beans : చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి లాభాలెన్నో!..

చిక్కుడు కాయలు తినడం వల్ల ఆకలి బాగా తగ్గుతుందట. ఫలితంగా బరువు తగ్గాలనుకునేవారికి చిక్కుడుకాయలు మంచి ఔషదంలా పని చేస్తాయి. ఈ కాయల్లోని విటమిన్ బి1 మెదడు పనితీరులో అత్యంత కీలకమైన ఎసిట

beans : చిక్కుడు కాయలు తింటే ఆరోగ్యానికి లాభాలెన్నో!..

Beans

beans : కూరగాయ పంటలో  చిక్కుడుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. చిక్కుడు కాయ కూరను చాలా మంది ఇష్టంగా తింటారు.  చిక్కుడుకాయలను తినటం వల్ల మన శరీరానికి ఎన్నో రకాల పోషకాలు లభిస్తాయి. శీతాకాలంలో ఎక్కువగా చిక్కుడు కాయల పంట వస్తుంది. ఈ కాలంలో చిక్కుడు కాయను కూరగా చేసుకుని తింటే ఆరోగ్యపరంగా వచ్చే సమస్యలను తగ్గించుకోవచ్చని నిపుణులు చెప్తుంటారు. కణుపు చిక్కుడుకాయ రుచిలోనే కాదు మన శరీరానికి పోషకాలను అందించడంలో కూడా ప్రముఖ పాత్ర వహిస్తుంది. దీనిలో ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్ వంటి ఖనిజాలు ఉంటాయి. వీటితో పాటు విటమిన్ సి కూడా ఉంటుంది. ముఖ్యంగా వీటిల్లోని యాంటీఆక్సిడెంట్లు హృద్రోగాలు, క్యాన్సర్లు వంటి వాటిని దూరం చేస్తాయి. చిక్కుడు కాయల్ని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు, డయేరియా వంటివి తగ్గడంతో పాటు మధుమేహం, కొలస్ట్రాల్ వంటివి తగ్గుముఖం పడతాయి.

చిక్కుడు కాయలు తినడం వల్ల ఆకలి బాగా తగ్గుతుందట. ఫలితంగా బరువు తగ్గాలనుకునేవారికి చిక్కుడుకాయలు మంచి ఔషదంలా పని చేస్తాయి. ఈ కాయల్లోని విటమిన్ బి1 మెదడు పనితీరులో అత్యంత కీలకమైన ఎసిటైల్ కోలీన్ అనే న్యూరో ట్రాన్స్ మిటర్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. విటమిన్ బి1 గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. చిక్కుళ్ళలో ఉండే కాపర్ మెదడు ఆరోగ్యానికి కావాల్సిన డోపమైన్, గ్యాలాక్టోజ్…. వంటి రసాయనాల విడుదలకు దోహదం చేస్తాయి. వీటితోపాటు వివిధ రకాల యాంటీఆక్సిడెంట్ల ఉత్పత్తికి కారణమవుతాయి. వృద్దాప్యం వల్ల వచ్చే అనేక వ్యాధుల్నీ నివారిస్తాయని పలు పరిశోధనల్లో తేలింది.

చిక్కుడు కాయలో సెలీనియం, మాంగనీస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఊపిరితిత్తుల సమస్యలను నిరోధించడంలో సహాయపడతాయి. అందుకే దీర్ఘకాలిక శ్వాసకోస సమస్యలతో బాధపడేవారికి చిక్కుడు మంచి ఔషదంలా పని చేస్తుంది. నిద్రలేమితో బాధపడేవాళ్లకీ చిక్కుడుకాయల్లో లభించే మాంగనీస్ ఆ సమస్యను తగ్గిస్తుంది. అంతేకాకుండా చిక్కుడు కాయల్లోని అమైనో ఆమ్లాలు హార్మోన్ల సమతౌల్యానికి ఎంతగానో దోహదపడతాయి. ముఖ్యంగా మానసిక ఆందోళనను తగ్గిస్తాయి. ఇందులో లబించే పొటాషియం కండరాల పటుత్వానికి తోడ్పడుతుంది.

చిక్కుడుకాయలో సోలుబుల్ ఫైబర్ ఎక్కువ గా ఉంటుంది. కాబట్టి ఇది ఇటు బ్లడ్ షుగర్ లెవల్స్ ని, అటు కొలెస్టరాల్ లెవల్స్ ని కంట్రోల్ లో పెట్టగలదు. ఇది గుండె ఆరోగ్యాగానికి చాలా మంచిది.నిద్రలేమితో బాధపడేవాళ్లకీ చిక్కుడుకాయల్లో లభించే మాంగనీస్ ఆ సమస్యను బాగా తగ్గిస్తుంది. నెలసరి సమయంలో స్త్రీలు రక్తాన్ని కోల్పోతుంటారు. అలాగే వారి ఎముకలు కూడా బలహీనంగా మారతాయి. ముఖ్యంగా గర్భిణి స్త్రీలకు రక్తం, ఎముకలలో బలం చాలా అవసరం. ఈ అవసరాన్ని కాల్షియం, ఐరన్ ఉన్న చిక్కుడు బాగా తీరుస్తుంది. అంతేకాకుండా చిక్కుడు కాయల్లోని అమైనో ఆమ్లాలు హార్మోన్ల సమతౌల్యానికి ఎంతగానో దోహదపడతాయి. ముఖ్యంగా మానసిక ఆందోళనను కూడా తగ్గిస్తాయి.