Samantha : సమంతకు ప్రత్యేక బహుమతి పంపించిన నయనతార.. ఏంటో తెలుసా..?

ప్రస్తుతం సమంత ప్రపంచదేశాలు చుట్టేస్తూ.. దుబాయ్ చేరుకుంది. ఎక్కడో వెకేషన్ లో ఉన్న సమంతకి నయన్.. పంపించిన బహుమతి ఏంటి..?

Samantha : సమంతకు ప్రత్యేక బహుమతి పంపించిన నయనతార.. ఏంటో తెలుసా..?

Nayanthara sends gift for Samantha post gone viral

Updated On : October 11, 2023 / 5:29 PM IST

Samantha – Nayanthara : లేడీ మెగాస్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న నయనతార.. ఇటీవల జవాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టుని అందుకుంది. షారుఖ్ ఖాన్ సరసన నటించి బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నయన్.. మొదటి సినిమాతోనే బి-టౌన్ లో 1000 కోట్ల హీరోయిన్ అనిపించుకుంది. ఇది ఇలా ఉంటే, ఈ భామ తాజాగా మరో స్టార్ హీరోయిన్ నయనతారకు ఒక బహుమతిని పంపించింది. ప్రస్తుతం సమంత ప్రపంచదేశాలు చుట్టేస్తూ.. దుబాయ్ చేరుకుంది. ఎక్కడో వెకేషన్ లో ఉన్న సమంతకి నయన్.. పంపించిన బహుమతి ఏంటి..?

Also read : Kalki 2898 AD : ప్రభాస్ కల్కి నుంచి అమితాబ్ లుక్ రిలీజ్..

నయనతార నటనతో పాటు ఇటీవల ఒక బిజినెస్ కూడా స్టార్ట్ చేసింది. ‘9 స్కిన్’ అనే కాస్మెటిక్స్ బిజినెస్ స్టార్ట్ చేసి మగువల అందాన్ని మరింత పెంచే ప్రోడక్ట్స్ ని అందుబాటులోకి తీసుకు వస్తుంది. దీంతో తన ‘9 స్కిన్’ సంస్థ నుంచి సమంతకి పేస్ క్రీం ప్రోడక్ట్స్ ని పంపించింది. ఈ విషయాన్ని సమంత తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేస్తూ.. “ఈ ప్రొడక్ట్స్ ఉపయోగించడానికి నేను ఆసక్తిగా చూస్తాను. 9 స్కిన్ కి అల్ ది వెరీ బెస్ట్ నయనతార” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది.

Nayanthara sends gift for Samantha post gone viral

కాగా సమంత తన ఇన్‌స్టాగ్రామ్ లో ఇటీవల కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఆ పిక్ చూసిన నెటిజెన్స్ ఒక విషయం గమనించారు. సమంత నడుము మీద నాగచైతన్య పేరుతో ఉండాల్సిన టాటూ ఇప్పుడు కనిపించడం లేదు. దీంతో ఆమె ఆ టాటూని పూర్తిగా తొలిగించిందా..? అంటూ నెట్టింట చర్చ మొదలయింది. మరో పక్క నాగచైతన్య.. హాష్ తో ఉన్న ఫోటోని షేర్ చేశాడు. సమంత పెంపుడు కుక్క అయిన హాష్.. చైతన్య దగ్గర ఏం చేస్తుందని కూడా సందేహాలు మొదలయ్యాయి.