Vitamin E : చర్మం, జుట్టు సమస్యల్ని దూరం చేయటంలో సహాయపడే విటమిన్ ఇ !

వ్యాధి నిరోధకతను పెంపొంధించుకోవడానికి విటమిన్ ఇ ఆహారాలు అధికంగా తీసుకోవాలి. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహించి చర్మం మెరిసిపోయేలా చేస్తుంది. చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా కనిపించేలా చేస్తుంది. కలబందతో పాటు, ఈ విటమిన్ ఇను ఎన్నో సౌందర్య ఉత్పత్తుల్లో కలపుతున్నారు.

Vitamin E : చర్మం, జుట్టు సమస్యల్ని దూరం చేయటంలో సహాయపడే విటమిన్ ఇ !

vitamin-e

Vitamin E : సౌందర్యానికి, ఆరోగ్యానికి పలు విటమిన్లు అవసరమౌతాయి. వాటిలో విటమిన్ ఇ కూడా ఒకటి. ఆరోగ్యానికి, సౌందర్యానికి కేరాఫ్ గా విటమిన్ ఇ ని చెప్పవచ్చు. విటమిన్ ఇ ఉన్న ప్రోడక్ట్స్ వాడడం వల్ల వృద్ధాప్యం దూరమవ్వడమే కాకుండా శరీర పనితీరు మెరుగ్గా మారుతుంది. విటమిన్ ఈ కీ చర్మాన్ని రాడికల్ డ్యామేజ్‌ నుంచి రక్షించడం కోసమే కాకుండా యాంటీ ఇన్ఫ్లమేషన్ కోసం ఉపయోగిస్తారు. మన శరీరంలో జరిగి అనేక కార్యకలాపాలను మెటబాలిక్ యాక్టివిటీస్ అంటారు. ఈ జీవక్రియలు సరిగా జరగడానికి ఇ విటమిన్ దోహదపడుతుంది.

వ్యాధి నిరోధకతను పెంపొంధించుకోవడానికి విటమిన్ ఇ ఆహారాలు అధికంగా తీసుకోవాలి. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహించి చర్మం మెరిసిపోయేలా చేస్తుంది. చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా కనిపించేలా చేస్తుంది. కలబందతో పాటు, ఈ విటమిన్ ఇను ఎన్నో సౌందర్య ఉత్పత్తుల్లో కలపుతున్నారు. వయస్సు పెరుగుతున్న కొద్దీ చర్మంలో వచ్చే అనేక మార్పులను ఇది సమర్థంగా నివారించి దీర్ఘకాలం పాటు యవ్వనంగా ఉంచుతుంది.

పొడి చర్మం ఉన్న వారు విటమిన్ ఇ తీసుకుంటే చర్మం సున్నితంగా తయారవుతుంది. జుట్టు సమస్యల్ని కూడా విటమిన్ ఇ దూరం చేస్తుంది. తలపై రక్తప్రసరణనని మెరుగు పరుస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. అదే విధంగా జుట్టుని స్ట్రాంగ్ అయ్యేలా చేస్తుంది. జుట్టు క్యుటికల్స్‌కి కోల్పోయిన్ షైన్‌ని తిరిగి తీసుకురావడం ద్వారా ఆరోగ్యంగా కనిపించేలా చేస్తుంది. యూవీ కిరణాల నుంచి చర్మాన్ని సంరక్షించేది విటమిన్ ఇ మాత్రమే. అందుకో దైనందిన ఆహారంలో తప్పకుండా విటమిన్ ఇ ఉండేట్టు చూసుకోవాలి. సన్ ఫ్లవర్ ఆయిల్. బియ్యం ఊక, గోధుమ జెర్మ్, ఆలివ్, పొద్దుతిరుగుడు, సోయాబీన్, మొక్కజొన్న నూనె మొదలైన కూరగాయల నూనెలు విటమిన్ ఇకు గొప్ప వనరులు.