Blood Pressure : ఈ లక్షణాలుంటే హైబీపీ ఉన్నట్టే…జాగ్రత్తపడండి..

ఛాతిలో నొప్పి వ‌స్తుంటే దాన్ని హైబీపీగా అనుమానించాలి. బీపీ ఎక్కువ‌గా ఉంటే కొన్నిసార్లు ముక్కులోంచి ర‌క్తం ప‌డుతుంది. త‌ల‌నొప్పి తీవ్రంగా ఉంటుంది.

Blood Pressure : ఈ లక్షణాలుంటే హైబీపీ ఉన్నట్టే…జాగ్రత్తపడండి..

Bp

Blood Pressure : ఇటీవలికాలంలో అధికశాతం మంది హైబీపీతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. రక్తపోటు 140/90 ఎంఎం కంటే ఎక్కువగా ఉంటే హైబీపీగా నిర్ధారించవచ్చు. హైబీపీ ఉన్న వారు ఆరోగ్యం విషయంలో ఎట్టిపరిస్ధితుల్లో నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యంగ వ్యవహరిస్తే గుండె జబ్బులు, పక్షవాతం, కిడ్నీ ఫెల్యూర్ వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది హైపర్ టెన్షన్ బారిన పడుతున్నట్లు వైద్యనిపుణులు చెబుతున్నారు. క్రింది లక్షణాల ద్వారా హైబీపీ సమస్యను సులభంగా గుర్తించవచ్చు.

హైబీపీ ఉంటే మైకం క‌మ్మిన‌ట్లు అనిపిస్తుంది. మ‌త్తుగా ఉంటారు. నిద్ర బాగా పోయినా స‌రే.. మ‌త్తుగా ఉంటుంటే హైబీపీ అని అనుమానించాలి. బీపీ మ‌రీ ఎక్కువ‌గా ఉంటే కంటి చూపు స‌రిగ్గా ఉండ‌దు. మ‌సక‌గా క‌నిపిస్తుంది.హైబీపీ ఉన్నవారికి క‌డుపులో వికారంగా అనిపిస్తుంది. మూత్రం త‌క్కువ‌గా వ‌స్తుంది. చేతులు, పాదాలు, ఇత‌ర భాగాల్లో స్పర్శ కోల్పోయి మొద్దు బారిన‌ట్లు అనిపిస్తుంది.

ఛాతిలో నొప్పి వ‌స్తుంటే దాన్ని హైబీపీగా అనుమానించాలి. బీపీ ఎక్కువ‌గా ఉంటే కొన్నిసార్లు ముక్కులోంచి ర‌క్తం ప‌డుతుంది. త‌ల‌నొప్పి తీవ్రంగా ఉంటుంది. హైబీపీ ఎక్కువైతే కొంద‌రికి మూర్ఛ కూడా వ‌స్తుంది. శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బందులు కూడా వ‌స్తాయి.అధిక రక్తపోటు ఉంటే ముఖ‌మంతా ఉబ్బిపోయిన‌ట్లు క‌నిపిస్తుంది. ముఖంలోని ర‌క్తనాళాలు వెడల్పయి ర‌క్తం ఎక్కువ‌గా ప్రస‌రించడంతో ముఖం ఎర్రగా క‌నిపిస్తుంది.

ఇలాంటి లక్షణాలు కనిపించిన వెంటనే కొన్ని రకాల జాగ్రత్తలు పాటించటం మంచిది. దురల్వాట్లు ఏమైనా ఉంటే వాటిని మానుకోవటం మంచిది. సిగరెట్, మద్యం వంటి వాటికి దూరంగా ఉండాలి. రెడ్ మీట్, నూనెతో కూడిన ఫుడ్ లు తినటం మానుకోవాలి. తినే ఆహారంలో కూరగాయాలు ఎక్కవగా ఉండేలా చూసుకోవాలి. నిత్యం రోజుకు ఒక గంటపాటు వ్యాయామాలు చేయాలి. శరీరం డీ హైడ్రేట్ కాకుండా నీరు ఎక్కవగా తాగాలి. సకాలంలో వైద్యుని వద్దకు వెళ్ళి వారు సూచించిన విధంగా చికిత్స తీసుకుంటూ ఉంటే హైబీపీ సమస్య ఆరోగ్యనికి ముప్పుగా మారకుండా చూసుకోవచ్చు.