Allu Arjun: ‘బింబిసార’పై బన్నీ హాట్ కామెంట్స్.. ఏమన్నాడంటే?

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘బింబిసార’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. తాజాగా బింబిసార సినిమాపై స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హాట్ కామెంట్స్ చేశారు. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ బింబిసార చిత్రంపై కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Allu Arjun: ‘బింబిసార’పై బన్నీ హాట్ కామెంట్స్.. ఏమన్నాడంటే?

Allu Arjun: నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘బింబిసార’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించగా, ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ పర్ఫార్మెన్స్ మరో లెవెల్‌లో ఉందని ప్రేక్షకులు కితాబిస్తున్నారు. ఈ సినిమాకు ప్రేక్షకులతో పాటు పలువురు సెలబ్రిటీలు సైతం ఫిదా అవుతున్నారు. ఈ సినిమాపై వారు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Bimbisara Collections: బింబిసార 2 రోజుల కలెక్షన్స్.. బొమ్మ బ్లాక్ బస్టర్!

తాజాగా బింబిసార సినిమాపై స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హాట్ కామెంట్స్ చేశారు. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ బింబిసార చిత్రంపై కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. బింబిసార చిత్రం చాలా అద్భుతంగా ఉందని.. కథ చాలా ఇంట్రెస్టింగ్‌గా, ఎంగేజింగ్‌గా ఉందని.. నందమూరి కళ్యాణ్ రామ్ చాలా పవర్‌ఫుల్ పాత్రలో ప్రేక్షకులను మెప్పించారని.. ఆయన ఇండస్ట్రీకి కొత్త ట్యాలెంట్‌ను పరిచయడం చేయడం అభినందనీయమని బన్నీ పేర్కొన్నాడు.

Bimbisara: బింబిసార సక్సెస్.. నందమూరి ఫ్యాన్స్ హ్యాపీ!

ఇక దర్శకుడు వశిష్ఠ ఈ సినిమాను మలిచిన తీరు బాగుందని, ఈ సినిమాలో నటించిన వారందరికీ బన్నీ అభినందనలు తెలిపాడు. బింబిసార చిత్రాన్ని అన్ని వయసుల వారు వీక్షించే సినిమా అని బన్నీ పేర్కొన్నాడు. ఇలా బింబిసార చిత్రంపై బన్నీ చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక బన్నీ చేసిన కామెంట్స్‌కు నందమూరి కళ్యాణ్ రామ్ ధన్యవాదాలు తెలియజేస్తూ ట్వీట్ చేశాడు.