Oxygen Levels : శరీరంలో ఆక్సిజన్ స్థాయిలను పెంచే ఆహారం ఇదే!

శరీరంలో ఆక్సిజన్ స్థాయిలను పెంచడానికి నిమ్మకాయలు ఉపయోగపడతాయి. ఆక్సిజన్ స్థాయిలు మెరుగుపరచడానికి ఖాళీ కడుపుతో ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం కలిపి తాగటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

Oxygen Levels : శరీరంలో ఆక్సిజన్ స్థాయిలను పెంచే ఆహారం ఇదే!

Oxygen Food

Oxygen Levels : శరీరానికి కావలసిన ఒక ముఖ్యమైన పోషకం ఆక్సిజన్. రోగనిరోధక వ్యవస్థను పెంపొందించటంలో ఆక్సిజన్ కీలక పాత్రను పోషిస్తుంది. ఆక్సిజన్ స్ధాయిలు తగ్గితే పెనుముప్పు వాటిల్లుతుంది. కరోనా నేపధ్యంలో శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ పడిపోకుండా జాగ్రత్తగా వ్యవహరించటం అవసరం. ఇందుకోసం ప్రత్యేకంగా కొన్ని రకాల ఆహారాలను రోజువారి మెనూలో భాగం చేసుకోవటం మంచిది. ఆ ఆహారాలు శరీరంలో ఆక్సిజన్ స్థాయిలను పెంచటంలో దోహదపడతాయి. ఇందుకు కారణం అవి విటమిన్లు, ఖనిజాలు వంటి క్రియాశీల సమ్మేళనాలతో నిండి ఉండటం. ఆల్కలీన్ pHని కలిగి ఉండటం వల్ల శరీరంలో ఆక్సిజన్ స్ధాయిలు పెరిగేందుకు చక్కగా ఉపకరిస్తాయి.

శరీరంలో ఆక్సిజన్ లెవల్స్ పెంచుకునేందుకు ముఖ్యంగా హిమోగ్లోబిన్ కలిగిన ఆహారాలను తినటం మంచిది. ఆక్సిజన్ లెవల్స్ పెంచటంలో కాపర్ బాగా సహాయపడుతుంది. కాపర్ పుష్కలంగా లభించే ఆహారాలైన రాగులు, పీతలు, ఆలుగడ్డలు, నువ్వులు, జీడిపప్పు వంటివి తీసుకోవటం వల్ల ఆక్సిజన్ స్ధాయిలను పెంచుకోవచ్చు. బచ్చలికూర వంటి ఆకు కూరలు తీసుకోవడం వల్ల ఎలాంటి అవరోధం లేకుండా కీలక అవయవాలకు రక్తం ప్రవహిస్తుంది. తద్వారా ఆక్సిజన్ స్థాయిలను పెంచడంలో కీలక పాత్ర వహిస్తుంది.

శరీరంలో ఆక్సిజన్ స్థాయిలను పెంచడానికి నిమ్మకాయలు ఉపయోగపడతాయి. ఆక్సిజన్ స్థాయిలు మెరుగుపరచడానికి ఖాళీ కడుపుతో ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం కలిపి తాగటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఆక్సిజన్ స్ధాయిలను పెంచటానికి పసుపు చక్కగా పనిచేస్తుంది. రక్త ప్రసరణ దీని ద్వారా మెరుగవుతుంది. ఇన్ఫెక్షన్లు అరికట్టటంతోపాటు ఆక్సిజన్ లెవల్స్ పెంచుకోవచ్చు. ద్రాక్షా కూడా రక్తప్రసరణను మెరుగుపర్చి ఆక్సిజన్ లెవల్స్ పెంచటంలో సహాయపడుతుంది. హార్మోలన్ల సమతుల్యతకు దోహదం చేస్తుంది.

నట్స్ గుండె మరియు రక్త నాళాలకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అవి శరీరంలో రక్త ప్రసరణ సాఫీగా జరిగేందుకు తోడ్పడుతాయి. ఆక్సిజన్ స్థాయిలను మెరుగుపరుస్తాయి. అవోకాడోలు ఆరోగ్యకరమైన కొవ్వులతో సహా సమృద్ధికరమైన పోషకాలను కలిగి ఉంటాయి. ఈ పోషకాలు ఆక్సిజన్ స్థాయిలను పెంచడానికి, కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. బొప్పాయి లో పీహెచ్ విలువ 8.5 కంటే ఎక్కువ ఉంటుంది. దీని వల్ల రక్త కణాలలో ఆక్సిజన్‌ లెవల్స్ పెరుగుతాయి.