Aam Aha : శ్రీకాంత్‌ చేతుల మీదుగా.. డిఫ‌రెంట్ క్రైమ్ థ్రిల్ల‌ర్ ‘అం అః’ ఫస్ట్ లుక్..

సుధాక‌ర్ జంగం, లావ‌ణ్య హీరో హీరోయిన్లుగా నటిస్తున్న‘అం అః’.. ‘ఎ డిఫ‌రెంట్ క్రైమ్ థ్రిల్ల‌ర్’ ఫస్ట్ లుక్ పోస్టర్ సీనియర్ హీరో శ్రీకాంత్ రిలీజ్ చేశారు..

Aam Aha : శ్రీకాంత్‌ చేతుల మీదుగా.. డిఫ‌రెంట్ క్రైమ్ థ్రిల్ల‌ర్ ‘అం అః’ ఫస్ట్ లుక్..

Aam Aha

Aam Aha: డిఫరెంట్ కాన్సెప్ట్, కొత్త నటీనటులతో తెరకెక్కిన చిన్న సినిమాలు పెద్ద విజయాన్ని సాధించిన సంఘటనలు చాలానే ఉన్నాయి.. ఆ కోవలో సుధాక‌ర్ జంగం, లావ‌ణ్య హీరో హీరోయిన్లుగా వస్తున్న చిత్రం ‘అం అః’. ‘ఎ డిఫ‌రెంట్ క్రైమ్ థ్రిల్ల‌ర్’ ట్యాగ్‌లైన్‌. శ్యామ్ మండ‌ల ద‌ర్శ‌కుడు. రంగ‌స్థ‌లం మూవీ మేక‌ర్స్‌, శ్రీ ప‌ద్మ ఫిలిమ్స్ బ్యాన‌ర్స్‌పై నిర్మాత జోరిగే శ్రీనివాస్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్ట‌ర్ సీనియర్ హీరో శ్రీకాంత్ విడుద‌ల చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో శ్రీకాంత్‌తో పాటు నిర్మాత శ్రీనివాస్‌, ద‌ర్శ‌కుడు శ్యామ్ మండ‌ల‌, హీరో సుధాక‌ర్ జంగం, సినిమాటోగ్రాఫ‌ర్ శివారెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Gautham : హ్యాపీ బర్త్‌డే లిటిల్ ప్రిన్స్..

హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. ‘‘అం అః’ మూవీ టైటిల్ చాలా బావుంది. ఇది వ‌ర‌కు నేను కూడా ‘అఆఇఈ’ అనే టైటిల్‌తో సినిమా చేశాను. ఇప్పుడు ‘అం అః’ టైటిల్‌తో సినిమా చేస్తున్నారు. పోస్ట‌ర్‌ విడుద‌ల చేయ‌డం చాలా హ్యాపీగా ఉంది. డైరెక్ట‌ర్ శ్యామ్ మండ‌ల‌, నిర్మాత శ్రీనివాస్‌గారు, హీరో సుధాక‌ర్ అందరూ చక్కటి టీమ్‌గా ఏర్ప‌డి మంచి కంటెంట్‌తో సినిమా చేయ‌డం హ్యాపీగా ఉంది. ఈ మూవీ టీమ్‌ అందరికీ కంగ్రాట్స్‌’’ అన్నారు.

Aam Aha Movie First Look

నిర్మాత జోరిగే శ్రీనివాస్ రావు.. ‘‘మా మూవీ పోస్ట‌ర్‌ విడుద‌ల చేసిన శ్రీకాంత్‌ గారికి థ్యాంక్స్‌. డైరెక్ట‌ర్ శ్యామ్ మండ‌ల‌ అనుకున్న ప్లాన్ ప్ర‌కారం సినిమాను చ‌క్క‌గా పూర్తి చేశారు. శివ‌ త‌న‌ సినిమాటోగ్ర‌ఫీతో సినిమాను రిచ్‌గా ఎలివేట్ చేశారు. అలాగే సినిమా బాగా రావ‌డానికి స‌పోర్ట్ చేసిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌కు థ్యాంక్స్‌’’..

Evaru Meelo Koteeswarulu : జూ. ఎన్టీఆర్ షో లో రాజమౌళి – రాఘవేంద్ర రావు..!

ద‌ర్శ‌కుడు శ్యామ్ మండ‌ల.. ‘‘మా మూవీ ‘అం అః’ పోస్ట‌ర్‌ విడుద‌ల చేసిన శ్రీకాంత్‌ గారికి థ్యాంక్స్‌. క‌రోనా ప‌రిస్థితుల్లోనూ నిర్మాత శ్రీనివాస్‌ గారు ఇచ్చిన స‌పోర్ట్‌తో ‘అం అః’ సినిమాను అనుకున్న స‌మ‌యంలో పూర్తి చేశాను. అంతకు ముందు ఆయ‌నిచ్చిన స‌పోర్ట్‌తోనే ‘ట్రూ’ అనే సినిమాను కూడా పూర్తి చేశాను. నాపై న‌మ్మ‌కంతో శ్రీనివాస్‌ గారు ‘అం అః’ సినిమాను ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా బెస్ట్ అందించారు. సినిమా చాలా గ్రిప్పింగ్‌గా ఉంటుంది. డిఫ‌రెంట్ థ్రిల్ల‌ర్‌.. సినిమాటోగ్రాఫ‌ర్ శివ‌ స‌పోర్ట్‌తో మంచి ఔట్‌పుట్‌ తీసుకొచ్చాను. లైన్ ప్రొడ్యూస‌ర్ ప‌ళ‌ని గారికి థ్యాంక్స్‌. ఆయ‌న ప్రాజెక్ట్‌ను చ‌క్క‌గా ఎగ్జిక్యూట్ చేశారు. హీరో సుధాక‌ర్ కంటెంట్‌ను న‌మ్మి వ‌ర్క్ షాప్ చేసి చ‌క్క‌టి పెర్ఫామెన్స్ ఇచ్చాడు. ఈ టీమ్‌తో మ‌రిన్ని సినిమాలు చేయాల‌ని కోరుకుంటున్నాను’’..

Varudu Kaavalenu : ‘ఆ అందం.. ఆ పొగరు.. ఆర్డర్ ఇచ్చి చేయించినట్టు ఉంటుంది’..

హీరో సుధాక‌ర్ జంగం.. ‘‘మా సినిమాను న‌మ్మి స‌పోర్ట్ చేయ‌డానికి ముందుకు వ‌చ్చిన శ్రీకాంత్‌ గారికి థ్యాంక్స్‌. కొత్త హీరోను ఇంట్ర‌డ్యూస్ చేసిన మా నిర్మాత, డైరెక్ట‌ర్‌కి కృతజ్ఞతలు. ఈ సినిమా కోసం వ‌ర్క్ షాప్ కూడా చేశాం. సినిమాటోగ్రాఫ‌ర్ శివ‌న్న‌, లైన్ ప్రొడ్యూస‌ర్ ప‌ళ‌ని గారికి థ్యాంక్స్‌’’..

సినిమాటోగ్రాఫ‌ర్ శివా రెడ్డి.. ‘‘నాకు అవకాశం ఇచ్చిన నిర్మాత శ్రీనివాస్‌, డైరెక్ట‌ర్ శ్యామ్ మండ‌ల‌ గారికి, లైన్ ప్రొడ్యూస‌ర్ ప‌ళ‌ని గారికి, హీరో సుధాక‌ర్‌ గారికి థ్యాంక్స్‌’’ అన్నారు.