Menopause Problems : మోనోపాజ్ దశకు చేరువవుతున్న సమయంలో మహిళల్లో ఎదురయ్యే సమస్యలు ఇవే!

ఆహార నియమాలు పాటించడం, క్రమం తప్పని వ్యాయామం, ఈ లక్షణాల వలన ఎక్కువ బాధ పడకుండా చేస్తాయి. మితమైన సమతులాహారం అంటే, ఆకుకూరలూ, తాజా పళ్లూ, సోయా ఉత్పత్తులూ, ఫ్లాక్ సీడ్సూ ఆహారంలో ఉండేట్టు చూసుకోవానలి.

Menopause Problems : మోనోపాజ్ దశకు చేరువవుతున్న సమయంలో మహిళల్లో ఎదురయ్యే సమస్యలు ఇవే!

Menopause Problems : 45 ఏళ్లు దాటిన స్త్రీలకు ఈ పీరియడ్స్ లో కొన్ని మార్పులు వస్తాయి. వరుసగా పీరియడ్స్ రాని స్త్రీలను మెనోపాజ్‌కు చేరుకున్నట్లు పరిగణిస్తారు. అంతకుముందు, మెనోపాజ్‌కు ముందు శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయిలు క్షీణించడం ప్రారంభిస్తాయి. ఫలితంగా పీరియడ్స్ ఆగిపోతాయి. ఈస్ట్రోజన్ ఒక రక్షణ హార్మోన్, రక్త నాళాల సమస్యలు రాకుండా కాపాడుతూ ఉంటుంది. ఎప్పుడయితే దాని స్థాయి తగ్గుతుందో అప్పుడు రక్తనాళాల గోడలు మందంగా మారి, ఎథిరో స్క్లీరోసిస్ అనే వ్యాథి రావడం వలన హార్ట్ ఎటాక్స్, బ్రెయిన్‌లో స్ట్రోక్ వచ్చే ప్రమాద అవకాశాలు పెరుగుతాయి. మెనోపాజ్ దశలో అండాలు పూర్తయిపోయి విడుదల కాకపోవడం వలన మొదట ప్రొజెస్టిరోన్ హార్మోన్ స్థాయి తగ్గిపోతుంది, ఆ తర్వాత నెమ్మదిగా ఈస్ట్రోజన్ స్థాయి తగ్గిపోతుంది.

కణజాలాలు కుచించుక పోవడం ఈ మార్పుల వలన తొందరగా ఇన్ఫెక్షన్లు వస్తాయి, జనన మార్గం పొడిగా ఉండటం వలన దురద, మంట ఉండటంతో దాంపత్య సంబంధాల పట్ల విముఖత, నిరాసక్తత ఏర్పడుతాయి. మెనోపాజ్‌కు చేరువవుతున్న మహిళలకు లక్షణాలు తేలికపాటివిగా ఉంటాయి. కొంతమందికి ఈ లక్షణాలు చాలా కాలం పాటు ఉంటాయి. ఆ లక్షణాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

1. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్: ఇతర సమస్యల మాదిరిగానే, ఈస్ట్రోజెన్ లోపం కూడా మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. ముఖ్యంగా యోనిలోని కణజాలాలు పొడిబారి సన్నగా మారడం వల్ల వాటిలో బ్యాక్టీరియా సులభంగా వృద్ధి చెందుతుంది.

2. బరువు పెరుగుట: మెనోపాజ్ శరీర కొవ్వు పెరుగుదలకు ,కణజాల ద్రవ్యరాశిలో తగ్గుదలకు కారణమవుతుంది. దీని కారణంగా శరీరం అదనపు కేలరీలను బర్న్ చేయలేకపోతుంది. శరీరం బరువు పెరగడం ప్రారంభమవుతుంది. మధుమేహం కూడా వస్తుంది.

3. గుండె రక్తనాళాలపై ప్రభావం: మెనోపాజ్ వల్ల గుండె రక్తనాళాల ఆరోగ్యం ప్రభావితం కాదు. కానీ ఈస్ట్రోజెన్ స్థాయిలు చాలా తక్కువగా ఉన్నప్పుడు, అది రక్త నాళాలను ప్రభావితం చేయడం ప్రారంభిస్తుంది. ఈస్ట్రోజెన్ స్థాయిలు పడిపోవడంతో, రక్త నాళాలు కొవ్వు పేరుకుపోవడం ప్రారంభిస్తాయి. ఒక్కోసారి గుండె జబ్బుగా మారవచ్చు. ఒత్తిడి, నిద్రలేమి కూడా గుండె జబ్బులకు కారణమవుతాయి.

4. బోలు ఎముకలు: శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గడం వల్ల ఎముకలు బలహీనంగా మారడం. ఒక సమయంలో పగుళ్లు కూడా ఏర్పడే పరిస్థితిని ఆస్టియోపోరోసిస్ అంటారు. మన శరీరంలోని ఎముకలను రక్షించడం ఈస్ట్రోజెన్ హార్మోన్ పని. వృద్ధాప్యం వల్ల కూడా ఎముకలు బలహీనంగా తయారవుతాయి.

5. మూత్ర సమస్య : రుతువిరతి సమయంలో గర్భాశయం ,యోని కణజాలాలు మార్పులు కనిపిస్తాయి. వయసు కూడా ఇందుకు కారణం. అటువంటి వాతావరణంలో, మూత్రాన్ని నియంత్రించే సామర్థ్యం తగ్గుతుంది. దీనివల్ల ఆకస్మికంగా, ఆకస్మికంగా మూత్ర విసర్జన చేయాలనే కోరిక కలుగుతుంది.

ఈ సమస్యల నుండి జాగ్రత్తగా ఉండటం మంచిది. ప్రతి మహిళా నలభై సంవత్సరాలు దాటాక గర్భాశయ కాన్సర్‌కీ, రొమ్ము కాన్సర్‌కీ స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవాలి. అల్ట్రా సౌండ్ స్కానింగ్‌తో గర్భాశయంలోనూ, ఓవరీల్లోనూ గడ్డలున్నాయేమో చూడాలి. మామోగ్రామ్ , కరోనరీ యాంజియోగ్రామ్, థైరాయిడ్ పరీక్షలు, మూత్ర పరీక్షలు, కాల్షియమ్, విటమిన్ డి స్థాయిని చూసుకోవడం, బీపీ, షుగర్ రెగ్యులర్‌గా చెక్ చేయించుకోవాలి.

ఆహార నియమాలు పాటించడం, క్రమం తప్పని వ్యాయామం, ఈ లక్షణాల వలన ఎక్కువ బాధ పడకుండా చేస్తాయి. మితమైన సమతులాహారం అంటే, ఆకుకూరలూ, తాజా పళ్లూ, సోయా ఉత్పత్తులూ, ఫ్లాక్ సీడ్సూ ఆహారంలో ఉండేట్టు చూసుకోవానలి. కెఫీన్, స్మోకింగ్, ఆల్కహాల్, మసాలాలు సమస్యలని ఎక్కువ చేస్తాయి కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. రోజుకి నలభై అయిదు నిమిషాల బ్రిస్క్ వాక్, ధ్యానం, యోగా ఇవి కొన్ని మెనోపాజ్‌లో వచ్చే మానసిక సమస్యలకు చక్కని నివారణ అని వైద్యులు భావిస్తున్నారు.