‘అహా’ కోసం బన్నీ, త్రివిక్రమ్ – నాలుగోసారి..

‘అహా’ ప్రమోషనల్ వీడియో కోసం నాలుగోసారి కలిసి పనిచేయనున్న అల్లు అర్జున్, త్రివిక్రమ్..

  • Published By: sekhar ,Published On : March 8, 2020 / 07:31 AM IST
‘అహా’ కోసం బన్నీ, త్రివిక్రమ్ – నాలుగోసారి..

‘అహా’ ప్రమోషనల్ వీడియో కోసం నాలుగోసారి కలిసి పనిచేయనున్న అల్లు అర్జున్, త్రివిక్రమ్..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మళ్లీ కలిసి పనిచేయబోతున్నారు అనే వార్త ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది. ‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, తాజాగా ‘అల.. వైకుంఠపురములో’.. ఈ కాంబోలో హ్యాట్రిక్ హిట్స్ వచ్చాయి. నాలుగోసారి త్రివిక్రమ్, బన్నీని డైరెక్ట్ చేయనున్నాడు.

బన్నీ, సుకుమార్ సినిమాతో.. త్రివిక్రమ్, ఎన్టీఆర్ సినిమాతో బిజీగా ఉన్నారు మరి కలిసి పనిచేయడం ఆలస్యమవుతుందేమో కదా అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే వీళ్లిద్దరు కలిసి వర్క్ చేయబోతుంది సినిమా కోసం కాదు. ఓ ప్రమోషనల్ వీడియో కోసం.. ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, మైహోమ్స్ రామేశ్వరరావ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ ‘అహా’ ఓటీటీ(OTT) ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

ఇప్పటికే పలు లేటెస్ట్ మూవీస్ స్ట్రీమింగ్ అవుతండగా వెబ్ సిరీస్ ప్రొడక్షన్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నాయి. నవదీప్, బిందు మాధవి, విజయ్ దేవరకొండ వంటి సెలబ్స్ ‘అహా’కు ప్రమోటర్స్‌గా వ్యవహరిస్తున్నారు. App ప్రమోషన్ కోసం సరికొత్త కాన్సెప్ట్‌తో త్రివిక్రమ్, బన్నీతో కలిసి ఓ ప్రమోషనల్ వీడియో రూపొందించనున్నారు. త్వరలో షూట్ ప్రారంభంకానుందని ఫిలింనగర్ టాక్.