ప్రగతి డ్యాన్స్.. మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్..

10TV Telugu News

Pragathi Dance Video Viral: నటి ప్రగతి ఈ మధ్య సోషల్ మీడియాని షేక్ చేసేస్తోంది. అదేంటి ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ కదా.. చాలా చక్కగా పద్ధతిగా చీర కట్టుకుని, తెలుగుదనం కొట్టొచ్చేలా నిండుగా కనిపిస్తుంది కదా. షేక్ చేయడం వంటి మాస్ పదాలు ఆమెకు అన్వయిస్తారేంటి అనుకోకండి.సినిమాల్లో ఉన్నట్లు బయట ఉండరు కదా.. సోషల్ మీడియాలో ప్రగతి ఎలాంటి మోడ్రన్ పిక్స్ పోస్ట్ చేస్తోందో కొత్తగా చెప్పక్కర్లేదు. ఇక జిమ్ ఫొటోలు, డ్యాన్స్ వీడియోల సంగతి సరేసరి.. అసలు ఆమె వేసే డ్యాన్స్ మూమెంట్స్ మామూలుగా ఉండవు మరి.. ఒక్కసారి ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కి వెళ్లి చూస్తే.. ఎవ్వరైనా సరే ఈ విషయం ఒప్పుకోవాల్సిందే.
https://10tv.in/zoom-live-while-having-romance-secretary/
తాజాగా ఆమె డ్యాన్స్ చేస్తున్న ఓ వీడియోని షేర్ చేసింది. తాజాగా ఏముంది.. ఎప్పుడూ డ్యాన్స్ చేస్తున్న వీడియోలను షేర్ చేస్తూనే ఉంటుంది. కానీ ఈసారి ఓ హిందీ పాటకి ఆమె నడుము ఊపుతుంటే ఉంది.. అబ్బో చెప్పలేం.. ఆ వీడియో చూడాల్సిందే. ఎంతో ఈజ్‌తో ఎనర్జిటిక్‌గా ఆమె ఈ పాటకి వేసిన డ్యాన్స్ చూస్తే.. దర్శక నిర్మాతలు హీరోయిన్ అవకాశాలు కూడా ఇచ్చేయవచ్చు. అంతలా ఆకట్టుకుంటుంది మరి. ఇక ఈ వీడియోకి నెటిజన్ల నుంచి లైక్స్, కామెంట్స్ విపరీతంగా వస్తున్నాయి.https://www.instagram.com/p/CEYfGR_jajJ/?utm_source=ig_web_copy_link

×