ఈ న్యూ ఇయర్ లో హెల్త్ కోసం మీరేం తీర్మానాలు చేస్తారు?  

  • Published By: veegamteam ,Published On : December 27, 2019 / 10:50 AM IST
ఈ న్యూ ఇయర్ లో హెల్త్ కోసం మీరేం తీర్మానాలు చేస్తారు?  

కొత్త ఏడాదైనా ఇవి చేద్దాం, అవి చేద్దాం అనుకొంటాం. మొదట్లో ఉన్న హుషారు ఆ తర్వాత ఉండదు. మళ్లీ కొత్త యేడాది. ఈసారైనా చేద్దామనుకున్నవాటిని చేసేద్దాం. మరి ఎలాంటి అలవాట్లను మార్చుకోవాలనుకొంటున్నారు? మా దగ్గర కొన్ని ఐడియాలున్నాయి. నచ్చితే ఫాలో కండి. 

డైట్ ప్లాన్స్:

food

తినే తిండిలో కాస్త మార్పులు చేస్తే హెల్తీగా ఉంటారు. ఫ్రోటీన్స్, కార్బోహైడ్రేట్, ఫైబర్ ఉండే పండ్లు, కూరగాయలు, మెులకేత్తించిన గింజలు వలన శరీరానికి కావాల్సిన విటమిన్స్ అందుతాయి. వీటి వలన శరీర బరువును, రక్తంలో చక్కెర స్ధాయిలను 
అదుపులో ఉంచుకోవచ్చు. కూరగాయలను తినడం వల్ల బెనిఫిట్స్ ను తెలుసుకుంటే ఎలా వాడుకోవాలో ఓ ఐడియా వస్తుంది. 

పొగ, మద్యం అలవాట్లు మానుకోవటం:

smoke  

సిగరెట్, మందు లాంటివి ఆరోగ్యాన్ని చెడగొడతాయని ఎంత మొత్తుకుంటున్నా.. పట్టించుకోరు. వీటిని నియంత్రించుకుంటే దాదాపు సేఫ్ సైడ్ కి వెళ్లిపోయినట్లే. కొత్త సంవత్సరం నుంచి మానేయాలని నిర్ణయం తీసుకోవడం మానలేకపోవడం.. కామన్‌గానే చూస్తుంటాం. ఇలా మానేయాలని కాకుండా ఒక టైంలో తాగాలి. కొంతవరకే తాగాలి అనుకుంటే కంట్రోల్ చేసుకోవడం కష్టమేం కాదు. నెమ్మదిగా ఆలోచలను మార్చుకునే ప్రయత్నం చేయొచ్చు. 

బద్ధకానికి బై బై చెప్పండి:

sit

పని చేస్తున్నప్పుడు, టీవీ, మొబైల్ లాంటివి పట్టుకుని కదలకుండా గంటలకొద్దీ అక్కడే ఉండిపోతాం. ఇలా ఉండటం వల్ల వద్దన్నా ఊబకాయం వెతుక్కుంటూ వస్తుంది. వాటిని నియంత్రించే విధంగా బిజీ లైఫ్‌కు తగ్గటుగా గంటకో 5 నిమిషాలు లేచి నిలబడటం, నడవటం లాంటివి చేయాలి. 

సిక్స్ ప్యాక్స్ అవసర్లేదు:

walk

బొజ్జ తగ్గించేయాలని కొత్త సంవత్సరంలో కొత్త కమిట్‌మెంట్‌లతో సిద్ధమై జిమ్, ఏరోబిక్స్ వంటి ఫిట్‍‌నెస్ ప్రోగ్రామ్‌లకు డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తుంటారు. నిజానికి చాలా మంది గట్టిగా నిర్ణయంతో ప్రారంభించినప్పటికి లక్షాన్ని చేరుకోలేకపోతారు. అరగంట నడవటం, జాగింగ్ చేయటం, ఇంట్లో వ్యాయామం చేయటం, ఈత కొట్టడం వంటివి ఎంచుకుంటే మంచిది. ఖర్చు తక్కువ.. ఆరోగ్యం ఎక్కువ. 

నిద్రకు నో కాంప్రమైజ్

sleep

నిద్ర సరిపోక బాధపడే వాళ్లు బోలెడుమంది. దీని కారణంగా బరువు పెరగటం, గుండె జబ్బులు రావడం ఖాయం. అలాంటి నిద్రను సెల్ ఫోన్, కంప్యూటర్, టి.వి చూడటంలో మరిచిపోతున్నాం. అవసరానికి వాడి పక్కకు పడేస్తే.. నిద్రకు సరైన టైం కేటాయించగలం. 

కోపం తగ్గించుకోవటం:

angry

ప్రతి చిన్న విషయాన్నికి చిరాకు పడటంతో ఫ్రెండ్స్ ను కోల్పోతాం. చెప్పిన విషయాన్ని అర్ధం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా.. అంతే లేని పోని చిక్కులు వచ్చి మీద పడతాయి. ఎక్కువ కోపం వలన బీపీ పెరుగుతుంది. కోపం వచ్చినప్పుడు ధ్యానం, ఇష్టమైన సంగీతం వినటం వంటి చేయటం వలన కోపాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. 
 
ఓటమిని జయించటం:

depression

ఏదైనా ఒక పనిలో ఆటంకాలు ఏర్పడినప్పుడు  వాటిని ఎలా అధిగమించాలో ఆలోచించాలి. ఇప్పటివరకు చేసిన పనిలో తప్పులను చూసి,వాటిని గమనించి సరి చేసుకోవాలి. దాంతో విజయం సాధ్యమవుతుంది. చిన్నపాటి విజయానికైనా సంతోషం పట్టడం అలవాటు చేసుకోవటం వలన అది మనలో పట్టుదలను పెంచుతుంది. రోజువారీ జీవితంతో కొన్ని మార్పులు చేసుకోగలిగినా మనం అనుకున్న లక్ష్యం సాధించటానికి సహాయపడుతాయి.

ఎక్కువ సమయం బయట గడపండి:

nature

ఆరుబయట ఎక్కువ సమయం గడపడం వల్ల ఒత్తిడిని తగ్గించడం, మానసిక స్ధితిని పెంచడం,రక్తపోటును నియత్రించడం ద్వారా ఆరోగ్యాన్నికి మంచింది. ప్రతి రోజులో కొంత సమయం బయట గడపడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. అంతేకాకుండా వారాన్నికి ఒకసారి స్నేహితులతో బయటకి వెళ్లడం, ప్రకృతిని అస్వాధించటం వంటివి పనులు చేయటం వంటి నిర్ణయాలు మీ దినచర్యలో భాగంగా పెట్టుకోండి.