Lose Weight : శరీర బరువు వేగంగా తగ్గేందుకు ఉపకరించే అల్పాహారాలు ఇవే!

అరటి పండ్లు శరీర శక్తిని ఇవ్వటమేకాక బ్లడ్ ప్రెజర్ ను కూడా అదుపులో ఉంచుతాయి. అరటి పండులో పొటాషియం ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. కనుక ప్రతిరోజూ 1 లేదా 2 అరటిపండ్లు తీసుకోవటం వల్ల బరువు సులభంగా తగ్గటానికి అవకాశం ఉంటుంది.

Lose Weight : శరీర బరువు వేగంగా తగ్గేందుకు ఉపకరించే అల్పాహారాలు ఇవే!

These are the breakfasts that help the body lose weight fast!

Lose Weight : బరువు తగ్గాలన్న ప్రయత్నాల్లో ఉన్నవారికి కొన్ని రకాల అల్పాహారాలు ఎంతగానో తోడ్పడతాయి. కొన్ని రకాల అల్పాహారాలు తీసుకోవటం వల్ల ఆకలి కోరికలు రెట్టింపు అవుతాయి. దీంతో మరింత బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి. కొన్ని రకాల అల్పాహారాలను తీసుకోవటం వల్ల తినాలన్న కోరికలను అరికట్టవచ్చు. తద్వారా బరువు తగ్గడం కూడా
సులభమతుంది. ఇలాంటి అల్పాహారాలు కడుపు నిండిన అనుభూతిని కలిగించి క్రమేపి బరువు తగ్గేలా చేస్తాయి.

ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునేవారు అనవసరమైన చిరుతిండిని పక్కన పెట్టి బరువు తగ్గడం సాధ్యం అవ్వాలంటే ప్రోటీన్ తో కూడిన అల్పాహారాలను తీసుకోవటం తప్పనిసరని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. బరువు తగ్గేందుకు తోడ్పడే అల్పహారాలే ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

1. గుడ్లు ; మాంసకృత్తులు మరియు సెలీనియం మరియు రిబోఫ్లావిన్ వంటి ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాల సమృద్ధిగా లభిస్తాయి. గుడ్లు పోషకాహారానికి నిజమైన శక్తి కేంద్రంగా చెప్పవచ్చు. బరువు తగ్గడానికి ప్రోత్సాహాన్ని అందించడానికి అల్పాహారంతో పాటు గుడ్లు తింటే ఆకలిని తగ్గిస్తుంది. 30 మంది అధిక బరువు గల స్త్రీలలో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం, అల్పాహారంలో గుడ్లు తినడం వల్ల రోజులో ఆహారం తీసుకోవడం తగ్గుతుందని తేలింది.

అదేవిధంగా, 152 మంది పెద్దలలో మరొక అధ్యయనంలో గుడ్లు అల్పాహారం గా తీసుకోవటం వల్ల 65% ఎక్కువ బరువు తగ్గుతుందని తేలింది.మరియు ఎనిమిది వారాల వ్యవధిలో నడుము చుట్టుకొలత 34% తగ్గిందని కనుగొన్నారు. ఉడకబెట్టడం నుండి అమ్లెట్ వరక విభిన్న మార్గాల్లో గుడ్లను తీసుకోవచ్చు.

2. ఓట్ మీల్: ఒక కప్పు ఓట్ మీల్ ని పాలల్లో కానీ, ఇతర రూపంలో కానీ తీసుకొంటే బరువు సులభంగా తగ్గవచ్చు. ఓట్ మీల్ లోని ఫైబర్ ఇతర కార్బొహైడ్రేట్ల వల్ల శరీరానికి సరికొత్త ఉత్తేజం కలుగుతుంది. దీనిలోని పొటాషియం, పాస్ఫరస్ వంటి ఖనిజలవణాలు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడతాయి. అధిక కొవ్వు సమస్య కూడా ఉండదు. కడుపు నిండిన భావన వల్ల ఎక్కువ మొత్తంలో ఆహారం తీసుకునేందుకు అవకాశం ఉండదు. దీంతో సులభంగా బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది.

3. బ్రౌన్ బ్రెడ్: అల్పాహారంగా బ్రౌన్ బ్రెడ్ తీసుకోవటం మంచిది. ఇది ప్రధానంగా తృణధాన్యాలతో తయారవుతుంది. అనేక రుచులు, రకాలలో ప్రస్తుతం అందుబాటులో ఉంది. బరువు తగ్గే ఆహార ప్రణాళిక పాటించేవారికి ఇది మంచి పోషకాలిచ్చే చిరుతిండి. బ్రౌన్ బ్రెడ్ ఒక ముక్కను తీసుకోవటం ద్వారా 32కాలరీలు అందుతాయి. 0.2 గ్రాముల కొవ్వును కలిగి వుంటుంది, శరీరానికి మేలు చేసి బరువు తగ్గడంలో ఉపకరించే ఈ చిరుతిండి ద్వారా ధాన్యం, పీచు పదార్ధం శరీరానికి అందుతాయి.

4. అరటి పండు: అరటి పండ్లు శరీర శక్తిని ఇవ్వటమేకాక బ్లడ్ ప్రెజర్ ను కూడా అదుపులో ఉంచుతాయి. అరటి పండులో పొటాషియం ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. కనుక ప్రతిరోజూ 1 లేదా 2 అరటిపండ్లు తీసుకోవటం వల్ల బరువు సులభంగా తగ్గటానికి అవకాశం ఉంటుంది. అయితే అధికంగా తింటే వాటిలోని షుగర్ శరీరంలోని షుగర్ స్ధాయి పెరిగేలా చేస్తుంది. కాబట్టి తక్కువ మోతుదులో మాత్రమే అరటి పండ్ల ను అల్పాహారంగా తీసుకోవాలి.

5. పెరుగు: కొవ్వు లేని తక్కువ కొవ్వుండే పాలతో తయారైన పెరుగు బరువు తగ్గాలనుకునే వారికి మంచి అల్పాహారంగా చెప్పవచ్చు. పెరుగు తినడం ఆకలిని తగ్గించడానికి ఆరోగ్యకరమైన మార్గమని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. పెరుగులో అనేక పోషక విలువలు కూడా వుంటాయి. ఇందులో కాల్షియం, మాంసకృత్తులు, పొటాషియం పుష్కలంగా వుంటాయి. ఇవి మంచి సూక్ష్మ క్రిములను ఉత్పత్తి చేసి జీర్ణ సంబంధమైన సమస్యలను తొలగిస్తాయి. బరువును సులభంగా తగ్గిస్తుంది.