Amla Murabba : తియ్యగా, రుచిగా ఉండే ఆమ్లా మురబ్బా ఆరోగ్యానికి మంచిదే! దీనిని సులభంగా తయారు చేయటం ఎలాగంటే?

రోజువారీ ఆహారంలో ఆమ్లాని చేర్చుకోవడం వల్ల శరీరంలో నైట్రిక్ యాసిడ్ స్థాయిలు తగ్గుతాయి, అలాగే రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు చాలా ఉన్నాయి.

Amla Murabba : తియ్యగా, రుచిగా ఉండే ఆమ్లా మురబ్బా ఆరోగ్యానికి మంచిదే! దీనిని సులభంగా తయారు చేయటం ఎలాగంటే?

Sweet and tasty Amla Murabba is good for health! How to make it easy?

Amla Murabba : ఉసిరికాయలను తినడం వల్ల మనం ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. వీటితో పచ్చడితో పాటు వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేసుకుంటారు. ఈ పండ్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలోని కొన్ని పదార్థాల స్థాయిలు పెరుగుతాయని బహుళ అధ్యయనాలు చెబుతున్నాయి. రోజువారీ ఆహారంలో ఆమ్లాని చేర్చుకోవడం వల్ల శరీరంలో నైట్రిక్ యాసిడ్ స్థాయిలు తగ్గుతాయి, అలాగే రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు చాలా ఉన్నాయి, ఇవి శరీరంలో ఉండే హానికరమైన పదార్థాలను తొలగించడం ద్వారా క్యాన్సర్ కణాల పెరుగుదలను నివారించడంలో సహాయపడతాయి.

ఉసిరికాయలతో ఆమ్లా మురబ్బా చేసుకుని తియ్యగా, రుచిగా రోజువారిగా తీసుకోవచ్చు. ఉసిరికాయలతో ఎంతో రుచిగా ఉండే ఆమ్లా మురబ్బాను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆమ్లా మురబ్బా తయారీ ;

ముందుగా ఉసిరి కాయలు అర కిలో, పంచదార అరకిలో, నీళ్లు 2 లేదా 3 టీ స్పూన్స్, ఉప్పు పావు టీ స్పూన్, నిమ్మరసం ఒక టీ స్పూన్, యాలకుల పొడి పావు టీ స్పూన్ చొప్పున తీసుకోవాలి. ఉసికాయలను తీసుకుని శుభ్రపరిచి తడి లేకుండా తుడవాలి. తరువాత ఒక గిన్నెలో నీటిని తీసుకుని మూత పెట్టి వేడి చేయాలి. నీళ్లు వేడాయ్యక ఒక చిల్లుల ప్లేట్ లో ఉసిరికాయలను తీసుకుని ఆ ప్లేట్ ను గిన్నెలో ఉంచి మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉసిరికాయలను ఉడికించాలి. మధ్యలో కదుపుతూ మీడియం మంటపై 10 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. తరువాత ఒక్కో ఉసిరికాయను తీసుకుని పై భాగంలో రంధ్రాలు పెట్టాలి. తరువాత ఒక గిన్నెలో పంచదార, నీళ్లు వేసి వేడి చేయాలి. ఇందులోనే ఉడికించిన ఉసిరికాయలను కూడా వేసి పంచదార కరిగే వరకు కలుపుతూ ఉండాలి. పంచదార కరిగిన తరువాత ఉప్పు, నిమ్మరసం, యాలకుల పొడి వేసి 10 నిమిషాల పాటు ఉడికించాలి.

పంచదార మిశ్రమం ముదురు పాకం వచ్చే వరకు మరో 10 నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా ఉడికించడం వల్ల ఉసిరికాయలతో పాటు పంచదార మిశ్రమం కూడా రంగు మారుతుంది. తరువాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక రోజంతా అలాగే వదిలేయాలి. తరువాత ఈ ఉసిరికాయలు ఒక గాజు సీసాలో లేదా ప్లాస్టిక్ డబ్బాలో నిల్వ ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆమ్లా మురబ్బా తయారవుతుంది.