walnuts Benefits : థైరాయిడ్ సమస్యలతోపాటు, క్యాన్సర్ దరిచేరకుండా సహాయపడే వాల్ నట్స్!

వీటిని రోజు వారి ఆహారంలో బాగం చేసుకోవటం ద్వారా మెటబాలిక్ సిండ్రోమ్ సంబంధిత స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. పొట్ట ద‌గ్గర పేరుకుపోయిన కొవ్వు క‌రుగుతుంది. జీర్ణాశ‌యంలో మంచి బాక్టీరియా పెరుగుతుంది.

walnuts Benefits : థైరాయిడ్ సమస్యలతోపాటు, క్యాన్సర్ దరిచేరకుండా సహాయపడే వాల్ నట్స్!

walnuts Benefits

walnuts Benefits : వాల్‌నట్స్‌లో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు వంటి అనేక పోషకాలు ఉన్నాయి. కాబట్టి వీటిని తీసుకుంటే శరీరానికి చాలా రకాల పోషకాలు లభిస్తాయి. వాల్‌నట్స్ తీసుకోవడం వల్ల అనేక రకాల వ్యాధులు నయమవుతాయి. బరువు తగ్గాలనుకునే ప్రయత్నాల్లో ఉన్నవారికి వాల్ నట్స్ మంచి ఆహారంగా చెప్పవచ్చు. వాల్ నట్స్ లో మెలటోనిన్ అనే కాంపౌండ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. వాల్ నట్స్ లో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. గుండెజబ్బులు రాకుండా రక్షిస్తాయి.

థైరాయిడ్, క్యాన్సర్ నివారణకు వాల్ నట్స్ ;

వాల్‌నట్స్ ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. వాల్‌నట్‌లను తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ తోపాటుగా గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. మాంసాహారానికి బదులుగా వాల్ నట్స్ తీసుకోవటం వల్ల రొమ్ము క్యాన్సర్ వంటి సమస్యలు దరిచేరకుండా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. ఆహారంలో క్యాన్సర్ నివారణ ఎంపికగా వాల్‌నట్‌లను చేర్చవచ్చని అధ్యయనాలు సైతం సూచిస్తున్నాయి. వాల్‌నట్స్‌లో ఉండే పాలీఫెనాల్ ఎలాజిటానిన్‌లు క్యాన్సర్ నుంచి రక్షించడానికి సహాయపడతాయి. వాల్ న‌ట్స్ ను నిత్యం గుప్పెడు మోతాదులో తిన‌డం వ‌ల్ల అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.

అలాగే థైరాయిడ్ వంటి సమస్యలను తొలగించడానికి ప్రభావవంతంగా సహాయపడుతుంది. అయోడిన్ లోపం కారణంగా థైరాయిడ్ సమస్య ఉత్పన్నం అవుతుంది. అయోడిన్ స్థాయిలను తిరిగి నింపడానికి, వారి ఆహారంలో సెలీనియం తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. అయోడిన్ లోపం వల్ల దెబ్బతినే శారీరక విధులను పునరుద్ధరించడంలో సెలీనియం సహాయపడుతుంది. వాల్‌నట్స్ లో సెలీనియం గొప్ప మూలం కాబట్టి, ఇది థైరాయిడ్ సమస్యను తగ్గించటంలో సహాయపడుతుంది. వాల్ న‌ట్స్‌లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ యాంటీ డిప్రెస్సెంట్స్‌గా ప‌నిచేస్తాయి. అంటే డిప్రెష‌న్‌, ఒత్తిడి, ఇత‌ర మాన‌సిక స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

వీటిని రోజు వారి ఆహారంలో బాగం చేసుకోవటం ద్వారా మెటబాలిక్ సిండ్రోమ్ సంబంధిత స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. పొట్ట ద‌గ్గర పేరుకుపోయిన కొవ్వు క‌రుగుతుంది. జీర్ణాశ‌యంలో మంచి బాక్టీరియా పెరుగుతుంది. ఎముక‌ల ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది. చ‌ర్మం, వెంట్రుక‌లు ఆరోగ్యంగా ఉంటాయి. నానబెట్టిన వాల్ నట్స్ తినటం వలన రక్తంలో చెడు కొలెస్టరాల్ ని తొలగించి మంచి కొలస్ట్రాల్ ని పెంచుతుంది. వాల్ నట్స్ తినటం వలన కడుపు నిండిన భావన కలిగి తొందరగా ఆకలి వేయదు. బరువు త్వరగా తగ్గేందుకు అవకాశం ఉంటుంది.