Antibodies : వ్యాక్సిన్ తరువాత వ్యాయామంతో….మెరుగైన రోగనిరోధక కణాలు

వ్యాక్సిన్స్ తీసుకున్నవారిలో కొంత మంది గంటన్నర పాటు పరిగెత్తటం, నడవటం, సైకిల్ తొక్కటం, వంటి తేలికపాటి వ్యాయామాలు చేశారు.

Antibodies : వ్యాక్సిన్ తరువాత వ్యాయామంతో….మెరుగైన రోగనిరోధక కణాలు

Antibodies

Antibodies : ప్రపంచం మొత్తాన్ని ఉక్కిరి బిక్కిరి చేసిన కోవిడ్ మహమ్మారి ప్రజలు కోలుకోలేని దెబ్బతీసింది. వ్యాక్సిన్ రాకతో కొంతమేర ప్రజలంతా ఊపిరి పీల్చుకోగలిగారు. చాలా మందిలో తాము తీసుకున్న వ్యాక్సిన్ వల్ల ప్రయోజనం ఉంటుందా…ఉండదా…అనే విషయంపై అనేక అనుమానాలను వ్యక్తం చేశారు. ఈ అనుమానాలను నివృత్తి చేసుకునేందుకే వివిధ దేశాల్లోని శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నార. అయితే అమెరికాలోని లోవా స్టేట్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు మాత్రం అసలు వ్యాక్సిన్ తీసుకున్న తరువాత వ్యాధి నిరోధక కణాలు ఉత్పత్తి ఏమేరకు ఉంటుందన్న దానిపైనా పరిశోధన సాగించారు.

శాస్త్రవేత్తల పరిశోధనల్లో అనేక ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. వ్యాక్సిన్ తీసుకున్న తరువాత గంటన్నర పాటు తేలికపాటి వ్యాయామాలు చేస్తే , తక్కువ రోజుల్లోనే రోగనిరోధక కణాలు శరీరంలో ఏర్పడినట్లు కనుగొన్నారు. దీనికి సంబంధించిన పరిశోధన వివరాలు బ్రెయిన్, బిహేవియర్, ఇమ్యూనిటీ పత్రికలో ప్రచురితమయ్యాయి. ఆ కధనం ప్రకారం శాస్త్రవేత్తలు ఇందుకోసం కొంతమంది వాలంటీర్లకు కొవిడ్ సీజనల్ ఫ్లూ వ్యాక్సిన్స్ ఇచ్చారు.

వ్యాక్సిన్స్ తీసుకున్నవారిలో కొంత మంది గంటన్నర పాటు పరిగెత్తటం, నడవటం, సైకిల్ తొక్కటం, వంటి తేలికపాటి వ్యాయామాలు చేశారు. మిగిలిన వారు మాత్రం 45 నిమిషాలపాటు వ్యాయమాలు చేశారు. మరికొందరు వ్యాక్సిన్ తీసుకున్న తరువాత ఎలాంటి వ్యాయామాలు చేయలేదు. కొన్ని వారాల అనంతరం వీరిలో వ్యాధి నిరోధక కణాలు ఏస్ధాయిలో ఏర్పడ్డాయో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు కొన్ని పరీక్షలు చేశారు. అయితే ఈ పరిక్షల్లో పలు కీలకమైన విషయాలను కనుగొన గలిగారు.

వ్యాక్సిన్ తీసుకున్న తరువాత గంటన్నరపాటు వ్యాయామం చేసిన వారి శరీరంలో యాంటీ బాడీలు ఎక్కవగా ఉన్నట్లు గుర్తించారు. అదే సమయంలో ఎలాంటి వ్యాయామాలు చేయటని వారిలో అతి తక్కువగా, 45 నిమిషాలు వ్యాయామం చేసిన వారిలో గంటన్నరపాటు వ్యాయామం చేసిన వారి కంటే తక్కువగా యాంటీ బాడీలు ఉన్నట్లు గుర్తించారు. వ్యాక్సిన్ అనంతరం గంటకు పైగా వ్యాయామం చేయటం వల్ల ఉత్పత్తి అయ్యే ఒక రకమైన ప్రొటీన్ యాంటీబాడీ, టి కణాలు ఉత్పత్తి అయ్యేందుకు తోడ్పడుతున్నట్లు శాస్త్రవేత్తల్లో ఒకరైన కొహట్ చెబుతున్నారు. ఇలా ఎందుకు జరుగుతున్నదన్న విషయంపై ప్రస్తుతం శాస్త్రవేత్తలు మరింత లోతైన అధ్యయనం మొదలు పెట్టారు.