1997 Movie : రివ్యూ..

డా.మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, సంగీత దర్శకుడు కోటి ప్రధాన పాత్రల్లో నటించిన 1997 మూవీ రివ్యూ..

1997 Movie : రివ్యూ..

1997 Movie: డా.మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, సంగీత దర్శకుడు కోటి ప్రధాన పాత్రల్లో, డా.మోహన్ స్వీయ దర్శకత్వంలో ఈశ్వర పార్వతి మూవీస్ బ్యానర్‌పై తెరకెక్కిన బిన్నమైన కథా చిత్రం ‘1997’. రియల్ ఇన్సిడెంట్స్‌ ఆధారంగా రూపొందిన డిఫరెంట్ మూవీ ఇది. ఈరోజు ప్రేక్షకుల మందుకు వచ్చిన ‘1997’ ఎలా ఉందో చూద్దాం..

83 Movie : హార్ట్ బీట్ పెంచేసిన టీజర్..

కథ..
సొసైటీలో ఉన్న కులమతాల అసమానతల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ఇది. ఇప్పటికీ మన దేశంలో చాలా ప్రాంతాల్లో తక్కువ కులాలపై, ఆ కులాలలో ఉండే మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. నిజాం పేట గ్రామంలో ఓ దొర (రామరాజు) తను చేసేదే న్యాయం, చెప్పిందే చట్టం అన్నట్లు హంగామా చేస్తుంటాడు. పైగా అతను ఆ ఊరి ఎమ్ఎల్ఏ కూడా కావడంతో అతన్ని కాదని ఆ ఊరిలో ఎవరూ ఏమీ చేసే ధైర్యం చేయరు. పైగా అతనికి పోలిసుల సపోర్ట్ ఫుల్‌గా ఉంటుంది. ఈ నేపథ్యంలో గంగ అనే అమ్మాయి ఘోరంగా అత్యాచారానికి గురవ్వడంతో పాటు మరణిస్తుంది. ఆమె మరణాన్ని ఈత రాక నీళ్లలో మునిగి చనిపోయిందని చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు. అయితే అదే గ్రామానికి ఏఎస్‌ఐగా వచ్చిన విక్రమ్ రాథోడ్ ( డా. మోహన్ ) నిజా నిజాలు తెలుసుకుని అసలైన దోషులను శిక్షించే ప్రయత్నం చేస్తాడు. ఈ నేపథ్యంలో దొర (రామరాజు) కు సపోర్ట్ చేస్తూ ఆయన అన్యాయాలను కప్పిపుచ్చే సిఐ చారి (శ్రీకాంత్ అయ్యంగార్) కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తాడు. అయితే న్యాయం అన్నది తక్కువ కులం, ఎక్కువ కులం అని కాకుండా అందరికీ సమానంగా ఉండాలన్న లక్ష్యంతో రంగంలోకి దిగి గంగను మానభంగం చేసి చంపిన దోషులను టార్గెట్ చేస్తాడు విక్రమ్ రాథోడ్. మరి ఈ పరిస్థితుల్లో అతనికి ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి.. దొర అహంకారానికి, కామానికి బలైన గంగకు న్యాయం జరిగిందా, లేదా? అన్నది అసలు కథ.

Shyam Singha Roy : ఏదో ఏదో తెలియని లోకమా.. తహ తహ మైకమా..

నటీనటులు..
ఈ సినిమాలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది.. శ్రీకాంత్ అయ్యంగార్ గురించి. సి ఐ చారి లాంటి నెగిటివ్ క్యారెక్టర్‌లో అదరగొట్టాడు. అతని నటనే ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఆ పాత్రలో లీనమై నటించాడు. ఇక హీరో విక్రమ్ రాథోడ్ పాత్రలో డా. మోహన్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఏఎస్ఐగా అయన పరిధిలో చక్కగా నటించాడు. ముఖ్యంగా పోలీస్ అధికారిగా భిన్నమైన షేడ్స్ కలిగిన పాత్రలో ఆకట్టుకున్నాడు. ఇక ఎంక్వయిరీ అధికారిగా హీరో నవీన్ చంద్ర పాత్ర ఉన్నది కొద్దీ సేపే అయినప్పటికీ తన నటనతో ఆకట్టుకున్నాడు. పోలీస్ అధికారిగా న్యాయం పక్కన నిలబడాలని చేసే ప్రయత్నం బాగుంది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ కోటి డిజిపిగా బాగా చేసాడు. అలాగే దొర పాత్రలో రామరాజు నటన హైలెట్. అలాగే దొర కొడుకు రాంబాబు పాత్ర సినిమాకే ప్రధాన ఆకర్షణ అని చెప్పాలి. మిగతా పాత్రలన్నీ కూడా బాగానే ఉన్నాయి.

1997 Movie : డాక్టర్ మోహన్ లుక్ రిలీజ్ చేసిన ప్రకాష్ రాజ్..

టెక్నీకల్ టీం..
ఈ సినిమా విషయంలో టెక్నికల్ అంశాల్లో ముందుగా చెప్పుకోవలసింది మ్యూజిక్ డైరెక్టర్ కోటి గురించి. ఈ సినిమాకు కోటి ఇచ్చిన ఆర్ఆర్ ప్రధాన ఆకర్షణ. కథను డ్రైవ్ చేయడంలో కోటి ఆర్ఆర్ చక్కగా కుదిరింది. అలాగే ఈ సినిమాకు మరో హైలెట్ ఫోటోగ్రఫీ. చిట్టిబాబు విజువల్స్ సినిమాకు మరింత అందాన్ని తీసుకొచ్చాయి. సీనియర్ ఎడిటర్ నందమూరి హరి ఎడిటింగ్ బాగుంది. చాలా సీన్స్ అలా అలా పాస్ అయిపోతూ ఉంటాయి. ఇక దర్శకుడు, హీరో మోహన్ గురించి చెప్పాలంటే ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న బర్నింగ్ ఇష్యూని తీసుకుని దర్శకుడు మోహన్ చక్కటి ప్రయత్నం చేసాడు. నేటి సమాజంలో ఉన్న కులమతాల అసమానతలు, మహిళలపై జరుగుతున్న దారుణాల నేపథ్యంలో ఈ కథను ఎంచుకున్నాడు దర్శకుడు. ఆలోచింప చేసే కథ, కథనంతో చక్కటి ప్రయత్నం చేసాడు. నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టు బాగున్నాయి.

Akhanda : బాలయ్య ఫంక్షన్‌కి బన్నీ గెస్ట్!

ఎలా ఉందంటే..
ఒక దొర అహంకారానికి బలైన ఓ అమాయకురాలి కథ ఇది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కింది. సమాజంలో అసమానతలకి అద్దం పట్టేలా తెరకెక్కించే ప్రయత్నం చేసాడు దర్శకుడు. నేటి సమాజంలో జరుగుతున్న సమస్యల నేపథ్యంలో ఎన్ని చిత్రాలు వచ్చినా కూడా ప్రజలు మారతారని చేసే ప్రయత్నాలే. నిజంగా అలాంటి సినిమాలు చూసి జనాలు మారతారా? అన్నది ఇప్పటికీ ప్రశ్నగానే మిగిలింది. మొత్తానికి డా. మోహన్ ఓ సమస్యను అందరికీ తెలియజెప్పే గొప్ప ప్రయత్నం చేసాడని చెప్పొచ్చు.

Shekar Movie : ‘శేఖర్’ తో హ్యాట్రిక్ కొట్టబోతున్న రాజ ‘శేఖర్’..