Back Pain : నడుంనొప్పి బాధించటానికి కారణాలు తెలుసా?

టీబీ, క్యాన్సర్ వంటి వ్యాధుల కూడా వెన్నుపూస అరిగిపోవడానికి దారి తీస్తాయి. దీనివల్ల నడుము నొప్పి వస్తుంది. రకరకాల పనులు చేస్తున్నప్పుడు సరిగా కూర్చోలేని పరిస్థితి తలెత్తుతుంది.

Back Pain : నడుంనొప్పి బాధించటానికి కారణాలు తెలుసా?

Back Ach

Back Pain : జీవితం లో ఏదో ఒక సందర్భంలో ఎదురయ్యే సమస్యల్లో నడుము నొప్పి కూడా ఒకటి. చాలా మందిని ఇది ఎంతగానో బాధిస్తుంది. నొప్పిని భరించలేని వారు పెయిన్ కిల్లర్లపై అధారపడుతుంటారు. మరికొంత మంది సమస్యను నిర్లక్ష్యం చేస్తుంటారు. అసలు నడుము నొప్పికి ఎన్నో కారణాలు ఉన్నాయి. దీనికి కారణం జీవన శైలి విధానమే. ఒక ప్పుడు వయస్సు మళ్లిన వారిలోనే కనిపించే నడుమునొప్పి, ప్రస్తుతం యుక్తవయస్సు వారిలో అధికంగా ఉంది.

శరీరంలో కీలకమైన భాగం ముప్పైమూడు వెన్నుపూసలతో తయారైన వెన్నుముక. ఇది మనం వంగినా లేచినా వెన్నుపూసల మధ్యలో ఉండే డిస్క్‌లే సహాయపడతాయి. నడుము ప్రాంతంలో ఉండే డిస్క్‌లు అరిగి పోవడం వల్ల, లేదా డిస్క్‌లు ప్రక్కకు తొలగడం వల్ల, నడుము నొప్పి సమస్య ఉత్పన్నమవుతుంది. నడుము నొప్పి రావటానికి ప్రధాన కారణం వెన్నుపూసల మధ్యన ఉన్న కార్టిలేజ్‌ లో వచ్చేమార్పు. కార్టిలేజ్‌ క్షీణించి, ఆస్టియోఫైట్స్‌ ఏర్పడటం వల్లనొప్పి వస్తుంది. నడుము నొప్పికి ముఖ్య కారణం వెన్నెముక చివరి భాగం అరిగిపోవడమే.

టీబీ, క్యాన్సర్ వంటి వ్యాధుల కూడా వెన్నుపూస అరిగిపోవడానికి దారి తీస్తాయి. దీనివల్ల నడుము నొప్పి వస్తుంది. రకరకాల పనులు చేస్తున్నప్పుడు సరిగా కూర్చోలేని పరిస్థితి తలెత్తుతుంది. స్త్రీలు వంట పనులు చేస్తున్న సందర్భంలో వస్తువులకోసం వంగి లేస్తున్నప్పుడు నడుంనొప్పి వస్తుంది. స్పాంజి లేదా దూది ఎక్కువగా ఉపయోగించిన కుర్చీలలో వివిధరకాల భంగిమల్లో కూర్చోవడం వల్ల కూడా నడుంనొప్పి రావొచ్చు. నిద్రించేందుకు పడక సరిగా కుదరనప్పుడు, ఎగుడు దిగుడు చెప్పులు వాడినప్పుడు తదితర కారణాల వల్ల నడుము నొప్పి సమస్య తలెత్తుతుంది.

కంప్యూటర్స్‌ ముందు ఎక్కువ సేపు కదలకుండా కూర్చోవటం వల్ల నొప్పి వస్తుంది. తీసుకునే అహారంలో కాల్షియం, విటమిన్లు లోపించటం, ప్రమాదాలలో వెన్ను పూసలు దెబ్బ తినటం, ప్రక్కకు తొలగటం వల్ల నడుము నొప్పివస్తుంది. నడుము నొప్పి తీవ్రంగా ఉండి వంగటం, లేవటం, కూర్చోవటం, కష్టంగా మారుతుంది, కదలికల వలన నొప్పి తీవ్రత పెరుగుతుంది. నాడులు ఒత్తిడికి గురికావడం వలన, నొప్పి ఎడమకాలు లేదా కుడికాలుకు వ్యాపించి బాధిస్తుంది. హఠాత్తుగా నడుము వంచినా బరువులు ఎత్తినా నొప్పితీవ్రత భరించ రాకుండా ఉంటుం