Live Longer : ఎక్కువ కాలం జీవించాలనుకుంటున్నారా!

నిద్రకు అవసరమైన ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలి. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ను నిద్రసమయంలో ఉపయోగించరాదు. చల్లని, చీకటి,నిశ్శబ్ద ప్రదేశాలు ప్రశాంతంగా నిద్రపోయేందుకు సహాయపడతాయి.

Live Longer : ఎక్కువ కాలం జీవించాలనుకుంటున్నారా!

Live Longer

Live Longer : ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని చాలా మంది కోరుకుంటారు. చివరి శ్వాస వరకు అన్నిపనులు తమంతటతామే ఇతరులపై అధారపడకుండా చేసుకోవాలని అనుకుంటారు. అయితే వయో భారం కారణంగా శరీరం సహకరించదు. వయస్సు పైబడినా కూడా యాక్టివ్ గా ఉండాలంటే యుక్తవయస్సు నుండే జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకోవటం మంచిది. సుదీర్ఘమైన, సంతోషకరమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలనుకుంటే అందుకు అనుకూలంగా అలవాట్లలో మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. జీవనశైలిలో మార్పు దీర్ఘాయువు పొందటానికి మార్గదర్శంగా ఉంటుందని అనేక పరిశోధనల్లో తేలింది.

మనుషుల్లో దీర్ఘాయువు నిర్వహణలో నిద్ర, లిపిడ్ జీవక్రియ నియంత్రణ ప్రధాన పాత్ర పోషిస్తాయని పరిశోధనల్లో స్పష్టమైంది. లిపిడ్ ప్రొఫైల్ పరీక్ష ద్వారా రక్తంలోని కొలెస్ట్రాల్ , ట్రైగ్లిజరైడ్స్ మొత్తాన్ని తెలుసుకోవచ్చు. రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ అధిక స్థాయిలో ఉండటం వలన గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. అంతేకాకుండా మంచి నిద్రకూడా ఎక్కువ కాలం జీవించటానికి దోహదం చేస్తుంది. మెరుగైన నిద్ర ఎంతో మేలు చేస్తుంది. నిద్రకు ఇబ్బంది కలిగించే నికోటిన్, కెఫిన్, అల్కాహాల్ వంటి వాటికి దూరంగా ఉండాలి. నిద్ర సమయానికి ముందు లైట్ మీల్ తీసుకోవాలి.

నిద్రకు అవసరమైన ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలి. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ను నిద్రసమయంలో ఉపయోగించరాదు. చల్లని, చీకటి,నిశ్శబ్ద ప్రదేశాలు ప్రశాంతంగా నిద్రపోయేందుకు సహాయపడతాయి. బెడ్‌రూమ్ నుండి అన్ని డిజిటల్ స్క్రీన్‌లను అందుబాటులో లేకుండా చూసుకోవాలి. పగటి పూట నిద్రించాలనుకుంటే కేవలం అరగంట సమయం మాత్రమే కేటాయించాలి. రోజంతా నిద్రించటం ఏమాత్రం సరైంది కాదు. పగలు అధిక సమయం నిద్రపోతే రాత్రిళ్లు నిద్రపట్టదు.

పగటిపూట శారీరకంగా చురుకుగా ఉండేందుకు రోజువారిగా వ్యాయామాలు చేయటం మంచిది. దీని వల్ల శరీరం కొంత అలసటకు లోనై రాత్రి సమయం నిద్రబాగా పడుతుంది. తద్వరా పగలంతా శరీరం చురుకుగా ఉంటుంది. ఆందోళన, ఒత్తిడి పోగొట్టుకునేందుకు ధ్యానం , శ్వాస వ్యాయామాలు ప్రయత్నించండి. దీని వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఈ చిన్నచిన్న మార్పులు చేసుకుంటే జీవితం ఎక్కువకాలం కొనసాగించేందుకు అవకాశం ఉంటుంది.