ముద్దు పెట్టనంటే బెదిరించారు.. సమీరా రెడ్డి షాకింగ్ కామెంట్స్..

  • Published By: sekhar ,Published On : September 5, 2020 / 05:06 PM IST
ముద్దు పెట్టనంటే బెదిరించారు.. సమీరా రెడ్డి షాకింగ్ కామెంట్స్..

Sameera Reddy on Casting Couch: ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు అన్ని చిత్ర పరిశ్రమల్లోనూ కాస్టింగ్ కౌచ్, నెపోటిజం గురించి తీవ్ర చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లు గతంలో వారు ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి మాట్లాడారు. బాలీవుడ్‌తోపాటు తెలుగు సినిమాల్లోనూ నటించిన హైదరాబాదీ భామ సమీరా రెడ్డి తాజాగా తనకెదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలను వివరించింది.



‘‘గతంలో ఓ సినిమా షూటింగ్ మధ్యలో ముద్దు సన్నివేశం గురించి చెప్పారు. ‘స్క్రిప్ట్‌ చెప్పినప్పుడు ఆ సన్నివేశం గురించి చెప్పలేదు కదా’ అంటే.. ‘నిన్ను సినిమాలో నుంచి తొలగించడం పెద్ద కష్టమేం కాదు’ అనే సమాధానం వచ్చింది. అలాగే, ‘నీతో నటించడం చాలా బోరింగ్’ అని ఓ బాలీవుడ్‌ హీరో అన్నాడు. ‘నిన్ను అప్రోచ్‌ అవ్వడం చాలా కష్టం. ఇకపై నీతో కలసి పని చేయను’ అనేశాడు. ‘అన్నట్టుగానే ఆ తర్వాత నన్ను ఎప్పుడూ ఎంపిక చేయలేదు’ అని సమీర తెలిపింది.


అలాగే స్టార్‌ కిడ్స్‌ను ప్రోత్సహించేందుకు తన చేతివరకూ వచ్చిన మూడు సినిమాలను లాగేసుకున్నారని.. సినీ పరిశ్రమ వైకుంఠపాలి వంటిది.. ఇక్కడ ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలని, తప్పటడుగు వేస్తే పాము నోటికి చిక్కినట్టేనని చెప్పుకొచ్చింది సమీరా రెడ్డి.