Shashi Preetam : మానసిక వ్యాధితో బాధ పడుతున్న వారికి ధైర్యంగా మారుతున్న సంగీత దర్శకుడు..
ఈ మధ్య కాలంలో సామాన్యులు దగ్గర నుంచి సెలెబ్రెటీస్ వరకు చాలామంది అరుదైన వ్యాధులతో బాధపడుతున్నారు. ఆ వ్యాధులను బయటకి చెప్పుకోలేక మానసికంగా కృంగిపోతున్నారు. అటువంటి వారికి తానే ధైర్యం అవుతున్నాడు ఒకప్పటి టాలీవుడ్ సంగీత దర్శకుడు మరియు దర్శకనిర్మాత 'శశి ప్రీతమ్'. కృష్ణవంశీ 'గులాబీ' సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా వెండితెరకు పరిచయమయ్యాడు ప్రీతమ్.

A music director Shashi Preetam is helping for those suffering from mental illness
Shashi Preetam : ఈ మధ్య కాలంలో సామాన్యులు దగ్గర నుంచి సెలెబ్రెటీస్ వరకు చాలామంది అరుదైన వ్యాధులతో బాధపడుతున్నారు. ఆ వ్యాధులను బయటకి చెప్పుకోలేక మానసికంగా కృంగిపోతున్నారు. అటువంటి వారికి తానే ధైర్యం అవుతున్నాడు ఒకప్పటి టాలీవుడ్ సంగీత దర్శకుడు మరియు దర్శకనిర్మాత ‘శశి ప్రీతమ్’. కృష్ణవంశీ ‘గులాబీ’ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా వెండితెరకు పరిచయమయ్యాడు ప్రీతమ్.
Anu Emmanuel: నాజూకైన అందాలతో ఆకట్టుకుంటోన్న అను ఇమ్మాన్యుయేల్..!
సామాజిక సేవారంగంలోనూ నేను సైతం అంటూ ముందుకు సాగుతున్న ఈ సంగీత దర్శకుడు.. క్యాన్సర్, డయాబెటీస్, మానసిక ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కలిగేలా తన సారథ్యంలో బైక్ అండ్ కార్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో హైదరాబాద్, గుంటూరు, ఒంగోలు జిల్లాలోని పలువురు సేవ సంఘ కార్యకర్తలు, వైద్యరంగ నిష్ణాతులు పలుగున్నారు. ర్యాలీ అనంతరం వీరందరూ సూర్యాపేట, లిటిల్ విలేజ్ లో సమావేశమయ్యారు.
సింగరాజు క్యాన్సర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ మల్లిక్ సింగరాజు, ఆక్రో మెంటల్ హెల్త్ సర్వీసెస్ స్థాపకురాలు మరియు సైకాలజిస్ట్ డాక్టర్ ఐశ్వర్యా కృష్ణప్రియ, మలినేని విద్యాసంస్థల అధినేత డాక్టర్ పెరుమాళ్, సూర్యాపేట “డి.ఎస్.పి” పి.నాగభూషణం, బిగ్ బాస్ ఫేమ్ శ్వేతవర్మ, రొటేరియన్ స్వప్న, నిర్మాత దుష్యంత్ రెడ్డితోపాటు పలువురు వైద్యరంగ నిష్ణాతులు ఈ సమావేశంలో పాల్గొని, ప్రాణాంతక వ్యాధులను ప్రాథమిక దశలో గుర్తించాల్సిన ఆవశ్యకతను వివరించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యాధుల పట్ల నెలకొని ఉన్న అపోహలను, భయాలను పోగొట్టాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు.