Pre-Covid Treatment : కరోనా లక్షణాలు ఉంటే.. టెస్టుకు ముందే ట్రీట్‌మెంట్ తీసుకోండి!

కరోనా లక్షణాలు ఉన్నాయా? టెస్టు చేయించుకోవడం ఆలస్యమవుతోందా? అయితే వెంటనే కరోనా ట్రీట్ మెంట్ మొదలు పెట్టేయండి.. లేదంటే ఆరోగ్యం మరింత క్షీణించే ప్రమాదం ఉంది జాగ్రత్త..

Pre-Covid Treatment : కరోనా లక్షణాలు ఉంటే.. టెస్టుకు ముందే ట్రీట్‌మెంట్ తీసుకోండి!

Take Pre Covid Treatment Before Any Test If You Felt Covid 19 Sympotms

Pre-Covid Treatment : కరోనా లక్షణాలు ఉన్నాయా? టెస్టు చేయించుకోవడం ఆలస్యమవుతోందా? అయితే వెంటనే కరోనా ట్రీట్ మెంట్ మొదలు పెట్టేయండి.. లేదంటే ఆరోగ్యం మరింత క్షీణించే ప్రమాదం ఉంది జాగ్రత్త.. కరోనా కేసులు పెరిగిపోతున్న క్రమంలో ఏ కొంచెం అనుమానం వచ్చినా ప్రతిఒక్కరూ పరీక్షల కోసం పరుగులు పెడుతున్నారు. ఈ పరిస్థితుల్లో కరోనా టెస్టు ఫలితాలు వచ్చేంతవరకు వేచి చూడటం ఆరోగ్యపరంగా మంచిదికాదు.. ర్యాపిడ్ టెస్టుల్లో కంటే ఆర్టీపీసీఆర్ టెస్టు ఫలితాలకు కనీసం మూడు నుంచి ఐదు రోజుల సమయం పడుతోంది. ర్యాపిడ్ టెస్టులో నెగటివ్ వచ్చినా.. ఆర్టీపీస్ ఆర్ లో పాజిటివ్ తేలుతోంది.

అందుకే టెస్టు కోసం ఎదురుచూసే బదులుగా.. కరోనా లక్షణాలుగా కనిపిస్తే మాత్రం టెస్టుకు ముందే ట్రీట్ మెంట్ తీసుకోవడమే సరైన పద్ధతని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. హోం ఐసోలేషన్ లో ఉంటూ లక్షణాలను బట్టి కరోనా చికిత్స తీసుకోవాలని సూచిస్తోంది. కరోనా టెస్ట్‌ల్లో రద్దీ కారణంగా పరీక్షల నిర్వహణ, ఫలితాల జాప్యం జరుగుతోంది. లక్షణాలు ఉన్నవారిలో ఏమాత్రం ఇబ్బంది అనిపించినా వెంటనే కరోనా చికిత్సకు సంబంధించి అన్నింటిని తీసుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖ సూచిస్తోంది. ఏయే లక్షణాలు ఉన్నాయో వాటికి తగినట్టుగా కరోనా మందులు తీసుకోవాలని సూచిస్తోంది.

కరోనా వైరస్‌ సోకిన వారిలో సాధారణంగా కనిపించే లక్షణాలు జ్వరం, ఒళ్లునొప్పులు, తలనొప్పి, తలతిరగడం, వాసన, రుచి కోల్పోవడం, జలుబు, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. కొంతమందిలో వాంతులు, విరేచనాలు కూడా ఉంటున్నాయి. అందరిలో ఒకటి రెండు లక్షణాలు మాత్రం తప్పకుండా ఉంటున్నాయి. ఇలాంటి లక్షణాలు రెండు రోజులకు మించి ఉంటే మాత్రం అది కరోనా అని ప్రాథమికంగా నిర్ధారించుకోవాలి. ఆ లక్షణాలకు తోడు జ్వరం కూడా వస్తే మాత్రం. వెంటనే డోలో-650 వేసుకోవాలి. అలాగే ఇతర లక్షణాలను బట్టి మందులు తీసుకోవాలి. ఇలా చేయడం ద్వారా వైరస్ బారిన పడినా తీవ్రత తక్కువగా ఉంటుంది. లక్షణాలు తగ్గితే వైరస్ ప్రభావం తగ్గి తొందరగా కోలుకునే అవకాశం ఉంటుంది. లేదంటే.. వ్యాధి తీవ్రత పెరిగి ప్రాణాల మీదకు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సొంత వైద్యం మంచిది కాదు.. పేషెంట్‌కు షుగర్, బీపీ ఉంటే ఒక రకమైన మందులు తీసుకోవాలి. దీర్ఘకాలిక సమస్యలు, ఎలర్జీలున్న వారికి మాములు వారికి మరోలా మందులు, డోసులను నిర్ధారిస్తారు. లక్షణాల తీవ్రతకు తగినట్లు తీసుకోవాలి. ఎక్కువ డోసు మాత్రలు వాడితే దుష్ప్రభావాలు ఉంటాయి. వైద్యుడిని సంప్రదిస్తే మందులు ఎలా వాడాలో సూచిస్తారు. చిన్నపిల్లల్లో కరోనా వస్తే ఆందోళన పడొద్దు.. తగిన చికిత్సను తల్లిదండ్రుల సమక్షంలోనే తీసుకోవాలి. పిల్లలకు సాధారణ లక్షణాలే కనిపిస్తున్నాయి. జ్వరం, జలుబు, వాంతులు, విరేచనాలు కనిపిస్తున్నాయి. ఈ లక్షణాలకు అనుగుణంగా చికిత్స తీసుకోవాలి. ఫోన్‌లో వైద్యుడిని సంప్రదించి మందులు, డోస్‌ను నిర్ధారించుకుంటే మంచి ఫలితం ఉంటుంది. పిల్లల్లో కోవిడ్‌ వస్తే వెంటనే చికిత్స అందిస్తే వందశాతం రికవరీ కనిపిస్తోంది.

కరోనా సోకిన వారికి జ్వరం ఎంత ఉందో ఎప్పటికప్పుడూ తెలుసుకోవాలి. థర్మామీటర్‌ అందుబాటులో ఉంచుకోవాలి. జ్వరం ఉంటే వెంటనే పారాసిటమల్‌ వేసుకోవచ్చు. కోవిడ్‌ పేషెంట్‌ ఆక్సిజన్‌ స్థాయి, గుండె వేగాన్ని చెక్ చేసుకోవాలి. ఆక్సీమీటర్‌ను కూడా దగ్గర ఉంచుకోండి. ఆక్సీమీటర్‌ అందుబాటులో లేకుంటే 20సెకన్ల పాటు ఊపిరి బిగపట్టి వదలాలి. ఈ సమయం కన్నా తక్కువ ఉంటే మాత్రం వెంటనే ఆస్పత్రిలో వైద్యుడిని సంప్రదించాలి.