‘బుట్టబొమ్మ’ – వీడియో సాంగ్ వచ్చేసింది..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ ‘అల.. వైకుంఠపురములో’ బుట్టబొమ్మ వీడియో సాంగ్ రిలీజ్..

  • Published By: sekhar ,Published On : February 25, 2020 / 11:21 AM IST
‘బుట్టబొమ్మ’ – వీడియో సాంగ్ వచ్చేసింది..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ ‘అల.. వైకుంఠపురములో’ బుట్టబొమ్మ వీడియో సాంగ్ రిలీజ్..

‘బుట్టబొమ్మ.. బుట్టబొమ్మా.. నన్నుసుట్టూకుంటివే.. జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టూకుంటివే’.. గతకొద్ది రోజులుగా ఎక్కడవిన్నా ఈ పాటే.. సోషల్ మీడియాలో ఎంత వైరల్ అవుతుందో మనం చూశాం. తాజాగా ‘బుట్టబొమ్మ’ ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, హాట్ బ్యూటీ పూజా హెగ్డే జంటగా.. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ ఎంటర్టైనర్..‘అల వైకుంఠపురములో’.. ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’ తర్వాత బన్నీ, త్రివిక్రమ్ కలయికలో రూపొందిన హ్యాట్రిక్ ఫిలిం ఇది. సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై హైయ్యెస్ట్ కలెక్షన్లతో నాన్ బాహుబలి రికార్డ్ క్రియేట్ చేసింది. 

నివేదా పేతురాజ్, టబు, జయరామ్, మురళీ శర్మ, రాజేంద్ర ప్రసాద్, సుశాంత్, సునీల్, నవదీప్ తదితరులు నటించిన ఈ చిత్రం త్వరలో 50 రోజులు పూర్తి చేసుకోబోతోంది. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ట్యూన్, రామజోగయ్య శాస్త్రి లిరిక్స్, అర్మాన్ మాలిక్ వాయిస్, జానీ మాస్టర్ మూమెంట్స్, బన్నీ వేసిన సూపర్బ్ స్టెప్స్, పూజా, బన్నీల కెమిస్ట్రీ, ఏ.ఎస్. ప్రకాష్ వేసిన సెట్స్ ఈ పాటకు హైలెట్.. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ‘బుట్టబొమ్మ’ పాటను టిక్ టాక్ చేసిన సంగతి తెలిసిందే. రేపటి నుంచి (ఫిబ్రవరి 26) సన్ నెక్స్ట్‌లో ‘అల వైకుంఠపురములో’ స్ట్రీమింగ్ కానుంది.