Protein Deficiency : ప్రొటీన్ లోపం నివారించాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి!

ప్రొటీన్ ఫుడ్ తీసుకోవటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం వల్ల మీకు ఎలాంటి ఇన్ఫెక్షన్లు సోకే అవకాశమే ఉండదు. అయితే రోజూ మనం ఎంత ప్రోటీన్ ను తీసుకోవాలన్న విషయం ఏజ్, జెండర్, బరువు, ఆరోగ్య పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది.

Protein Deficiency : ప్రొటీన్ లోపం నివారించాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి!

Protein Deficiency

Protein Deficiency : శరీరం సక్రమంగా పనిచేయడానికి ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు చాలా అవసరం. ముఖ్యంగా ప్రోటీన్లు మన శరీరానికి ఎన్నో విధాలా సహాయపడతాయి. ఇది మన శరీర ఎదుగుదలకు సహాయడుతుంది. అలాగే కణాలను పునరుత్పత్తి చేస్తుంది. ఎముకలను, కండరాలను బలంగా ఉంచడానికి సహాయపడతుంది. శరీరాన్ని సక్రమంగా పనిచేసేందుకు ప్రోత్సహిస్తుంది. అంటే హార్మోన్ల విధులు సక్రమంగా జరగడానికి తోడ్పడతాయి.

శరీరంలో ప్రోటీన్ లోపం ఏర్పడితే పిల్లల శరీరక ఎదుగుదలే కాదు.. మానసిక ఎదుగుదల కూడా సరిగ్గా ఉండదు. ముఖ్యంగా దీనివల్ల పిల్లల్లో ఇమ్యూనిటీ వ్యవస్థ చాలా బలహీనంగా ఉంటుంది. దీంతో వీరికి ఎన్నో రకాల అంటువ్యాధులు, ఇతర వ్యాధులు చుట్టుకుంటాయి. ప్రోటీన్ లోపం వల్ల బరువు తగ్గటం, ఎముకలు చాలా బలహీనంగా మారటం వంటి సమస్యలు వస్తాయి. అంతేకాదు చర్మం, గోళ్లు, జుట్టుకు సంబంధించిన ఎన్నో సమస్యలు వస్తాయి. అందుకే పిల్లలైనా, పెద్దలైనా పోషకాహారం తప్పకుండా తీసుకోవాలి. రోజూ తినే ఆహారంలో ప్రోటీన్లు, విటమిన్లు, మంచి కొవ్వు, మినరల్స్, కార్భోహైడ్రేట్లు పుష్కలంగా ఉండేట్టు చూసుకోవాలి.

ప్రొటీన్ ఫుడ్ తీసుకోవటం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం వల్ల మీకు ఎలాంటి ఇన్ఫెక్షన్లు సోకే అవకాశమే ఉండదు. అయితే రోజూ మనం ఎంత ప్రోటీన్ ను తీసుకోవాలన్న విషయం ఏజ్, జెండర్, బరువు, ఆరోగ్య పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. శరీరానికి కావాల్సిన ప్రొటీన్ కోసం పాలు, పెరుగు, జున్ను, చీజ్, గుడ్లు, సీ ఫుడ్, మాంసం, మటన్, చికెన్, బాతు మాంసం, గింజలు, టోపు, చిక్కుళ్లు, ఆకుపచ్చ కూరగాయలు, బీన్స్ , బచ్చలి కూర, సోయా, బాదం, వాల్ నట్స్, పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి గింజలు వంటి వాటిని తీసుకోవాలి. వాటిలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది.

ప్రొటీన్ కోసం తీసుకోవాల్సిన ముఖ్యమైన ఆహారాలు ;

1. పుట్టగొడుగులు ; ప్రోటీన్‌ లోపం ఉన్నవారికి పుట్టగొడుగులు ఉత్తమ ఆహారం. ముఖ్యంగా వేసవిలో వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి చలువు అందుతుంది. అదేవిధంగా పుట్టగొడుగుల్లో పెద్ద మొత్తంలో ప్రొటీన్‌ ఉంటుంది.

2. బఠానీలు ; బంగాళదుంపల మాదిరిగా బఠానీల్లో కూడా ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కూడా పుష్కలంగా ఉంటాయి. అల్జీమర్స్, డయాబెటిస్, క్యాన్సర్ వంటి వ్యాధులను దూరంగా ఇవి బాగా దోహదపడతాయి.

3. సోయాబీన్ ; గ్రీన్‌ సోయాబీన్లో ప్రొటీన్లు విరివిగా ఉంటాయి. అందుకే ప్రొటీన్ల లోపం ఉన్నవారు సోయాబీన్‌ను క్రమం తప్పకుండా తీసుకోవాలంటున్నారు పోషకాహార నిపుణులు. వీటితో పాటు సోయాబీన్ మిల్క్, టోఫు, సోయా సాస్, సోయాబీన్ పేస్ట్‌లో కూడా ఆరోగ్య పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.

4. బంగాళదుంప ; ప్రొటీన్లు పుష్కలంగా ఉండే కూరగాయల్లో బంగాళాదుంప కూడా ఒకటి. అందుకే వీటిని క్రమం తప్పకుండా ఆహారంలో చేర్చుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా బంగాళదుంప కూర, ఉడకబెట్టిన బంగాళదుంపలు తింటే శరీరానికి ప్రొటీన్లు సమృద్ధిగా శరీరానికి అందుతాయి.

5. క్యాబేజీ ; క్యాబేజీని గోబీ అని కూడా అంటారు. చాలామంది దీనిని సలాడ్‌గా తీసుకుంటారు. ఇందులో ప్రొటీన్లతో పాటు పలు పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. 100 గ్రాముల గోబీలో దాదాపు 1 నుంచి 2 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. దీనిని తరచూ తినడం వల్ల ప్రొటీన్‌ లోపం సమస్యలను అధిగమించవచ్చు. అదేవిధంగా జీర్ణక్రియ, గుండెకు సంబంధించిన సమస్యలు కూడా తగ్గిపోతాయి.

6. పాలకూర ; పాలకూరలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ప్రొటీన్ సమృద్ధిగా ఉంటుంది. ముఖ్యంగా ఆకు కూరలలో బచ్చలి కూర ఉత్తమమైనది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

7. బ్రోకలీ ; బ్రోకలీలో కూడా ప్రొటీన్లు విరివిగా ఉంటాయి. అందుకే దీన్ని క్రమం తప్పకుండా ఆహారంలో చేర్చుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వంటల్లోనే కాకుండా బ్రోకలీని సలాడ్ రూపంలో కూడా తినవచ్చు.