దీపావళి కానుకగా నవంబర్ 9న OTTలో ‘లక్ష్మీ బాంబ్’

  • Published By: sekhar ,Published On : September 17, 2020 / 02:59 PM IST
దీపావళి కానుకగా నవంబర్ 9న OTTలో ‘లక్ష్మీ బాంబ్’

Laxmmi Bomb to Release Diwali 2020: బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటించిన హారర్ కామెడీ చిత్రం ‘లక్ష్మీ బాంబ్’ మోషన్ పోస్టర్ తాజాగా విడుదలైంది. రెండు విభిన్న లుక్స్‌తో అక్షయ్ ఆకట్టుకున్నాడు. తెలుగు, తమిళంలో మంచి విజయం సాధించిన ‘కాంచన’ హిందీ రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. మాతృకను రూపొందించిన రాఘవ లారెన్స్ ఈ సినిమాకు దర్శకుడు.



ఈ సినిమాలో అక్షయ్ సరసన కైరా అద్వాని హీరోయిన్‌గా నటించింది.. ఎప్పుడో షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఓటీటీ వేదికగా విడుదల కాబోతోంది. దీపావళి కానుకగా నవంబర్ 9న హాట్‌స్టార్‌లో ‘లక్ష్మీ బాంబ్‌’ విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్, ఫాక్స్ స్టార్ స్టూడియోస్, షబీనా ఖాన్, తుషార్ కపూర్ కలిసి నిర్మించారు.