Akhanda : బాలయ్య ఫంక్షన్‌కి బన్నీ గెస్ట్!

‘అఖండ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి అతిథిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్..

Akhanda : బాలయ్య ఫంక్షన్‌కి బన్నీ గెస్ట్!

Akhanda: ‘సింహా’, ‘లెజెండ్’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్స్ తర్వాత బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న ప్రెస్టీజియస్ అండ్ మోస్ట్ అవైటెడ్ హ్యాట్రిక్ ఫిలిం ‘అఖండ’. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ మీద యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ మిలయన్ల కొద్దీ వ్యూస్, మంచి లైక్స్‌తో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

Akhanda : రికార్డులు మొదలు.. సరైన మాస్ బొమ్మ పడితే.. బాలయ్యను ఆపడం కష్టం..

నవంబర్ 27న హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో గ్రాండ్‌గా ‘అఖండ’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ప్లాన్ చేశారు మేకర్స్. ఈ కార్యక్రమానికి ముందుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా రాబోతున్నారని, తర్వాత నేచురల్ స్టార్ నాని వస్తున్నాడని కూడా అన్నారు.

Thaman S : వాళ్లిద్దరూ కలిసి వంద సినిమాలు చేసినా ఫ్లాప్ అవ్వవ్-తమన్..

కట్ చేస్తే.. బాలయ్య సినిమా ఫంక్షన్‌కి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా అటెండ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. బాలయ్య సినిమా ఈవెంట్‌కి బన్నీ గెస్ట్ అనగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. భారీ అంచనాల మధ్య డిసెంబర్ 2న ‘అఖండ’ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.