Cancer : క్యాన్సర్ కు అతి సాధారణ కారణాలు ఇవే!

సాధారణంగా క్యాన్సర్ వచ్చిన వారిలో అసాధారణంగా బరువు తగ్గుదల కనిపిస్తుంది. చర్మంపై తరచూ కమిలిన గాయాలు కనిపిస్తాయి. బలహీనత, అలసట ఉంటుంది. శ్వాస సమస్యలు, నెలరోజులకు పైగా దగ్గు ఉంటుంది. చర్మంపై పుట్టుమచ్చలు, గడ్లలు వాటి పరిమాణంలో మార్పులు చోటు చేసుకోవటం, ఆకలి లేమి, అతిసారం, మల బద్ధకం, నిరంతరం జ్వరం, రాత్రి సమయంలో చమటలు పట్టం, కండరాల నొప్పులు వంటివి ప్రధాన లక్షణాలుగా కనిపిస్తాయి.

Cancer : క్యాన్సర్ కు అతి సాధారణ కారణాలు ఇవే!

Cancer

Cancer : ప్రపంచాన్ని వణికిస్తున్న భయంకరమైన జబ్బుల్లో క్యాన్సర్ కూడా ఒకటి. శరీరంలో కణాలు అసాధారణంగా పెరుగుదల వల్ల కణితులు ఏర్పడతాయి. ఇది శరీరంలో అవయవాలపైన, కణాజాలాల కణాలపైన ప్రభావం చూపిస్తుంది. ఈ క్యాన్సర్ శరీర భాగాలకు వ్యాప్తి చెందటం, లేకుంటే ఒకేచోట పెరగి గడ్డలుగా ఏర్పడటం జరుగుతుంది. వివిధ రకాలైన క్యాన్సర్లకు కారణాలు వేరువేరుగా ఉండవచ్చు. క్యాన్సర్ వచ్చిన వారిలో శరీరంలో వచ్చి ప్రాంతాన్ని బట్టి దాని ప్రభావానికి సంబంధించి లక్షణలు కనిపిస్తాయి.

సాధారణంగా క్యాన్సర్ వచ్చిన వారిలో అసాధారణంగా బరువు తగ్గుదల కనిపిస్తుంది. చర్మంపై తరచూ కమిలిన గాయాలు కనిపిస్తాయి. బలహీనత, అలసట ఉంటుంది. శ్వాస సమస్యలు, నెలరోజులకు పైగా దగ్గు ఉంటుంది. చర్మంపై పుట్టుమచ్చలు, గడ్లలు వాటి పరిమాణంలో మార్పులు చోటు చేసుకోవటం, ఆకలి లేమి, అతిసారం, మల బద్ధకం, నిరంతరం జ్వరం, రాత్రి సమయంలో చమటలు పట్టం, కండరాల నొప్పులు వంటివి ప్రధాన లక్షణాలుగా కనిపిస్తాయి.

క్యాన్సర్ కు దారితీసే కారకాలు ; ధూమపానం, పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల ఊపిరితిత్తులు, నోటి క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉటుంది. అధిక మద్యం సేవనం కూడా కాలేయ క్యాన్సర్ కు దారి తీస్తుంది. అనారోగ్య కరమైన ఆహారం, ఫైబర్ తక్కువగా ఉన్న ఆహారం, శుద్ధి చేసిన తిను బండారాలు పెద్ద పేగు క్యాన్సర్ కు దారి తీస్తాయి. టెస్టో స్టెరోన్, ఈస్ట్రోజన్ హార్మోన్ల అధిక స్ధాయిలు ప్రొస్టేట్, రొమ్ము క్యాన్సర్ కు కారణమౌతాయి. వయస్సు పైబడిన వారిలో కొన్ని రకాల క్యాన్సర్లకు గుర్యే అవకాశాలు ఉంటాయి.

కుటుంబ చరిత్ర, జన్యుపరమైన లోపాలు కారణంగా క్యాన్సర్ల ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అనిలిన్ వంటి రసాయనాలు మూత్రాశయ క్యాన్సర్లకు దారి తీస్తాయి. కొన్ని రకాల బాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్లు క్యాన్సర్లకు కారణమౌతాయి. హెపటైటిస్ బి, సి ఇన్ఫెక్షన్లు కాలేయ క్యాన్సర్ కు, హ్యూమన్ పాపిల్లోమా వైరస్ గర్భాశయ క్యాన్సర్ కు దారి తీస్తుంది. హానికరమైన రేడియేషన్, ఎక్స్ రేలు, కూడా క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయి. ఊబకాయం, కొవ్వులతో కూడిన ఆహారం, శారీరక శ్రమలేకపోవటం క్యాన్సర్లకు దారితీసే ప్రమాదం ఉంటుంది.