Ira Khan : కాబోయే భర్తతో కలిసి స్టార్ హీరో కూతురు జిమ్ వర్క్ ఔట్స్.. ముద్దు ఎక్స్‌సైజ్ చూశారా..?
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ తనకి కాబోయే భర్తతో కలిసి జిమ్ లో కొత్త కొత్త వర్క్ ఔట్స్ చేస్తుంది.

Aamir Khan daughter Ira Khan kiss work outs with her fiance
Ira Khan – Aamir Khan : బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టకున్నా.. తన సోషల్ మీడియా పోస్టులతో, ప్రేమ, పెళ్లితో నెట్టింట బాగా వైరల్ అవుతుంటుంది. తన ఫిట్ నెస్ ట్రైనర్ నుపుర్ శిఖరేతో గత ఏడాది నిశ్చితార్థం చేసుకున్న ఈ భామ.. ఇప్పుడు పెళ్ళికి సిద్దమవుతుంది. ఇక పెళ్ళికి ముందే తనకి కాబోయే భర్తతో కలిసి జిమ్ లో కొత్త కొత్త వర్క్ ఔట్స్ చేస్తుంది. అందుకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అవుతున్నాయి.
ఐరా ఖాన్, నుపుర్ శిఖరే జిమ్ లో ఇద్దరు కలిసి జంటగా ‘పుల్ అప్స్’ చేశారు. ఈ పుల్ అప్స్ చేసేటప్పుడు ఇద్దరు కౌగిలించుకొని, లిప్ లాక్ పెట్టుకుంటూ కనిపించారు. ఇక ఇది చూసిన నెటిజెన్స్.. ‘ఇవేమి ముద్దు ఎక్స్‌సైజ్ లు అమ్మ’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక కొంతమంది ఈ వీడియో పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ గా రూమ్ లో చేసుకొనే రొమాన్స్ ని వీడియో తీసి ఇలా పబ్లిక్ లో పెట్టి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ముద్దు ఎక్స్‌సైజ్ వీడియో అయితే వైరల్ గా మారింది.
Also read : Samantha : సమంతకు ప్రత్యేక బహుమతి పంపించిన నయనతార.. ఏంటో తెలుసా..?
View this post on Instagram
కాగా ఈ ఇద్దరి పెళ్లి తేదీని ఆమీర్ అధికారికంగా తెలియజేశాడు. 2022లో నవంబర్ 18న నిశ్చితార్థం చేసుకున్న ఐరా ఖాన్, నుపుర్ శిఖరే.. జనవరి 3, 2024 లో పెళ్లి చేసుకోబోతున్నట్లు ఆమిర్ ఖాన్ ప్రకటించాడు. తన కూతురు ఐరా ఖాన్ డిప్రెషన్ లో ఉన్నప్పుడు నుపురే తనకి అండగా నిలబడ్డాడని, తన కూతురికి అంత మంచి భర్త దొరికితే తండ్రిగా తనకి ఎంతో ఆనందంగా ఉంటుందని ఆమిర్ ఎమోషనల్ అయ్యాడు.