రేణు దేశాయ్: ఆద్యా అచ్చం నాన్నలానే ఉంటుంది.

  • Published By: veegamteam ,Published On : January 1, 2020 / 10:49 AM IST
రేణు దేశాయ్: ఆద్యా అచ్చం నాన్నలానే ఉంటుంది.

రేణు దేశాయ్ కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఈ రోజు తన మాజీ భర్త ఫొటోను ఇ‌న్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది. కూతరు ఆద్యతో పవన్ కళ్యాణ్ దిగిన ఫొటోను ఇ‌న్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. పిల్లలు తల్లిదండ్రుల నుంచి లక్షణాలను చాలా అందంగా పొందుతారు. కొన్నిసార్లు ఈమె చూడటానికి అచ్చం నాలానే ఉంటుంది. కానీ చాలాసార్లు వాళ్ల నానమ్మ, నాన్న లా అనిపిస్తుందని రేణు దేశాయ్ పోస్ట్ చేసింది.

ఇదిలా ఉంటే, రేణు దేశాయ్ ఈ మధ్య తన కొడుకు అకీరా చెల్లెలు ఆద్యని ఎత్తుకొని ఉన్న ఫోటోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. మీరు 1, 2, 3 అని లెక్కపెట్టేలోపు నేను మీ ముందు ఉంటా అంటూ ఆద్య, అకీరాను ఉద్దేశించి ఆ పోస్ట్‌ లో పేర్కొన్నారు. అంతేకాదు ఆద్య, అకీరా క్రేజీ ఫెలోస్ కానీ వాళ్లు నా సొంతం అని కూడా అన్నారు. ఈ పోస్ట్‌ పై పవన్ అభిమానులు కొంత మంది విమర్శలు చేశారు. ఆ పిల్లలది ఎంతైనా పవన్ రక్తం కదా అని కామెంట్లు చేశారు. ఈ కామెంట్లకు రేణు దేశాయ్‌ వెంటనే వారికి కౌంటర్ ఇచ్చేశారు.  సైన్స్‌ పరంగా చెప్పాలంటే వారిద్దరిలో ప్రవహించేది నా రక్తం. మీకు సైన్స్‌ తెలిస్తే ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అని అభిమానులపై ఫైర్ అయ్యింది.

మరి రక్తం అన్నందుకే అంతగా కోపం తెచ్చుకున్న రేణు..  ఇప్పుడేమో పవన్ పోలికలు ఉన్నాయంటు చెబుతూ పవన్‌ తో ఆద్య ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం విశేషం. ఈ పోస్ట్‌కు పవన్ ఫ్యాన్స్‌ ఎక్కడ స్పందిస్తారోనని కామెంట్స్ బాక్స్ డిసెబుల్ చేసింది.