడ్స్, మసాల ఆహారాలు తినేవారిలో జుట్టు త్వరగా తెల్లబడుతుంది. పోషకాలతో కూడిన ఆహారం రోజువారిగా తీసుకుంటే జుట్టు త్వరగా తెల్లబడకుండా కాపాడుకోవచ్చు.

జుట్టు తెల్లబడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటే మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

1. కొబ్బరి నూనెలో నిమ్మరసం కలుపుకుని ప్రతిరోజు తలకు పట్టిస్తే మంచిది. ఇలా చేస్తే జుట్టు త్వరగా తెల్లబడదు.

2. తాజా కొత్తిమీర ఆకులు తీసుకుని వాటిని గ్రైండ్ చేసి ఆ పేస్ట్ ను తలకు రాయటం వల్ల జుట్టు నిగారింపు సంతరించుకుంటుంది.

3. తలస్నానం చేసిన తరువాత చేతివేళ్లతో నిధానంగా జుట్టు కొనలను మసాజ్ చేస్తే రక్త ప్రసరణ బాగా జరిగి జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

4. జుట్టుకు తరచూ కొబ్బరి నూనెతో మసాజ్ చేయాలి. ఇలా చేయటం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. కుదుళ్లు ధృడంగా మారతాయి.

5. మల్లెతీగ వేర్ల పొడిని, నిమ్మరసంతో కలిపి తలకు పెట్టుకోవాలి. అరగంటపాటు అలాగే ఉంచి తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేస్తే జుట్టు త్వరగా తెల్లబడదు.

6. ఒక స్పూన్ కర్పూరం పొడిని కొబ్బరి నూనెలో వేసి కలుపుకోవాలి. ప్రతిరోజు తలకి ఈ ఆయిల్ తో మసాజ్ చేసుకోవాలి. ఇలా చేస్తే మంచి ఫలితాన్ని పొందవచ్చు.