Telangana : ప్లాస్టిక్ బాటిల్స్‌తో బస్టాండ్ నిర్మాణం .. సెల్ఫీలతో గ్రామస్తుల సందడి

ఓ గ్రామ పంచాయితీ మహిళా సర్పంచ్, మహిళా ఎంపీడీవో వినూత్న ఆలోచనకు ప్రతిరూపంగా అందంగా రూపుదిద్దుకుంది ప్లాస్టిక్ బాటిల్స్ బస్టాండ్..ప్లాస్టిక్ కు కొత్తరూపాన్నిచ్చిన ఇద్దరు మహిళలపై అభినందనలు కురిపిస్తున్నారు గ్రామస్తులు.

Telangana : ప్లాస్టిక్ బాటిల్స్‌తో బస్టాండ్ నిర్మాణం .. సెల్ఫీలతో గ్రామస్తుల సందడి

plastic bottles Bus Stand

plastic bottles Bus Stand : ప్లాస్టిక్…ప్లాస్టిక్…ప్లాస్టిక్.. ఎక్కడ చూసినా ప్లాస్టిక్కే. పర్యావరణానికి ముప్పు ప్లాస్టిక్ నియంత్రించాలని నిపుణులు ఎంతగా చెప్పినా అడ్డుకట్టపడటంలేదు. కానీ ఉపాయం ఉంటే ప్లాస్టిక్ తో అందమైన ఆకట్టుకునే నిర్మాణం చేయొచ్చని నిరూపించి చూపించారు ఓ గ్రామ పంచాయితీ మహిళా సర్పంచ్, మహిళా ఎంపీడీవో. గ్రామంలో ప్లాస్టిక్ బాటిల్స్ తో ఓ బస్టాండ్ నిర్మించేశారు. అవే ప్లాస్టిక్ బాటిల్స్ లో డెకరేషన్ కూడా చేశారు. దీంతో వీరి ఐడియా సూపర్ గా ఉందంటున్నారు ఆ గ్రామస్తులు. ఈ ప్లాస్టిక్ బాటిల్ బస్టాండ్ లో జనాలు సెల్ఫీలు దిగుతు సందడి చేస్తున్నారు. ఇదంతా ఎక్కడా అనుకుంటున్నారా? మన తెలంగాణలోనే..

 

హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని ఉప్పలపల్లి గ్రామపంచాయతీలో మంగళవారం (జూన్ 6,2023)ప్లాస్టిక్ హబ్ పేరుతో ప్లాస్టిక్ బాటిల్స్ తో నిర్మించిన ఓ కొత్త బస్టాండ్ ప్రారంభించారు. గ్రామపంచాయతీ పరిధిలో సేకరించిన ప్లాస్టిక్ వ్యర్ధాలను పంచాయతీ సిబ్బంది సెగ్రిగేషన్ షెడ్ కు తరలించి ఉంచుతున్నారు. వీటిలో వచ్చిన ప్లాస్టిక్ బాటిళ్లను ఒక మూలన పడవేసి ఉంచారు. ఆ బాటిల్స్ ను గమనించిన ఎంపీడీవో పల్లవి సర్పంచ్ ఉమకు ఓ ఐడియా చెప్పారు. ప్లాస్టిక్ బాటిల్లతో ఒక షెడ్ వేస్తే ఎలా ఉంటది అని సలహా ఇచ్చారు.

 

దీనితో సర్పంచ్ సిబ్బంది సహాయంతో ఊర్లో సేకరించిన కాళీ ప్లాస్టిక్ బాటిళ్లను నాలుగైదు రోజుల్లోనే వినూత్నంగా ప్రయాణికుల కోసం ప్లాస్టిక్ హబ్ పేరిట బస్టాండ్ నిర్మించేశారు. బస్టాండ్ చుట్టుపక్కల ప్లాస్టిక్ బాటిల్లలో గడ్డి పూల మొక్కలను బాటిల్లతో అందంగా డెకరేట్ కూడా చేశారు. అదే బస్టాండ్ లో కూర్చోటానికి ఉపయోగం లేకుండా పారేసిన టైర్లను తెచ్చి వాటికి రంగులు వేసి కూర్చోవటానికి ఏర్పాటు చేశారు.

 

ప్లాస్టిక్ బాటిల్స్ తో అందంగా నిర్మించిన బస్టాండ్ ను ప్రయాణికులు, స్థానికులు సెల్ఫీలు దిగుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇలా ప్లాస్టిక్ ను వాడి పారేయకుండా ఏదో రకంగా డెకరేషన్ ఐటెమ్ గా వినియోగించుకుంటే అందానికి అందం..పర్యావరణానికి హాని కలిగించే ప్రమాదాన్ని తప్పించినట్లు అవుతుంది.