Green Fungus : గ్రీన్ ఫంగస్ ఏంటి?.. ఎలా సోకుతుంది.. లక్షణాలు, నివారణ ఎలానంటే?

ప్రపంచమంతా కరోనావైరస్ వణికిస్తోంది. ఒకవైపు కరోనా.. మరోవైపు బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, గ్రీన్ ఫంగస్ అంటూ కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. బ్లాక్ ఫంగస్ వ్యాధితో పాటు గ్రీన్ ఫంగస్ కూడా బెంబేలిత్తిస్తోంది.

Green Fungus : గ్రీన్ ఫంగస్ ఏంటి?.. ఎలా సోకుతుంది.. లక్షణాలు, నివారణ ఎలానంటే?

What Is Green Fungus Causes, Symptoms, And Prevention

Green Fungus : ప్రపంచమంతా కరోనావైరస్ వణికిస్తోంది. ఒకవైపు కరోనా.. మరోవైపు బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, గ్రీన్ ఫంగస్ అంటూ కొత్త వ్యాధులు పుట్టుకొస్తున్నాయి. బ్లాక్ ఫంగస్ వ్యాధితో పాటు గ్రీన్ ఫంగస్ కూడా బెంబేలిత్తిస్తోంది. ముఖ్యంగా ఈ ఫంగస్ వ్యాధి బారిన పడినవారిలో సైనస్, లంగ్స్, బ్లడ్ లో ఎక్కువగా సోకుతోంది. కరోనా నుంచి కోలుకున్న వారిని ఫంగస్ వ్యాధులు వెంటాడుతున్నాయి. గ్రీన్ ఫంగస్ (Aspergillus infection) అనే ఫంగల్ ఇన్ఫెక్షన్ కారణంగా వ్యాపిస్తుంది. ఇప్పటికే బ్లాక్ ఫంగస్ (Mucormycosis) వంటి కేసులు కరోనా బాధితుల్లో ఎక్కువగా నమోదయ్యాయి. ఇంతకీ గ్రీన్ ఫంగస్ అంటే ఏంటి? అదేలా వ్యాపిస్తుంది? దాని లక్షణాలు ఎలా ఉంటాయి? నివారించడం ఎలా అనేదానిపై వివరాలను పరిశీలిద్దాం..

గ్రీన్ ఫంగస్ అంటే..
గ్రీన్ ఫంగస్.. (Aspergillus fungus) అంటారు. ల్యాబరేటరీల్లో ఎక్కువగా పచ్చ రంగులో కనిపిస్తుంది. Aspergillus అనే ఫంగస్ కారణంగా ఈ వ్యాధి సోకుతుంది. ఇండోర్, ఔట్ డోర్ లలో ఈ వ్యాధి తరచుగా వ్యాపిస్తుందని హిందుజా ఆస్పత్రి వైద్యులు అర్పిత్ శర్మ తెలిపారు. ఇటీవలే ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా కూడా Mucormycosis ఆధారంగా దాని పేరు గుర్తించాలని చెప్పారు. రంగు విషయంలో గందరగోళానికి గురికావద్దని సూచించారు.

ఒకే రకమైన ఫంగస్.. వేర్వేరు రంగుల్లో ఉంటుందని అన్నారు. Mucormycosis అనే ఫంగస్ కరోనా మాదిరిగా అంటువ్యాధి కాదన్నారు. 90 నుంచి 95 శాతం పేషెంట్లలో Mucormycosis ఇన్ఫెక్షన్ సోకుతోంది. డయాబెటిక్, స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడినవారిలో ఈ సమస్య అధికంగా ఉంటుందని అన్నారు. అలాగే డయాబెటిక్, స్టీరాయిడ్స్ తీసుకున్నవారిలో ఈ ఫంగస్ సమస్య అధికంగా ఉంటుందని తెలిపారు.

