‘యాక్షన్’ సెన్సార్ పూర్తి – రెండున్నర గంటలు విశాల్ విధ్వంసమే

మాస్‌ హీరో విశాల్‌, తమన్నా హీరో, హీరోయిన్లుగా సుందర్‌ సి. దర్శకత్వంలో రూపొందిన హై ఓల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ 'యాక్షన్‌' సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది..

  • Published By: sekhar ,Published On : November 13, 2019 / 12:10 PM IST
‘యాక్షన్’ సెన్సార్ పూర్తి – రెండున్నర గంటలు విశాల్ విధ్వంసమే

మాస్‌ హీరో విశాల్‌, తమన్నా హీరో, హీరోయిన్లుగా సుందర్‌ సి. దర్శకత్వంలో రూపొందిన హై ఓల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘యాక్షన్‌’ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది..

మాస్‌ హీరో విశాల్‌, తమన్నా హీరో, హీరోయిన్లుగా సుందర్‌ సి. దర్శకత్వంలో రూపొందిన హై ఓల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘యాక్షన్‌’.. ‘హుషారు’, ‘ఇస్మార్ట్‌ శంకర్‌’, ‘గద్దలకొండ గణేష్‌’, ‘రాజుగారిగది3’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాలను డిస్ట్రిబ్యూట్‌ చేసిన శ్రీనివాస్‌ ఆడెపు నిర్మాతగా శ్రీకార్తికేయ సినిమాస్‌ పతాకంపై ‘యాక్షన్‌’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.

నవంబర్‌15న తమిళ్, తెలుగులో ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ సినిమా రీసెంట్‌గా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సినిమా చూసి సెన్సార్ సభ్యులు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. సినిమా నిడివి 2 గంటల 37 నిమిషాల 4 సెకన్లు, విశాల్, తమన్నా చేసిన రిస్కీ స్టంట్స్ ఆడియన్స్‌ను థ్రిల్ చేస్తాయని సెన్సార్ టాక్.

Read Also : స్టైలిష్ స్టార్ చిల్డ్రన్స్ డే సర్‌ప్రైజ్

ఐశ్వర్య లక్ష్మి, ఆకాంక్ష పూరి, ఛాయా సింగ్‌, రాంకీ, ప్రిన్స్, ఆనంద్ రాజ్, అనీష్ కురువిల్లా, కబీర్ దుహాన్ సింగ్, యోగిబాబు తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు మ్యూజిక్ : హిప్ హాప్, సినిమాటోగ్రఫీ : డూడ్లీ, ఎడిటింగ్ : ఎన్బీ శ్రీకాంత్.