Allu Arjun : నాకు అన్ని ఇచ్చింది ఆయనే.. నాకు ఆయనే దేవుడు.. అల్లు అర్జున్!

అల్లు అర్జున్ తాజాగా తెలుగు ఇండియన్ ఐడల్ షోకి హాజరయ్యాడు. ఇక ఈ షోలో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. నాకు దేవుడు ఎలా ఉంటాడో తెలియదు. నాకు తెలిసిన దేవుడు..

Allu Arjun : నాకు అన్ని ఇచ్చింది ఆయనే.. నాకు ఆయనే దేవుడు.. అల్లు అర్జున్!

Allu Arjun say his father is all to him and he praise like a god

Icon Star Allu Arjun : టాలీవుడ్ హీరో అల్లు అర్జున్.. స్టైలిష్ స్టార్ నుంచి నేడు ఐకాన్ స్టార్ గా పాన్ ఇండియా వైడ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. నార్త్ టు సౌత్ ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంటూ రియల్ పాన్ ఇండియా స్టార్ అనిపించుకుంటున్నాడు. తాజాగా ఈ హీరో ప్రముఖ ఓటీటీ ఆహాలో ప్రసారమవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ (Telugu Indian Idol) షోకి హాజరయ్యాడు. ఈ షో సీజన్ 2 ఫైనల్ కి చేరుకోగా.. విజేతలకు అవార్డు ఇచ్చేందుకు అల్లు అర్జున్ అతిథిగా వచ్చాడు.

Allu Arjun : అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాల అప్డేట్స్ ఇచ్చిన బన్నీ వాసు.. పుష్ప 2 రిలీజ్ ఎప్పుడో తెలుసా?

ఇక ఈ షోలో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. “నాకు దేవుడు ఎలా ఉంటాడో తెలియదు. నాకు తెలిసిన దేవుడు మా నాన్న. ఆయనే నాకు అన్ని ఇచ్చింది” అంటూ ఎమోషనల్ అయ్యాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ షోలో అల్లు అర్జున్ ఫుల్ ఆన్ ఎంటర్టైనర్ గా ఆడియన్స్ కి కనిపించబోతున్నాడు. ఈ షో జూన్ 3, 4 తేదీల్లో ప్రసారం కానుంది. కాగా అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సుకుమార్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు.

Sharwanand : యాక్సిడెంట్ పై శర్వానంద్ ట్వీట్.. నేను క్షేమంగానే ఉన్నాను!

పుష్ప 1 సూపర్ హిట్ అవ్వడంతో సెకండ్ పార్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్ సినిమా పై అంచనాలు మరింత పెంచేసింది. రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్ గా నటిస్తుంది. ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil) ఈ సెకండ్ పార్ట్ లో విలన్ గా కనిపించబోతున్నాడు. కాగా ఈ మూవీ రిలీజ్ పై ఇప్పటివరకు మేకర్స్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.