బ్లాక్ ఫంగస్‌కు వేరుగా ఉంటుందా? :
ల్యాబరేటరీల్లో (కల్చర్ మీడియ్స్) ఎక్కువగా గ్రీన్ కాలనీలు కనిపిస్తుంటాయి. వాటినే గ్రీన్ ఫంగస్ అంటారని శర్మ తెలిపారు. ఫంగస్ లు ఎక్కువగా వేర్వేరు రంగుల్లో కనిపిస్తుంటాయి. అందులో బ్లాక్, ఎల్లో, గ్రీన్, వైట్ ఫంగస్ పేర్లతో పిలుస్తుంటారు. కానీ, ఇవన్నీ Mucormycosis, Cinderella, Aspergillus మాదిరి ఫంగస్ జాతికి చెందినవే ఉన్నాయి.

గ్రీన్ ఫంగస్ ప్రాణాంతకమా? :
బ్లాక్ ఫంగస్ మాదిరిగానే గ్రీన్ ఫంగస్ కూడా ప్రాణాంతకమే. ముక్కు, సైనస్, కళ్లు, మెదడు, ఊపిరితిత్తుల్లో ఈ ఇన్ఫెక్షన్లు సోకుతుంటాయి.

లక్షణాలు.. కారణాలేంటి? :
రోగనిరోధక వ్యవస్థ తక్కువగా ఉన్నవారిలో ఈ గ్రీన్ ఫంగస్ సోకుతుంది. వాతావరణంలోని గాల్లో ఫంగల్ బీజాంశాలు ఉంటాయి.. వీటిని పీల్చడం ద్వారా కూడా వ్యాధి సోకుతుంది. ఎక్కువగా ఈ వ్యాధి సైనస్ లోకి చేరుతుంది. తద్వారా ముక్కు దిబ్బడ, తలనొప్పి, నాసికా స్రవం, కళ్ల వాపు, చూపు కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ఎవరికి ప్రాణాంతకం? :
డయాబెటిస్, క్యాన్సర్, కెమోథెరపీ బాధితుల్లో ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉంది. అలాగే రోగనిరోధక వ్యవస్థ తక్కువగా ఉన్నవారిలోనూ వ్యాధి సోకుతుంది. కరోనా నుంచి కోలుకున్నవారిలోనూ ఈ గ్రీన్ ఫంగస్ సోకే ప్రమాదం ఉంది.

చికిత్స ఏమైనా ఉందా? :
సాధారణంగా.. ఎండోస్కోపీ సర్జరీ లేదా ఓపెన్ సర్జరీ ద్వారా యాంటీ ఫంగల్ మందుల(amphotericin B)తో కొన్నివారాల పాటు చికిత్స తీసుకోవచ్చు.

రికవరీ రేటు ఎలా ఉందంటే?:
అనేక కారకాలతో ముడిపడి ఉంది. వ్యాధి సోకిన ఆరంభంలో చికిత్స తీసుకుంటే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. సరైన సమయంలో యాంటీ ఫంగల్ మందులు వాడాల్సి ఉంటుంది. అలాగే బ్లడ్ షుగర్ లెవల్స్ కూడా అదుపులో ఉంచుకోవాలి. అప్పుడే తొందరగా రికవరీ అయ్యేందుకు వీలుంది. దాదాపు 60 నుంచి 70 శాతం బాధితులు పూర్తిగా గ్రీన్ ఫంగస్ నుంచి కోలుకున్నారు.

నివారణ ఎలానంటే? :
వాతావరణంలో పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే ముఖానికి N-95 మాస్క్ తప్పనిసరిగా ఉంచుకోవాలి. ప్రత్యేకించి దుమ్ము దూళి ఉండే ప్రదేశాల్లో జాగ్రత్తగా ఉండాలి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు దుమ్ము,దూళికి దూరంగా ఉండాలి. డయాబెటిక్ బాధితులు ఎప్పటికప్పుడూ తమ షుగర్ లెవల్స్ చెక్ చేసుకుంటుండాలి. ఇదివరకే కొవిడ్ వల్ల స్టెరాయిడ్స్ వాడి ఉంటే తప్పనిసరిగా షుగర్ లెవల్స్ చెక్ చేసుకోవడం తప్పనిసరి.