Sunflower Seeds : ఆరోగ్యానికి ప్రయోజనం కలిగించే పొద్దు తిరుగుడు గింజలు

పొద్దుతిరుగుడు విత్తనాలను రోజూ తీసుకోవడం వల్ల రక్తప్రసరణ సక్రమంగా జరిగి బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదం తగ్గుతుంది. ఇందులో ఉండే విటమిన్ ఈ స్ట్రోక్‌ను నివారించడంలో సహాయపడుతుంది.

Sunflower Seeds : ఆరోగ్యానికి ప్రయోజనం కలిగించే పొద్దు తిరుగుడు గింజలు

Sun Flower

Sunflower Seeds : పొద్దుతిరుగుడు విత్తనాల్లో ఎన్నో పోషకాలుంటాయి. ఆరోగ్యానికి ఎంతో మేలు కలిగిస్తాయి. వీటిలో క్యాలరీలు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్లు, మినరల్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. విత్తనాల్లోని మోనోశాచురేటెడ్, శాచురేటెడ్, పాలీ అన్ శాచురేటెడ్ ఫ్యాట్స్ వల్ల వివిధ రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అనేక ఔషధ గుణాలు ఉండటంతో వివిధ రకాల వ్యాధుల నుంచి శరీరాన్ని కాపాడుకోవచ్చు.

గుండెకు మేలు చేస్తాయి. వీటిలో విటమిన్ సీ… గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. చలికాలం హృద్రోగులకు పొద్దుతిరుగుడు విత్తనాలు వారి అన్ని సమస్యలను తొలగించేందుకు దోహదం చేస్తాయి. పొద్దుతిరుగుడు విత్తనాలలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ప్రతిరోజూ కొన్ని విత్తనాలను తీసుకోవడం వల్ల రక్త నాళాలు విస్తరించి రక్త ప్రసరణ మెరుగపడుతుంది. ఇవి హై బీపీని నియంత్రిస్తాయి. ధమనుల్లో కొవ్వు పేరుకోకుండా అడ్డుకునే శక్తి ఈ విత్తనాలకు ఉంది.

మధుమేహ వ్యాధిగ్రస్తులు పొద్దుతిరుగుడు తినవచ్చు. ఇందులో కార్బోహైడ్రేట్ల పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. ప్రతిరోజూ కొన్ని గింజలను తీసుకోవడం ద్వారా రక్తంలో చక్కెర అదుపులో ఉంటుంది. జీర్ణశక్తిని పెంచుతాయి. ఈ సీడ్స్‌లో డైటరీ ఫైబర్ మల బద్ధకాన్ని నివారిస్తుంది. ఎముకలకు పుష్టి. ఈ విత్తనాల్లోని మెగ్నీషియం… ఎముకలు గట్టిపడేందుకు ఉపయోగపడుతుంది.

రోగనిరోధక శక్తి బలహీనంగా ఉండేవారు ఖచ్చితంగా ఈ విత్తనాలను తినాలి. పొద్దుతిరుగుడు విత్తనాలలో జింక్, సెలీనియం మీ రోగనిరోధక శక్తిని అమాంతం పెరిగేలా చేస్తాయి. నరాలకు మేలు. సన్ ఫ్లవర్ విత్తనాల్లోని మెగ్నీషియం మన నరాలకు రిలాక్స్ కలిగేలా చేస్తాయి. శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తొలగిస్తాయి. వీటిలో ఉండే అమీనో యాసిడ్ ఒత్తిడిని తగ్గించే సెరెటోనిన్‌ను ఉత్పత్తి చేస్తుంది.

పొద్దుతిరుగుడు విత్తనాలను రోజూ తీసుకోవడం వల్ల రక్తప్రసరణ సక్రమంగా జరిగి బ్రెయిన్ స్ట్రోక్ ప్రమాదం తగ్గుతుంది. ఇందులో ఉండే విటమిన్ ఈ స్ట్రోక్‌ను నివారించడంలో సహాయపడుతుంది. జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. ఆస్తమాను నివారించడంలో ఇవి ఉపయోగపడతాయి. ముక్కు గడ్డకట్టకుండా చేస్తాయి. జలుపు, దగ్గును తగ్గిస్తాయి.

జుట్టుకు అవసరం. మన వెంట్రుకలకు కావాల్సిన సెలెనియం, ప్రోటీన్స్, విటమిన్ ఈ, బీ వంటి వాటిని అందిస్తాయి. జుట్టు బాగా పెరిగి జుట్టు ఊడిపోవటాన్నిఅరికడుతుంది. జుట్టు తెల్లబడే సమస్యకు కూడా ఈ గింజలు చక్కటి పరిష్కారం అవుతాయి. విత్తనాల్లోని రాగి మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కాపర్ మన శరీరానికి కావాల్సిన మెలనిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ విత్తనాలు ఎముకల ఆరోగ్యానికి చాలా మంచివిగా భావిస్తారు. ఈ గింజల్లో పుష్కలంగా కొవ్వులు, మినరల్స్, విటమిన్లు, ప్రొటీన్లు, విటమిన్ ఈ, బి-కాంప్లెక్స్, మెగ్నీషియం వంటి విటమిన్లు ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా చేస్తాయి.